/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: కొండగట్టు ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా పడి 11 మందికి తీవ్ర గాయాలు Mane Praveen
TS: కొండగట్టు ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా పడి 11 మందికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా పడిన ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్లో కిందకు దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి, బోల్తా పడడంతో 11 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

స్థానికులు స్పందించి అంబులెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆటో లోని ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

NLG: నల్లగొండ ఎం.పీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి ని ప్రకటించిన కాంగ్రెస్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది.

నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షట్కర్, చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘు రఘువీర్ రెడ్డి ని నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితా విడుదల చేసింది.

NLG: రూ.326 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ పట్టణంలో రూ. 326 కోట్ల వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ చుట్టూ రూ. 700 కోట్ల వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. 

ముషంపల్లి డబల్ రోడ్డు కు రూ. 100 కోట్ల ఇప్పటికే కేటాయించామని, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 6000 మంది విద్యార్థులతో జాబ్ మేళ నిర్వహించామన్నారు. రాబోయే రెండు నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.

ఎస్ ఎల్ బి సి కాల్వ లైనింగ్ పనులను చేస్తున్నామని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడాని నిధులను మంజూరు చేయించామని, త్వరలోనే ఆ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలపారు. ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేదలకు సబ్సిడీ భోజన పథకం అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిరుపేదల కు సబ్సిడీ భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నల్లగొండ: పట్టణంలోని సూర్య నగర్ కాలనీలో మహిళలు శుక్రవారం 'అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని' ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాండ్రల స్వాతి, సుంకరబోయిన యశోద, యమున, మహేశ్వరి, పద్మ, పారిజాత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

NLG: శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహా యజ్ఞం

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, శివాలయం లో స్వామివారి మహా యజ్ఞాన్ని వేదమంత్రాలతో.. పండితులు రామకోటి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ దయానంద గిరి స్వామి, నారాయణపురం ఆశ్రమం శంకరానంద గిరిస్వామి, గుంటూరు ఆశ్రమం పూర్ణానంద స్వామి, ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. శివలింగాలకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి యాజ్ఞాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, వీరమల్ల శ్వేతా నాగరాజు, దోటి పరమేష్, పెద్దిరెడ్డి రాజు, అల్లంపల్లి ఆనంద్ కుమార్, కోట రఘు నందన్, ఉప్పల సత్యనారాయణ, నేర్లకంటి కేశవులు, కానబోయిన ఈశ్వరయ్య, గుర్రం కైలాసమ్మ, సంగెం పరంధాములు, పూల యాదగిరి, ఈదశేఖర్, పానుగంటి పెద్ద వెంకటయ్య, తిరుమణి శేఖర్, పెద్దిరెడ్డి జంగారెడ్డి, నాంపల్లి చంద్రమౌళి, పూల చిన్న వెంకటయ్య, కంశెట్టి చత్రపతి, సుదర్శన చారి, కర్నాటి నాగరాజు, రాందాస్ తండా రాజ్య గురుస్వామి, ఎస్కే కాజాబి,గాలేంక సంతోష వినోద్ కుమార్, కాంశెట్టి అంజూర శ్రీనివాస్, నక్క భువనేశ్వర్, పానుగంటి మహేష్, కంశెట్టి శ్రీకాంత్, గౌరు కిరణ్, కోరే శివ, సింగారపు గిరి, పూల శ్రీను మారయ్య గుర్రం శ్రీరాములు, పానుగంటి లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.

NLG: వ్యాయామ ఉపాధ్యాయనీయులకు, జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణులకు సన్మానం

నల్లగొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో, పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయునీలు దగ్గుపాటి విమల, నారాయణ కవిత, కందుకూరి శైలజ లను మరియు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీల్లో పాల్గొన్న మద్ది కీర్తన, అప్పల సోని, మద్ది అమూల్య లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు బొమ్మపాల గిరిబాబు, ఫుట్బాల్ కోచ్ కరుణాకర్, ఖో ఖో కోచ్ మధు, సైదులు, గణేష్, తదితరులు  పాల్గొన్నారు.
YDD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్టు షాపులను నివారించేందుకు ప్రతిజ్ఞ చేసిన వెన్ రెడ్డి రాజు

యాదాద్రి జిల్లా, చౌటుప్పల్:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా బెల్టు షాపులను నివారించేవరకు విశ్రమించ వద్దని తెలంగాణ మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్ల కార్డులు పట్టుకొని బెల్టు షాపులను నివారిస్తామని నినదించి, ప్రతిజ్ఞ చేశారు.

దిక్కులు పిక్కటిల్లేలా బెల్టు షాపులను నివారిద్దాం- కుటుంబాలను కాపాడుకుందాం అని పెద్ద ఎత్తున నినాదం చేశారు. బెల్టు షాపుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

ఈ సందర్బంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో, మునుగోడు గడ్డ బెల్టు షాపులు నివారిస్తూ పునీతం అవుతుందన్నారు. ఒక్క రాజగోపాల్ రెడ్డి పిలుపుతో బెల్టు షాపు నిర్వాహకులు తట్ట బుట్ట సదురుకొని చిత్తగించారని, ఇది మహిళాల విజయమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబనతో మహిళలు అన్నీ రంగాలలో ముందుకు వెళ్లాలని, మహిళలు తలుచుకుంటే సాదించలేనిది ఏది లేదన్నారు. అన్నీ రంగాలకు సంబందించిన మహిళలను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమములో ఉప వైద్య అధికారి డా. యశోదా, మూన్సిపల్ కమీషనర్ యన్. వేంకటేశ్వర నాయక్, తహశీల్దార్ యస్. హరి కృష్ణ, కౌన్సిలర్లు కసర్ల మంజుల,

శ్రీనివాస్ రెడ్డి, కామిశెట్టి శైలజ భాస్కర్, సందగల్ల విజయ సతీష్, బాత్తుల రాజ్యలక్ష్మి స్వామి, కొయ్యడ సైదులు, పోలోజు శ్రీదర్ బాబు, విద్యా సంస్థల చైర్మెన్ ఉజ్జిని మంజుల, తంగడపల్లి ప్రదానోపాద్యాయులు భార్గవి, వివిద రంగాల అధికారులు కవిత, శోభారాణి, ఆర్పీలు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఆశ వర్కర్ల తో పాటు భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

NLG: పచ్చల సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా మహేశ్వరుడు దీవించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని పానగల్ పచ్చల సోమేశ్వరాలయం లో మంత్రి అభిషేకం తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ చైర్మన్, ప్రధాన అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలోనే ఆధ్యాత్మికపరంగా, ఆర్కియాలజీ పరంగా ప్రత్యేకమైన దేవాలయం నల్గొండలోని పచ్చల సోమేశ్వరాలయం, చాయా సోమేశ్వరాలయాలు విలసిల్లుతున్నాయన్నారు. ఛాయా సోమేశ్వరాలయాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆర్కేయాలజీ నిపుణులు వచ్చి పరిశీలించారన్నారు.

ఇంతటి మహత్యం కలిగిన ఈ ఆలయాలలో పూజలు జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు.

వచ్చే సంవత్సరం శివరాత్రి నాటికి ఈ ఆలయాలన్ని మరింత అభివృద్ధి చేస్తామని, శివరాత్రి పర్వదినం రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సైతం రావడం చాలా సంతోషమని తెలిపారు. సమాజంలోని మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలని, తమది మహిళల సంక్షేమ ప్రభుత్వమని, ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని, మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించి ఆలయాలను సందర్శించుకోవడం చాలా సంతోషం కలిగిస్తున్నదని అన్నారు.

ఇప్పటికే మహిళలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. త్వరలోనే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నామని, ప్రతి మహిళకు, మహిళా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆలయ చైర్మన్ సూర మహేష్, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

NLG: ఎన్జీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల లోని మహిళా సాధికారత విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సమూద్రాల ఉపేందర్, కన్వీనర్ గా డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి వ్వహరించగా ముఖ్య అతిధిగా ప్రముఖ నటి,ఇండిఫేమ్ సిఇఒ దాస్యం గీతా భాస్కర్, గౌరవ అతిధి గా జిల్లా ఎస్పీ చందనా దీప్తి హాజరయి విద్యార్థులకు దిశానిర్దేశం చేసారు.

గీతా భాస్కర్ మాట్లాడుతూ.. ఆడ, మగ మద్య ఉండాల్సింది హక్కుల కోసం పోరాటం కాదు అవగాహన తో కూడిన ప్రోత్సాహకం అని, స్త్రీలు పరిస్థితులకు భయపడకుండా జీవితాన్ని ఒక లక్ష్యం తో తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

ఎస్ పి చందనా దీప్తి మాట్లాడుతూ.. ఆడవారు ఆర్థికంగా స్వతంత్రత కలిగి ఉండాలని, ఇటు కుటుంబ పాలన అటు కెరియర్ రెండింటిని సమర్థవంతంగా నిర్వర్తించడంలో ఆడవారికి మాత్రమే మనోధైర్యం ఎక్కువ అని అభివర్ణించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు అన్ని రంగాలలో దూసుకుని పోవాలని పేర్కొన్నారు.

విద్యార్థుల ఆట పాటలతో కార్యక్రమమంతా చాలా ఆహ్లాదకరంగా సాగింది. ఆ తర్వాత ఆటల పోటీలు ఇతర కల్చరల్ పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథి మరియు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో లైబ్రరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ మల్లేశం, డాక్డర్ దీపిక, సి.శివరాణి, శిరీష, సావిత్రి, సరిత, మహేశ్వరి, సంద్యా, శ్వేత, కవిత, రజని, ఆష్రఫ్, యాదగిరి రెడ్డి, సుధాకర్, వేణు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: నేటి బాలికలే రేపటి ఉత్తమ మహిళలుగా అభివృద్ధి చెందాలి: డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు

నల్గొండ: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా, బి సి బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి కత్తుల శంకర్ అధ్యక్షతన, జరిగిన సమావేశానికి డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ.. నేటి బాలికలే రేపటి ఉత్తమ మహిళలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల డిప్యూటీ వార్డెన్ అశోకారాణి ని సన్మానించారు.

ఈ సమావేశం అనంతరం బాలికలు సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.