దేవరకొండ: నియోజకవర్గ బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం
నల్లగొండ జిల్లా, దేవరకొండ: బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా నాన్ లోకల్ వ్యక్తి కి కేటాయించారని, నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ గ్రామాన తండ తండ ప్రతి గూడేలకు తీసుకెళ్లిన రామావత్ రమేష్ నాయక్ ను కాదు అని నాన్ లోకల్ వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విన్నవించుతూ.. సర్ దేవరకొండ నియోజకవర్గం లో ప్రతి ఒక్కరు కూడా నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ కేటాయించడానికి వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. వారి అభిప్రాయాలను, మా సూచనలను తీసుకొని మీరు పునరాలోచించి దేవరకొండ ప్రజలకు సుపరిచితుడు అయినటువంటి వ్యక్తి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వ్యక్తి ఎప్పుడు ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి సుమారు 2014, 2015 సం. నుండి స్వేరో నెట్వర్క్ లో కీలకంగా పనిచేసి తన మార్కును చూపించినటువంటి వ్యక్తి, కోవిడ్ టైంలో ఎందరినో అభాగ్యులను ఆదుకొన గొప్ప మానత్వం కలిగి వ్యక్తి రామావత్ రమేష్ నాయక్ కు బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నామని వారు అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రమావత్ రమేష్ నాయక్ చింతపల్లి మండల అధ్యక్షులు ముదిగొండ మొగిలయ్య, కోండమల్లేపల్లి మండల అధ్యక్షులు గ్యార యాదగిరి, నేరేడుగొమ్ము మండల రావులపల్లి ఆంజనేయులు, చందంపేట మండల అధ్యక్షులు కేతావత్ మంగులాల్ నాయక్, పెద్దఅడిశర్లపల్లి మండల అధ్యక్షులు ధర్మాపురం శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్, కోశాధికారి మత్తంగి జాన్,నల్లా శ్రీకాంత్, గ్యార సమేల్, అనిల్, అంజి, వెంకట్, శ్రీరాములు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 06 2023, 15:57