NLG: లబ్ధిదారుల దరఖాస్తు లలో సవరణలను జాగ్రత్తగా చేయాలి: జిల్లా కలెక్టర్ హరిచందన
ప్రజా పాలన సేవా కేంద్రాలలో లబ్ధిదారుల దరఖాస్తులలో సవరణలను జాగ్రత్తగా చేయాలని, జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్తు బిల్లు, ఎల్పిజి కనెక్షన్ కింద రూ.500/- లకు సిలిండర్ పొందేందుకు సేవా కేంద్రానికి వచ్చిన లబ్ధిదారుల తో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ముందుగా జొన్నగడ్డల గూడెం గ్రామానికి చెందిన ఎం. కోటయ్యతో మాట్లాడుతూ.. దేనికోసం ఎంపీడీవో కార్యాలయం వచ్చారని అడిగారు.
గృహ జ్యోతి కింద జీరో బిల్లు కోసం, అలాగే 500 రూపాయల ఎల్పీజీ కనెక్షన్ కోసం వచ్చానని కోటయ్య జిల్లా కలెక్టర్ కు తెలుపగా, సేవా కేంద్రంలో ఆ రెండింటికి సంబంధించిన సవరణలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి జీరో విద్యుత్ బిల్లు రసీదు ను కోటయ్య కు అందజేశారు.మరికొందరు లబ్ధిదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు.
500 రూపాయలకే ఎల్ పి జి సిలిండర్ పొందేందుకు ప్రజాపాలన దరఖాస్తులో వినియోగదారు నంబర్ల సవరణ లు పరిశీలించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి ,తహసిల్దార్ స్వప్న, తదితరులు ఉన్నారు.
Mar 06 2024, 20:10