కేంద్ర బడ్జెట్ పేదలకు అందని ద్రాక్షే! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
కేంద్ర బడ్జెట్ పేదలకు అందని ద్రాక్షే!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
తేది: 01-02-2024 గురువారం
చిన్నకోడూర్ న్యూస్
మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పేదలకు ఆశచూపినట్లు ఉందని అది పేదలకు అందేవిదంగా లేదని బి.ఆర్.ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.
మోడీ పది సంవత్సరాల క్రితం కుబేరుల వద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బైటకు తీసి పేదలకు ఒక్కో అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తానని వాగ్దానం చేసి గద్దెనెక్కినాక నల్లధనం తియ్యకపోగా పేదలకు అందే సబ్సిడీలను తీసేసి కార్పొరేట్ సంస్థల కొమ్ముకాస్తున్నాడని అన్నారు.
గత ఎన్నికల్లో యువత మదిలో హిందు వాదం నింప్పి మతాల మధ్య చిచ్చుపెట్టి గద్దెనెక్యారని అన్నారు.
మూడోసారి గద్దెనెక్కడానికి మధ్యంతర బడ్జెట్ అంట్టు కొత్త నాటకానికి తీశారని అన్నారు.
గత పది సంవత్సరాలల్లో 250 మిలియండ్ల పెదాలను అభివృద్ధిలోకి తెచ్చినట్లు ప్రకటించడం హాహ్యస్పదమని అన్నారు.
ఇది కేవలం ఎన్నికల కోసం ప్రకటన తప్పితే ఏమి లేదన్నారు.
Feb 11 2024, 18:24