/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిని గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని ఇంటింటికి ప్రచారం Vijay.S
భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థిని గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని ఇంటింటికి ప్రచారం


సిపిఎం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎండి జాంగిర్ ని గెలిపించాలని ఈరోజు బోనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నరసింహ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న ఎండి జాంగిరి చిన్నతనం నుండి ఉపాధి హామీ కూలీల కోసం రైతుల కోసం కార్మికుల కోసం నిరుద్యోగ సమస్యలపై అదేవిధంగా కాలువల కావాలని బసాపురం రిజర్వాయర్ నుండి వడపర్తి గతంలోకి నీళ్లు తేవాలని ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది కావున ప్రజలందరూ ఎండి జాంగిర్ కు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే భువనగిరి పార్లమెంటును అభివృద్ధి పథంలో చేస్తారని నరసింహ అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య గ్రామ నాయకులు పాండాల ఆంజనేయులు మల్లేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి లో వీర హనుమాన్ విజయ యాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయత్ర బైక్ ర్యాలీ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు భువనగిరి పెరుమాండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పోతనక్ రాఘవేందర్ గారు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు బైక్ ర్యాలీ పట్టణంలో పురవీధుల గుండా తిరిగి జగదేవపూర్ రోడ్డులో గల అంజనాద్రి హనుమాన్ దేవాలయం వద్ద ముగిసింది స్థానిక వినాయక చౌరస్తా వద్ద హిందుత్వవాది చికోటి ప్రవీణ్ హాజరై ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ హిందూ వ్యతిరేకులు హిందూ సమాజంపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వీరత్వం విశ్వరూపం చూపుదాం పౌరుషం పరాక్రమం ప్రదర్శించుదాం అని పిలుపునిచ్చారు హిందూ యువకులను పోరాట యోధులుగా తయారు చేయడం కోసం బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ద్వారా చైతన్యవంతులై హిందూ యువకులు గోరక్ష మతమార్పిడులు మరియు లవ్ జిహాద్ ల నుంచి హిందూ ఆడపిల్లలను సంరక్షించుకోవడం కోసం చైతన్యాన్ని పొంది ప్రతి హిందూ యువకుడు పని చేయాలని పిలుపునిచ్చారు హిందువులంటే కేవలం సౌమ్యంగా ఉండేవారు మాత్రమే కాదని హిందూ దేవతల్లాగా ఆయుధాలను చేపట్టి ధర్మాన్ని కాపాడడం కోసం దుష్ట శిక్షణ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సహకార్యదర్శి తోట భాను ప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జగదేపూర్ రోడ్డులో ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ ముగింపు జరిగే అంజనాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల ఉద్దేశించి భువనగిరి పట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా మనం ఇలా శోభాయాత్ర చేసుకుంటున్నారని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని పిలుపునిచ్చారు హిందువుగా పుట్టినందుకు హిందువునని ప్రతి హిందువు గర్వపడాలని అప్పుడే ఇతర మతాలను తను గౌరవించగలడని తెలిపారు కార్యక్రమంలో బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను ప్రసాద్ కో కన్వీనర్ మార్కాశ్రవణ్ కోకల సందీప్ పొన్నాల వినయ్ భువనగిరి పట్టణ కన్వీనర్ నమిలే నవీన్ భువనగిరి మండల కన్వీనర్ పిన్నపురాళ్ల రాజకుమార్ వెల్దుర్తి అవినాష్ జడల అక్షయ్ విశ్వహిందూ పరిషత్ కార్య అధ్యక్షులు పోల శ్రీనివాస్ గుప్తా ఉపాధ్యక్షులు పసుపునూరి మనోహర్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ పట్టణ కార్యదర్శి సాల్వేర్ వేణు జిల్లా మందిర్ అర్చక పురోహిత్ ప్రముక్ ఆకుల అనిల్ సహా కార్యదర్శి పోచంగళ్ళ బాబు జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు సంతోష్ రెడ్డి యాదాద్రి ప్రఖండ అద్యక్షులు ఎరుకల అనిల్ మండల అధ్యక్షులు గుండె శ్రీరాములు సహకార దర్శి రేడ్డబోయిన బాలరాజు పూస శ్రీనివాస్ దొమ్మాటి ప్రసాద్ బింగి భరత్ సండే మయూర్ ఉడుత గణేష్ బానోతు కిట్టు శ్రవణ్ కుమార్ శ్రీరామ్ శ్రీనివాస్ చారి వల్లబోజు సతీష్ జిల్లా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ముఖ్య కార్యకర్తలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు హిందూ సంగటిత శక్తి ప్రదర్శన నినాదంతో చేపట్టిన వీర హనుమాన్ విజయ యాత్రను యువకుల శక్తి ప్రదర్శనతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన విశ్వహిందూ పరిషత్ నాయకులు.

35 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జహంగీర్ ని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య

35 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా పోరాడుతున్న ప్రజా నాయకుడు సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ఓటర్లను కోరారు

  మంగళవారం మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు వెతుక్కోకుండా వచ్చిన ఉద్యోగాలను పక్కకు పెట్టి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యార్థి,యువజన సమస్యలతో పాటు ప్రజా సమస్యల కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చి పనిచేస్తున్న పేదలబిడ్డ జహంగీర్ ఎన్నికల్లో పార్లమెంట్ కు పోటీ చేస్తున్నారని ప్రజలందరూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే పేదల అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు

   కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రద్దు చేసే కుట్రలు చేస్తుందన్నారు ఈ చట్టం వల్ల పనులు లేని అనేక పేద కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని పేదల నోటికాడి ముద్దను లేకుండా చేయాలని కుట్ట చేస్తున్న బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించాలని, ఉపాధి హామీ చట్టరక్షణకై పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జహంగీర్ ఈ ప్రాంత అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నడిపారని మూసి జల కాలుష్య నివారణకై మూసి ప్రాంతంలో గోదావరి జలాల సాధనకై స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, భూమి లేని పేదలకు భూమి పంచాలని,ఇండ్లు,ఇండ్ల స్థలాల సాధన డిమాండ్ తో అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు అందుకే ప్రజల కోసం పోరాడే అభ్యర్థిని గెలిపిస్తే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తారని ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,సిపిఎం శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి,సిపిఎం నాయకులు మాజీ ఉపసర్పంచ్ లు ఆకుల మారయ్య,మాడుగుల వెంకటేశం,సీనియర్ నాయకులు చేగురి నర్సింహా,సిపిఎం సహాయ కార్యదర్శి రొండి మల్లేశం, ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు వేముల జ్యోతిబసు,తదితరులు పాల్గొన్నారు.

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి; వల్దాస్ రాజ్ కాళ భైరవ కిసాన్ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీ

భువనగిరి మండల్ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మనిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ భస్వాపురం,వడపర్తి,హన్మపురం గ్రామాల ఐకేపీ సెంటర్లని సందర్శించడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యలన్నారు. పంటవేసినంక చేతికొచ్చెదాక ఓక ఎత్తు అయితే చేతికివచ్చినంక ఐకేపీ సెంటర్ లలో ధాన్యం కొనుగోలు చెయ్యడం ఓక ఎత్తు అయిందన్నారు. వర్షాలు పడే సూచనలు వస్తున్నాయి. ఐకేపి సెంటర్ లో ధాన్యం తడిచి పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు చెయ్యలని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారుతలేవన్నారు. గత ప్రభుత్వం ఇలానే చేస్తే ప్రజలు, రైతులు ఆ ప్రభుత్వాన్ని ఏక్కడ ఉంచారో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూశారన్నారు. వెంటనే ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 

రెండు లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా క్రింద 15000,రైతు కూలీలకు 12000,కౌలు రైతులకు 15000 ఇస్తామని వంద రోజు ల్లో ఇస్తామనీ చెప్పి అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం ఆ హామీలను గాలికి వదిలేసి తప్పుడు మటాలతో ప్రజలలోకీ వస్తున్నారన్నారు. ఈ ఎలక్షన్ లో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 23 తారీఖు నా భువనగిరి MP బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి నామినేషన్ భువనగిరి లో ర్యాలీ ఉన్నందున అత్యధికంగా రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి గారు, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కుషంగల ప్రభాకర్,మండల ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు బబ్బురి సురేష్, మండల్ కిసాన్ మోర్చ సెక్రటరీ ఏడ్ల చంద్రశేఖర్, కిసాన్ మోర్చ మండల నాయకులు పిన్నం నారాయణ,మండల నాయకులు పిన్నం గనేష్,కడారి వెంకటేష్,అన్నెపు బాను తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి:

          

  ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం అభ్యర్థి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నరసింహ పిలుపునిచ్చారు. సోమవారం బోనగిరి మండల పరిధిలోని నందనం, ముస్తాలపల్లి గ్రామాలలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈసంర్భంగా నర్సింహ మాట్లాడుతూ సిపిఎం ఆధ్వర్యంలో అనేక కూలీ భూమి పోరాటాలు కార్మికుల కర్షకుల హక్కుల కోసం అనేక సమరశీల పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించామని నిరంతరం రైతులు ప్రజలు వ్యవసాయ కూలీలు సంఘటిత అసంఘటిత కార్మికుల పక్షాన సిపిఎం అభ్యర్థి అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నదని తెలియజేశారు. సిపిఎం అభ్యర్థి జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతాన్ని విద్య వైద్యం ఉపాధి పరంగా ముందు భాగంలో పెట్టడానికి కృషి చేస్తాడని ప్రజలందరూ ప్రజల పక్షాన ప్రజల మధ్యన ఉండే జహంగీర్ ని గెలిపించాలని వారు కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి, నాయకులు కళ్లెం లక్ష్మీ నరసయ్య, భూపాల్ రెడ్డి, లచ్చిరెడ్డి, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.

        

భువనగిరి మండలంలో పలు గ్రామాల్లో ఐకెపి సెంటర్ లను సందర్శించిన మండల కిసాన్ మోర్చానాయకులు

వల్దాస్ రాజ్ కాళభైరవ

కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ

భువనగిరి మండల్ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మనిక్యం రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చ జిల్లా సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ భస్వాపురం,వడపర్తి,హన్మపురం గ్రామాల ఐకేపీ సెంటర్లని సందర్శించడం జరిగింది.

ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యలన్నారు. పంటవేసినంక చేతికొచ్చెదాక ఓక ఎత్తు అయితే చేతికివచ్చినంక ఐకేపీ సెంటర్ లలో ధాన్యం కొనుగోలు చెయ్యడం ఓక ఎత్తు అయిందన్నారు. వర్షాలు పడే సూచనలు వస్తున్నాయి. ఐకేపి సెంటర్ లో ధాన్యం తడిచి పోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కొనుగోలు చెయ్యలని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారుతలేవన్నారు. గత ప్రభుత్వం ఇలానే చేస్తే ప్రజలు, రైతులు ఆ ప్రభుత్వాన్ని ఏక్కడ ఉంచారో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూశారన్నారు. వెంటనే ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 

రెండు లక్షల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా క్రింద 15000,రైతు కూలీలకు 12000,కౌలు రైతులకు 15000 ఇస్తామని వంద రోజు ల్లో ఇస్తామనీ చెప్పి అధికారం చేపట్టిన ఈ ప్రభుత్వం ఆ హామీలను గాలికి వదిలేసి తప్పుడు మటాలతో ప్రజలలోకీ వస్తున్నారన్నారు. ఈ ఎలక్షన్ లో మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ నెల 23 తారీఖు నా భువనగిరి MP బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి నామినేషన్ భువనగిరి లో ర్యాలీ ఉన్నందున అత్యధికంగా రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి గారు, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కుషంగల ప్రభాకర్,మండల ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, కిసాన్ మోర్చ మండల ఉపాధ్యక్షులు బబ్బురి సురేష్, మండల్ కిసాన్ మోర్చ సెక్రటరీ ఏడ్ల చంద్రశేఖర్, కిసాన్ మోర్చ మండల నాయకులు పిన్నం నారాయణ,మండల నాయకులు పిన్నం గనేష్,కడారి వెంకటేష్,అన్నెపు బాను తదితరులు పాల్గొన్నారు.

చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లండన్ లో లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లండన్ ఎన్నారైలు


భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదివారం

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లండన్ ఎన్నారై ల విజ్ఞప్తి లండన్ లో  లండన్ బ్రిడ్జి వద్ద భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ వివిధ గ్రామాల లండన్ ఎన్నారై ల చామల కిరణ్ కుమార్ రెడ్డి ని భారీ మేజారిటి తో గెలిపించాలని ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో భువనగిరి గిరి నియోజకవర్గం కి చెందిన ఎన్నారై లు అమరపాల్ రెడ్డి 

అభినవ్ 

కిట్టు 

రఘుపతి 

రాజేందర్ ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

విద్యార్థి దశ నుండే విద్యార్థి నాయకుని గ యువజన నాయకుని గ అనేక ప్రజా సమస్యలు పరిష్కరించడం లో ఎంతో కృషి చేసారు.

ప్రజల మధ్యలో నిరంతరం ఉంటూ ప్రజల తోనే జీవితం మమేకం అయిన కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గ గెలిస్తే, నియోజకవర్గం కి ఎన్ని విధాల మేలు జరుగుతుంది అని అన్నారు 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 లక్షల మెజారిటీ తో భువనగిరి కాంగ్రెస్ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తపరిచారు.

గంప వేణుగోపాల్ 

కన్వీనర్ 

టీపీసీసీ ఎన్నారై సెల్

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు ఎదురు గట్ల బాల నరసింహ


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు. ఎదురుగట్ల బాల నరసింహ వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య . కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బోళ్ళ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి , కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. బత్తిని లింగయ్య ,కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు బత్తిని సహదేవ్ ,మండల నాయకులు కుందారపు కొమురయ్య , బత్తిని సత్యనారాయణ , ఎమ్మె మల్లేశం , కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోలేపాక జానకి రాములు ,తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి రోడ్ షో లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వారు మాట్లాడుతూ భువనగిరి గడ్డ పోరాటాలకు స్ఫూర్తిని అన్నారు. కష్ట నష్టాల్లో పేదలకు సేవలు అందించిన మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ,తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని అన్నారు .తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవిని తీసుకుంటానని చెప్పి నలగొండ పోరాట యోధుడు వెంకటరెడ్డి అని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. పోటీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకున్న వ్యక్తి కెసిఆర్ ,కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 30 వేల ఉద్యోగాలు వివరాలు ఇస్తామని అన్నారు. దమ్ముంటే భువనగిరి సెంటర్ కు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కాంగ్రెస్ను ఓడించాలా ? రాజీవ్ ఆరోగ్యశ్రీ  ద్వారా రూపాయలు 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించినందుకు కాంగ్రెస్ని ఓడించాలా ? అని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకు కాంగ్రెస్ను ఓడించాలా ? వంద రోజుల్లో పేదల సంక్షేమానికి ఇచ్చిన ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అని కేసిఆర్ అంటున్నాడు. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు, కళాకారులు, కార్యకర్తలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భువనగిరి లో ముఖ్యమంత్రి రోడ్ షో తో ప్రయాణికుల పాట్లు


 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి భువనగిరి లో నిర్వహించిన రోడ్ షో తో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్టీసీ బస్సులు భువనగిరి బస్ స్టేషన్ లోకి రాక పోవడంతో గంటల తరబడి ప్రయాణికులు, పసి పిల్లలతో భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆదివారం సెలవు దినం కావడం, పెళ్ళిళ్ళు ఉండడం తో ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి రోడ్ షో ప్రచారం కోసం ప్రజలను తరలించిన ప్రైవేటు వాహనాలు , కార్లు, ఇతర వాహనాలు భువనగిరి బస్ స్టేషన్లో నిలిపి, ప్రైవేటు పార్కింగ్ గా మార్చి వేసారు. దీంతో అటు నల్లగొండ నుండి వచ్చే వాహనాలు బైపాస్ వద్ద నిలిపివేయడం, నల్గొండ కు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆటోల ద్వారా బైపాస్ వరకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్, వరంగల్ వెళ్ళే ప్రయాణికులు కూడా గంటల తరబడి భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రోడ్ షో ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. జిల్లా పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆరోపించారు. కేవలం ఒక్క నల్గొండ రూట్ ఆర్టీసీ ప్రయాణికులకు కేటాయిస్తే సమస్య ఉండేది కాదని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రచార సభ ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా నిర్వహిస్తే బాగుండేదని ఆయన అన్నారు. అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.