/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: శబరిమల కు బయలుదేరిన కంజర శ్రీను గురు స్వామి Mane Praveen
NLG: శబరిమల కు బయలుదేరిన కంజర శ్రీను గురు స్వామి

నల్లగొండ పట్టణంలోని మణికంఠ నగర్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో, ఈరోజు అయ్యప్ప స్వామి మాలాధరణ గురు స్వాములు, కన్నే స్వాములు దీక్ష పూర్తి చేసుకొని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం ఇరుముడి కట్టుకొని శబరిమల కు బయలుదేరారు.

ఈ కార్యక్రమంలో గురుస్వామి కంజర శ్రీను, తదితరులు ఉన్నారు.

NLG: 'జై భీమ్ సాహో యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఈనెల 14న ముగ్గుల పోటీలు

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'జై భీమ్ సాహో యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 14న మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు యూత్ ప్రెసిడెంట్ ఈద గిరిశ్వర్ తెలిపారు. 

మహిళలు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఇందుకోసం 12వ తేదీ సాయంత్రంలోగా తమ పేర్ల ను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మొదటి బహుమతి రూ.5016, రెండో బహుమతి రూ. 4016, మూడవ బహుమతి రూ. 3016 ఉన్నట్లుగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కోఆర్డినేటర్ పగడాల శంకర్ 9494707818 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

NLG: అసోసియేట్ ప్రొఫెసర్లు గా పదోన్నతులు పొందిన నాగార్జున ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు

నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ అంతటి శ్రీనివాసులు-కెమిస్ట్రీ విభాగాధిపతి, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్-ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి-కామర్స్ &బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాధిపతి, డాక్టర్ N. దీపిక - తెలుగు విభాగం.. ఇటీవలనే రాష్ట్ర కళాశాల విద్య చేపట్టిన పదోన్నతుల్లో ఎన్జీ కళాశాల నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బోధన, పరిశోధన, కళాశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల ద్వారా మరియు సర్వీస్ అనుభవం ద్వారా అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించామని చంద్రశేఖర్ స్టాఫ్ క్లబ్ సెక్రటరీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, IQAC కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, వివిధ విభాగ అధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

NLG: సంక్రాంతి సందర్భంగా NG కళాశాలలో ముగ్గుల పోటీలు

నల్గొండ టౌన్: నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో గురువారం విద్యార్థులకు, మహిళా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం కన్వినర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మరియు కమిటీ మెంబర్స్ పోటీని పర్యవేక్షించారు. డాక్టర్ జోత్స్న, మనెమ్మ, లవేందర్ రెడ్డి జడ్జెస్ గా విజేతలను ఎంపిక చేసారు. విజేతలకు రిపబ్లిక్ డే రోజు బహుమతులను ప్రధానం‌ చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఉపేందర్ అధ్యక్షత వహించగా అధ్యాపకులు యాదగిరి రెడ్డి, నాగుల వేణు, మల్లేశ్, శివరాణి, మహేశ్వరి, శీలం యాదగిరి,దుర్గాప్రసాద్ సావిత్రి, స్రవంతి,శిరీష, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.

TS: ఘనంగా పిఆర్టియు టిఎస్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ

యాదాద్రి జిల్లా:

నారాయణపూర్ మండలంలోని ఎంఆర్సి వద్ద పిఆర్టియు టిఎస్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జనగాం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కలిముద్దీన్, మండల శాఖ అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, సీనియర్ ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి, రాష్ట్ర అసోసియేటివ్ అధ్యక్షులు శ్రీనివాస్, హరికిషన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు చొల్లేటి శ్రవణ్ కుమార్, యాదిరెడ్డి, వెంకన్న, మండల కార్యదర్శి పబ్బు దేవేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, కోటేశ్వర్ ఉన్నారు.

TS: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ రాజీనామాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 

సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

TS: విద్యార్థులకు గమనిక.. ఓపెన్ డిగ్రీ లో చేరుటకు మరో అవకాశం

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో.. డిగ్రీ లో చేరుటకు మరొక అవకాశం. అడ్మిషన్లు ఈనెల 31 వరకు పొడిగించారు. రెగ్యులర్ ఇంటర్, ఓపెన్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటిఐ పూర్తి చేసిన వారు డిగ్రీలో చేరుటకు అర్హులు. మహిళలకు ప్రత్యేకంగా నల్లగొండలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు ప్రత్యేక స్టడీ సెంటర్ కలదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజారామ్ తెలిపారు. 

పూర్తి వివరాలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించవచ్చు.

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలు పై 4.1 తీవ్రత

అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు.

HYD: ఖైదీ కడుపులో బ్లేడ్లు, మేకులు

హైదరాబాద్: చంచల్‌గూడ జైలు లో వందల మంది రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న వారు ఉంటారు.

అయితే మహ్మద్ సోహైల్ (21) ఖైదీ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. తాను పెయిన్ భరించలేకపోతున్నానంటూ కేకలు వేశాడు.

జైల్లోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో.. ఎస్కార్టు పోలీసులు మంగళవారం సాయంత్రం ఉస్మానియాకు తరలించారు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు.

ఎక్స్ రే పరిశీలించిన డాక్టర్లు.. షేవింగ్ బ్లేడ్లు, రెండు మేకులు, రెండు చిన్న రబ్బరు బంతులు, రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లు, ఇతర చిన్నపాటి వస్తువులు ఖైదీ కడుపులో ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందనే అనుమానంతో వాటిని ల్యాబ్‌కు పంపించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి.రమేశ్‌కుమార్‌ ఎండోస్కోపీతో విజయవంతంగా బయటకు తీశారు.

అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపి ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ బి.రమేశ్ బృందాన్ని సూపరింటెండెంట్‌ అభినందించారు.

అయితే ఆ వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు. రోగి కోలుకున్న తర్వాత విచారించి, అతనికి మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఆ తరహా చికిత్స సైతం అందించనున్నారు.

TS: చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

'చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు' ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.

స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో చాక్లెట్లు లభ్యం

విద్యార్థులకు చాక్లెట్లు ఉచితంగా పంచుతున్న ఒడిశా వ్యక్తులు

చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

ఉపాధ్యాయులు ఆరా తీయడంతో వెలుగులోనికి వచ్చిన విషయం

గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ధీరేందర్ బిహారా

పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు.