నల్గొండలో గెలుపే లక్ష్యంగా గడప గడపకు బిజెపి
నల్గొండలో బీజేపీ గెలుపే లక్ష్యంగా గడప గడపకు బీజేపీ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గురువారం కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ వారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్వేశిపురం మరియు కనగల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి గడప గడపకు వెళ్లి బిజెపి కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను తామే ప్రవేశ పెట్టామని రాష్ర్ట ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రజలకు అయోమయానికి గురి చేస్తుందన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, రహాదారులు అద్భుతంగా తయారవుతున్నాయని, రేషన్ పాటు రాష్టంలో అమలయ్యే అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. ప్రజలంతా గమనించి మాయ మాటలు చెప్పే పార్టీల మోసాలను పసిగట్టి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, BRS లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు మండల నాయకుకు వివిధ మోర్చా నాయకులు శక్తి కేంద్ర ఇంచార్జిలు బూత్ అధ్యక్షులు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
Oct 12 2023, 19:35