/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz టెట్ ఫలితాలలో GHMC కార్మికుడు సత్తా చాటాడు Raghu ram reddy
టెట్ ఫలితాలలో GHMC కార్మికుడు సత్తా చాటాడు

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాల ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.

టెట్ ఫలితాల్లో ఓ జీహెచ్‌ఎంసీ కార్మికుడు సత్తా చాటాడు. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హయత్ నగర్ సర్కిల్ సరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు బోడ నరేష్ పాసయ్యాడు.

బీఏ, బీఈడీ, ఎంఏ తెలుగు చదివిన నరేష్ ఉద్యోగం రాకపోవటంతో హయత్ నగర్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా టెట్‌కు ప్రిపేరై తాజా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు.

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్‌ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. కాగా,

ఈ నెల 15న తెలంగాణవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్‌ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్‌-1కు 2.26 లక్షలు,84.12శాతం, పేపర్‌-2కు 1.90 (91.11 శాతం, లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRT) జరగనుంది...

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించవలసిందే: ధర్మాసనం

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో షాక్ తగిలింది. టిఎస్ పిఎస్సి అప్పీల్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 

బయోమెట్రిక్ అమలు చేయకుండా టిఎస్ పిఎస్సి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్పీ డివిజన్ బెంచ్ అప్పీల్ కు వెళ్లింది.

ఈ నేపథ్యంలో బుధవారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు నిర్ణయం సరైనదేనని, ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది . పరీక్షలో అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది..

చంద్రబాబు ఎస్‌ఎల్‌పీపై సుప్రీంలో విచారణ

దిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత చూపించారు..

దీన్ని సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. 

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే..

ఉప్పల్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సందడి

ఈరోజు నుండి మహానగరంలో వరల్డ్ కప్ సందడి మొదలైంది. విదేశీ ఆటగాళ్లు బుధవారం, గురువారం శుక్రవారం, నాడు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ ప్రారంభకానుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు వార్మప్ మ్యాచ్‌లు, మూడు ప్రధాన మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం ఐదు వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది.

వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు ఇప్పటికే న్యూజిలాండ్ టీం హైదరాబాదుకు చేరుకోగా.. ఈరోజు రాత్రి 10 గంటలకు పాకిస్థాన్ టీం శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకోనుంది.....

ఈ నెల 29 నుంచి యువగళం పాదయాత్ర కు రెడీ అవుతున్న నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే.

ప్రస్తుతం న్యాయపరంగా చంద్రబాబు కేసులపై టీడీపీ పోరాటం చేస్తోంది. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేయగా..

బాబుకు త్వరలో ఊరట దక్కుతుందని టీడీపీ వర్గాలు యోచిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేసేందుకు ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేసిన లోకేష్.. త్వరలోనే తిరిగి అమరావతికి రానున్నారు.

ఈ నెల 29వ తేదీ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 8.15 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు.

చంద్రబాబు అరెస్ట్‌పై ప్రభుత్వ వైఖరిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తలకు భరోసా కల్పించనున్నారు.

ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు పోలీసుల నుంచి అన్ని అనుమతుల వచ్చాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం, ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేయడం లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి లోకేష్ తీసుకెళ్లనున్నారు...

గురి చూసి కొట్టారు

ఆసియా క్రీడల్లో భాగంగా జరుగుతున్న ఈవెంట్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.

25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్, రిథమ్ సంగ్వాన్, ఈశా సింగ్లతో కూడిన టీమ్.. ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలుచుకుంది.

1759 పాయింట్లతో ఈ త్రయం తొలి స్థానాన్ని కైవసం చేసుకుని పసిడి పతకాన్ని ముద్దాడింది. అలా భారత్కు ఈ టీమ్ నాలుగో స్వర్ణ పతకాన్ని అందించింది.

అంతకుముందు జరిగిన రాపిడ్-ఫైర్ సిరీస్‌ను మను 98 పాయింట్లతో ముగించి టాప్ పొజిషన్లో నిలిచింది. ఇక ఈ గేమ్లో ఆతిథ్య చైనా జట్టు 1756తో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, సౌత్ కొరియా షూటర్లు1742 స్కోరు సాధించి మూడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నారు.

Sbnews

పోలీస్ భారీ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనం

వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టించారు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలోమీటర్ల శోభాయాత్ర జరగనుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25,694 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమైన జంక్షన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పారామిలిటరీ బలగాలతో భద్రత నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు.

ప్రతి విగ్రహానికి ఉన్నతాధికారులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వినియోగించుకోవడానికి అంబులెన్స్‌లను సైతం పోలీసులు సిద్ధంగా ఉంచారు...

Sbnews

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్య 

సామాజిక మాధ్యమాల్లో వారి ఫొటోలు వైరల్‌ 

ఆగ్రహంతో నిరసనలకు దిగిన విద్యార్థులు 

హత్యకేసు దర్యాప్తు సీబీఐకి అప్పగింత

అయిదు రోజులపాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత 

ఇంఫాల్‌: జూలై నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారని తెలియడంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతులను హిజం లింథోయింగంబి(17), ఫిజమ్‌ హేమ్‌జిత్‌(20)గా గుర్తించారు. వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి..

తెలంగాణలో ఎయిర్ అంబులెన్స్‌లు.. ఆపద సమయంలో అత్యవసర సేవలు..

హైదరాబాద్..

తెలంగాణ పేద రోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌లను ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.

Sbnews

Sbnews

Sbnews

ల్యాండర్‌, రోవర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: చంద్రయాన్‌-3 మిషన్‌లోని ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడంతో శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు..

అయినా సానుకూల ఫలితాలు రాలేదు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సమయం గడిచేకొద్ది అవకాశాలు మందగిస్తున్నాయని వెల్లడించారు.

ఇస్రో మాజీ అధిపతి ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ల్యాండర్‌, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్‌ ఓ అఖండ విజయమని అభివర్ణించారు..