/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1535607197223953.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1535607197223953.png StreetBuzz వైసీపీకి భారీ షాక్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తన పదవికి రాజీనామా? Andrapradesh
వైసీపీకి భారీ షాక్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తన పదవికి రాజీనామా?

చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కి వైసీపీలో తీవ్ర అన్యాయం .

 రాయలసీమలోనే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఆరని శ్రీనివాసులు 

 ఆరని శ్రీనివాసులను ఎమ్మెల్యేగా తప్పించి రాజ్యసభలో చోటు కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చి , చివరి క్షణంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం అన్యాయమని బలిజ సంఘం నేతలు విరుచుకుపడుతున్నారు

 ఈసారి రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం మొత్తం వైయస్సార్సీపి కి మద్దతు ఇచ్చేది లేదని తేల్చేశారు.

 దీంతో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తనకు వైసిపి అధిష్టానం మోసం చేసిందని భావించి టిడిపి పార్టీలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్ కి సీట్ ఇవ్వడంతో పార్టీలోని సుమారు 15 మంది కార్పొరేటర్లు మరియు zptc , ఎంపీటీసీ లు పార్టీ మారనున్నట్లు సమాచారం

 దీంతో చిత్తూరులో వైసిపి పార్టీ సగానికి పైగా ఖాళీ కానున్నట్లు సమాచారం

నెల్లూరు జిల్లా...కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...లారీ బస్సు ఢీ..4 రు మృతి

కావలి సమీపం లో ముసునూరు వద్ద జాతీయరహదారి పై టోల్ ప్లాజా వద్ద రోడ్డుప్రమాదం

లారీ,కావేరి ట్రావెల్స్ బస్సు డీ, నలుగురు మృతి, 15 మందికి గాయాలు. 

నుజ్జునుజ్జయిన బస్సు ముందుభాగం...

కొనసాగుతున్న సహాయకచర్యలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

రెండు లారీలు ఢీ కొని అదుపుతప్పి బస్సును లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం

గౌరవంగా తప్పుకోండి...!

గ్రాఫ్ లేని ఎమ్మెల్యేలకు జగన్ సూచన

అన్నా మీరే గౌరవంగా తప్పుకోండి..! గెలిచేవారికి మీ స్థానాల్లో అవకాశం ఇద్దాం..!

అధిష్టానం టికెట్ ఇవ్వలేదని చెప్పొద్దు.. మా వ్యక్తిగత కారణాలతోనే పోటీకి దూరంగా ఉన్నామని ప్రజలకు చెప్పండి...!

ఎన్నికల్లో గెలిచాక మీకు ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి పదవులు ఇస్తా...!

టికెట్ ఇవ్వలేని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చెప్తున్న మాట ఇది....

జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపగా.. మరికొందరు కినుకు వహించారు. 

ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్లిన పెద్దగా ఒరిగేదేమీ లేకపోవడంతో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు...

ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్

_మార్చి 6న ఎన్నికలు

_3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు

 

*ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. ఏపీలో విమర్శలు ప్రతి విమర్శలు మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారుచేసింది. తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది.

ఓ వైపు ఈవీఎం ల మీద అవగాహన కల్పిస్తూ, మరో వైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది.

ఇక తాజాగా ఏపీలో వున్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు వున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది వుండగా, మహిళలు 1,86,04,742 మంది వున్నారని తెలుస్తుంది, ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ 3,761 మంది వున్నారని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది.ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు వుండగా, అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో వున్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు

విశాఖపట్టనం: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు..

ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని చెప్పారు..

*గుంటూరు నగరంలో కారు హల్ చల్

మితిమీరిన వేగంతో వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసిన వైనం

 విద్యానగర్ ప్రధాన రహదారిపై పలు వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ మితిమీరిన వేగంతో దూసుకుపోయిన కారు

అయ్యప్ప మాల ధరించిన వాహనదారుడుని ఢీకొట్టే ప్రయత్నం

హడావిడిగా పక్కనే ఉన్న నగరం లోని ప్రముఖ వైద్యుడికి చెందిన వాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిపోయిన కారు...

మితిమీరిన వేగంతో వాహనం నడిపే వ్యక్తి మద్యం సేవించి నడుపుతున్నాడా? లేక మైనర్ బాలుడు వాహనాన్ని నడుపుతున్నాడా అనేకోణంలో ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టాలని స్థానికులు నివేదించుకుంటున్నారు....

 ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని 

 ట్రాఫిక్ పోలీస్ లు కఠిన చర్యలుతీసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు..

విశాఖపట్నం పోర్టులో భారీ అగ్నిప్రమాదం, 40 బోట్లు దగ్ధం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భయానక దృశ్యం కనిపించింది. ఎక్కడ చూసినా మంటలు ఎగిసిపడుతున్నాయి. విశాఖపట్నంలోని ఫిషింగ్ పోర్ట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక బోటు నుంచి మొదలైన మంటలు చివరికి 40 బోట్లకు వ్యాపించాయి. మంటలు చాలా విపరీతంగా ఉండడంతో కొద్దిసేపటికే సమీపంలో ఆగి ఉన్న ఇతర పడవలను చుట్టుముట్టింది.

విశాఖపట్నంలోని ఫిష్ పోర్ట్‌లో మంటలు అర్ధరాత్రి 40 ఫైబర్ మెకనైజ్డ్ బోట్లకు వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు నివేదిక లేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని డీసీపీ ఆనంద్‌రెడ్డి తెలిపారు.ఈ బోట్లకు కొందరు నేరగాళ్లు నిప్పుపెట్టి ఉంటారని మత్స్యకారులు అనుమానిస్తున్నారు. పార్టీ కారణంగానే ఓ బోటులో మంటలు చెలరేగి ఉంటాయని కూడా అనుమానిస్తున్నారు.

ఈ విషయమై డీసీపీ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ.. బోటులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు అగ్ని ప్రమాదం కారణంగా మత్స్యకారులకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఏపీకి మిధిలీ తుపాను గండం

ఏపీకి మిధిలీ తుపాను గండం, బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, భారీ వర్షాలతో తమిళనాడు విలవిల

ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.

నవంబర్ 16 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. తుఫానుగా బలపడితే దీనికి మిధిలీ అని నామకరణం చేయనున్నారు. 

ఈ సారి తుపానుకు పేరును మాల్దీవులు సూచించింది. ఈ మిధిలీ తుఫాను వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఈరోజు వాతావరణ సంస్థ తెలిపింది. ఈశాన్య దిశగా సాగి నవంబర్ 17న ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలోకి తుపానుగా మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి. 

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నగరంలో నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చెన్నైలోనూ, శివారు ప్రాంతాల్లోనూ బుధవారం నాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కారైక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

తమిళనాడు రాష్ట్రానికి ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో రాబోవు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. 

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల వల్ల అక్టోబరు నుంచి డిసెంబర్‌ వరకు భారీగా వర్షాలు కురవటం ఆనవాయితీ. ఈ రుతుపవన ప్రభావిత వర్షాలే భూగర్భ జలాల నీటిమట్టాన్ని పెంచి పంటలకు సాగుజలాలను సకాలంలో అందేలా చేస్తాయి. ఈశాన్య రుతువపనాల వల్ల, బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండాల వల్ల రాష్ట్రంలో యేడాది మొత్తం కురిసే వర్షంలో యాభైశాతం వర్షాలు కురుస్తాయి. ఈ యేడాది ఈశాన్య రుతుపవనాలు గత అక్టోబరు 21న ప్రారంభమయ్యాయి. తొలి రెండు వారాల్లో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. 

దక్షిణాది జిల్లాల్లో మాత్రం చెదురుముదురు వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి కన్నియాకుమారి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అటుపిమ్మట బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పెనుగాలుల కారణంగా ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం పడమటిదిశగా ఈశాన్య దిశగా కదులుతూ గురువారం ఉదయం వాయుగుండంగా మారుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ వాయుగుండం ఒడిశా వైపు తీరం దాటే అవకాశాలు ఉండటం వల్ల రాష్ట్రంలో చెన్నై సహా ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రతీర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో చెదురుముదురగా వర్షాలు కురుస్తాయన్నారు. 

రబోవు రెండు రోజుల్లో కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వచ్చే రెండు రోజుల్లో చెన్నై, రాణిపేట, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పుదుకోట, తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఇదిలా వుండగా మంగళవారం నాగపట్టినం జిల్లాలో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన అధికారులు.. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

50 సెంచరీలతో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్ సృష్టించారు..

ముంబై స్టేడియంలో ఎదురుగా సచిన్ మ్యాచ్ చూస్తుండగా, ఆ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టి 50 సెంచరీలతో చరిత్ర సృష్టించారు విరాట్ కోహ్లీ.. 

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును 49తో సమం చేశారు విరాట్. 

ఈరోజు ఆ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తూ న్యూజీలాండ్ పై మరో సెంచరీతో సచిన్ రికార్డు బద్దలు కొట్టారు.

ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చూపించాడు.

ఎనిమిది మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సెంచరీలతోనే కాకుండా విరాట్ మరో సచిన్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 694 పరుగులతో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశారు.

ఇప్పటివరకు ఒక ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ పేరిట ఉండేది. దానిని ఈరోజు విరాక్ బ్రేక్ చేశారు. 

2003లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు

ఆర్మీ జవానుకు పోలీసుల క్షమాపణలు

AP Police Apologies: పరవాడ సంతబయలులో ఆర్మీ ఉద్యోగి అలీముల్లాపై మంగళవారం కానిస్టేబుళ్ల దాడి చేసిన ఘటనపై అనకాలపల్లి ఎస్సీ విచారం వ్యక్తం చేశారు.

ఈ తరహా ఘటనల్ని ఉపేక్షించమని ప్రకటించారు.

అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నామని చెప్పారు. బాధ్యులైన నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు.

అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలు వద్ద ఆర్మీజవాన్ సయ్యద్ అలీమ్ ముల్లాపై దాడి చేసిన నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం సంతబయలులో జవాను అలీముల్లాతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించిన తర్వాత ఓటీపీని పోలీసులు నమోదు చేసుకోవడంపై తలెత్తిన వాగ్వాదంలో అతనిపై దాడి చేసి పోలీస్ స్టేషన్కు బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

నలుగురు కానిస్టేబుళ్లు ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న జవాను కేకలు వేయడాన్ని స్థానికులు వీడియోలో చిత్రీకరించారు. ఇదిసోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల దాడిని స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో అతడిని వదిలేశారు. ఈ ఘటనపై బాధితుడు మంగళవారం సాయంత్రం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మంగళవారం రాత్రి బాధ్యుల్ని విఆర్కు పంపి విచారణ జరిపారు. జవానుపై దాడి చేసిన కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఎస్పీ కేవీ.మురళీకృష్ణ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ యాప్ డౌన్లోడ్ చేయించే క్రమంలో ఓటీపీ నమోదు చేసుకోవడంపై అభ్యంతరం చెప్పినందుకు జవానుపై పోలీసులు దాడి చేశారు. దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లను స్థానికులు నిలదీయడంతో ఆ వీడియో వైరల్గా మారింది.

పరవాడ పిఎస్ కానిస్టేబుళ్లు ముత్యాలనాయుడు, శోభ మొదట జవానుపై దాడి చేశారు. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ దేవల్లు, రమేష్లు బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీనిపై అలీముల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలను విచారించిన తర్వాత నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.