/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి Miryala Kiran Kumar
ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి

 

హృదయ సంబంధిత అనారోగ్యం తొ గచ్చిబౌలిలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ను సూర్యాపేట శాసనసభ్యులు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగదీష్ రెడ్డి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అదే ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆత్మకూర్ ఎస్ మండలం నసీంపేట గ్రామానికి చెందిన గుండపునేని హనుమంతరావు పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.

రేపు అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి: కేటీఆర్

రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి - పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పార్ధివదేహానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్‌రెడ్డి హఠాన్మరణం బాధాకరం అన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా ఉండి పని చేశారని, సంపత్‌రెడ్డి మరణం ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్తను కలచి వేసిందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవంతం చేశారన్నారు. సంపత్‌రెడ్డి కుటుబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటన్న కేటీఆర్, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు!!

ఏపీ వైపు దూసుకొస్తున్న మీచౌంగ్ తుఫాన్...

మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది..ఇప్పటికే రెండు రోజులుగా నెల్లూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుపడుతున్నాయి..అనంతపురం, కడప ప్రకాశం, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది..నిజాంపట్నం హార్బర్‌లో ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..తుఫాన్ దృష్ట్యా అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా సాయంత్రానికి తుఫానుగా బలపడి.. దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తోంది.రేపు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, పడే అవకాశం ఉంది. రానున్న రెండు, మూడు రోజులపాటు, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్‌ తుఫాన్‌ ముప్పు భయం వెంటాడు తోంది.

గాంధీభవన్‌ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి... మీటింగ్‌ల మీద మీటింగ్‌లు..

గాంధీభవన్‌ టూ ఢిల్లీ వయా గచ్చిబౌలి... మీటింగ్‌ల మీద మీటింగ్‌లు.. మంతనాలే మంతనాలు సాగుతూనే వున్నాయి. సీఎల్పీపై సింగిల్‌ లైన్‌ స్టేట్‌మెంట్‌ వచ్చేసింది.. రేవంత్‌ రెడ్డికే సీఎం కుర్సీ అని హైకమాండ్‌ లైన్‌ క్లియర్‌ చేసిందనే టాక్‌ రానే వచ్చింది. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో రంగం సిద్ధమైంది. ఇక రేవంత్‌ అనే నేను....అంటూ ఆవాజ్‌ రావడమే తరువాయి అనుకునేంతలోపు సీన్‌ ఛేంజ్‌.. సీఎం ఎవరినే మ్యాటర్‌ ఓవర్‌ టు ఢిల్లీ..

చెన్నైపై విరుచుకుపడ్డ మిచౌంగ్‌…

చెన్నైపై విరుచుకుపడ్డ మిచౌంగ్‌… బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడింది. నేడు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్ గానే మధ్యాహ్నం లోపు తీరం దాటనున్నది మిచౌంగ్. ఈ తుఫాన్‌ ప్రభావంతో రెండు రోజులపాటు కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపధ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

ప్రజల తీర్పును గౌరవిద్దాం..

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో సమావేశం అయిన మాజీ మంత్రులు, సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు.. కేసీఆర్‌ని కలిసి ఆశీర్వాదం తీసుకున్న తాజాగా గెలిచిన అభ్యర్థులు.. శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌..

ప్రజల తీర్పును గౌరవిద్దాం.. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉండే.. కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం.. ఎన్నికల ఫలితాలపై సమీక్ష.. త్వరలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందాం-కేసీఆర్‌

తెలంగాణ రెండో శాసనసభ రద్దు.. కొత్త శాసనసభ ఏర్పాటు..

హైదరాబాద్‌: తెలంగాణ రెండో శాసనసభ రద్దు.. మంత్రి మండలి ప్రతిపాదనతో సభ రద్దు.. అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్‌భవన్‌

తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటు.. ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకి అందజేసిన సీఈవో వికాస్ రాజ్.. 119 ఎమ్మెల్యేల ఎన్నికను ధ్రువీకరించిన గవర్నర్

తెలంగాణలో కొనసాగుతోన్న రాజీనామాల పర్వం..

తెలంగాణలో కొనసాగుతోన్న రాజీనామాల పర్వం.. ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు రాజీనామా.. సీఎస్‌కు రాజీనామా లేఖలు పంపిన తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు డా. దూది మెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, డా. వాసుదేవ రెడ్డి, మన్నే క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, పాటి మీద జగన్ మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, గజ్జెల నగేష్, మేడె రాజీవ్ సాగర్, డా. ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యా నాయక్ తదితరులు.. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు రాజీనామా

కలివేరు పంచాయితీ రజబెల్లి కాలనీలో ఇల్లు దగ్దమై, పత్తి ధాన్యం కాలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్

కలివేరు పంచాయితీ రజబెల్లి కాలనీలో ఇల్లు దగ్దమై, పత్తి ధాన్యం కాలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి:న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ 

చర్ల మండలం కలివేరు

గ్రామపంచాయతీ రజిబెల్లి కాలనీలో బుటారి జోగయ్య ఇల్లు నిన్న మధ్యాహ్నం 11:30 నిమిషాలకు దగ్ధమై ఇంటిలో ఉన్న సామానులు వాటితోపాటు చేతికొచ్చిన నాలుగు ఎకరాల పత్తి, ఎకరం ధాన్యం మొత్తం కాలిపోయి (దగ్దం )అయ్యాయి కుటుంబమంతా నిరాశ్రయులుగా మిగిలిపోయారు వీరిని ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.

బుటారి జోగయ్య కుటుంబం రాత్రింబవళ్లు కష్టపడి పండించుకున్న పంట కళ్ళముందే దగ్ధం అవడంతో దిక్కుతోచని పరిస్థితి కి నెట్ వేయబడ్డారని వారినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని అధికారుల మీద కూడా ఉందని వారన్నారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో 5000/విలువగల సామాగ్రి గిన్నెలు బట్టలు, దుప్పట్లు బియ్యం, నిత్యవసర సరుకులు 500 రూపాయల సహాయం చేయడం జరిగినది. ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేసి నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.అట్లాగే చర్ల మండలంలో పైర్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని అనేక సార్లు కార్యక్రమాలు దీక్షలు చేసిన ఈ ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదు అధికారులు దున్నపోతుల మీద వర్షం పడ్డట్టుగా వ్యవరిస్తున్నారు ఇప్పటికైనా చర్ల మండలంలో పైర్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసి గా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసి చర్ల మండల నాయకులు భాను ప్రకాష్ బుర్ర సమ్మక్క ఇరుప సమ్మక్క కనితి రాజమ్మ పోడియం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

కూలిన దుండిగల్ ఎయిర్‌పోర్టు శిక్షణ విమానం..

మెదక్‌: కూలిన దుండిగల్ ఎయిర్‌పోర్టు శిక్షణ విమానం.. విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి.. పైలెట్‌, ట్రైనీ పైలెట్‌ సజీవదహనం.. తూప్రాన్‌ రావెల్లి శివారులో ఘటన.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు.