/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా Yadagiri Goud
ఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. గత ఎన్నికల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనందుకు ఆమెకు హైకోర్టు మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది.

అక్టోబర్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

అయితే 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించి సునీత తప్పుడు సమాచారం అందించారని, ఆస్తులను చూపలేదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తప్పుడు సమాచారం అందించినందుకు ఆమె ఎన్నిక చెల్లదని, అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు..

కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సునీతను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.....

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Kavitha: రాష్ట్రాల్లో నడుస్తోంది భారత రాజ్యాంగమా? భాజపా రాజ్యాంగమా?: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ తమిళిసై వ్యవహరించారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నామినేటెడ్‌ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్‌ తిప్పిపంపడాన్ని ఆమె తప్పుబట్టారు..

భారాస బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. భాజపా వాటిని అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

శాసన మండలి ఆవరణలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కవిత పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

''ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయం. అనేక కారణాలను చెప్పి పేర్లను ఆమె తిరస్కరించారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తోందా? భాజపా రాజ్యాంగం నడుస్తోందా?

పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరం. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయి.

బీసీ వర్గాలకు భాజపా పెద్ద పీట వేస్తోంది. బీసీ వ్యతిరేక పార్టీ అని భాజపా మరోసారి నిరూపించుకుంది'' అని కవిత వ్యాఖ్యానించారు..

Streetbuzz News

Streetbuzz News

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా!

టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి వెల్లడించారు.

బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు కోరగా ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి అభిప్రాయపడ్డారు.

రేపటి నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లు జడ్జి తెలిపారు. బుధవారం రెగ్యులర్‌ కోర్టులో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించారు.

విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి వ్యవహరించారు...

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు: సి పి, డిఎస్ చౌహన్

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు.

కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డిసిపిలు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అధికారులతో నాచారంలోని ఐఐసిటిలో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో నిర్వాహకులతో, ఇన్‌స్పెక్టర్లు సమన్వయం చేసుకోవాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో అందరు అధికారులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

నిమజ్జనం ఎక్కువగా సాగే చెరువులు, కుంటల మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటి పారుదల శాఖ, విద్యుత్, రవాణా శాఖ తదితర శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గణేష్ నిమజ్జనం శాంతియుతంగా సజావుగా సాగేలా చూడాలన్నారు.

సీసీటీవీల ద్వారా నిమజ్జనం సాగే మార్గాల ట్రాఫిక్ ను , నిమజ్జనం జరిగే చోట పరిస్థితులను ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలన్నారు, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఎలాంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు, మార్గాల్లో బందోబస్తును పెంచాలని సూచించారు.

అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతవరణంలో నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిధుల పై కెసిఆర్ ప్రత్యేక దృష్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎంవో అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యేలు, వారి నియోజకవర్గ అభివృద్ధి నిధి అయిపోయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 10,000 కోట్లు కేటాయించడంతో ఎస్డీఎఫ్ కింద నిధులు కోరుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీ నిధుల పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం,తో సమానంగా, 2021-22 నుండి ఎమ్మెల్యేలకు సీడీఎఫ్ని రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్లకు పెంచింది. 2019-20లో ఆర్థిక మందగమనం, 2020-21, 2021-22లో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినందున ఎమ్మెల్యేలకు సిడిఎఫ్ నిధులు అందలేదు.

ఈ తరుణలో ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఎమ్మెల్యేలకు పేపర్పై రూ.5 కోట్లు వచ్చినా కేవలం రూ.2 కోట్లు మాత్రమే మిగిలాయి.

ప్రభుత్వం నేరుగా సీడీఎఫ్ నిధుల నుంచి రూ.3 కోట్లు మినహాయించగా, ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు సమాచారం. దీంతో గతంలో ప్రారంభించిన పలు పనులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్లో ఉండడంతో ఎమ్మెల్యేలు నిధుల కొరతతో సతమతమవుతున్నారు.

అసెంబ్లి నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలు, పట్టణాలు అధ్వాన్నమైన రోడ్లు, సరిపడని డ్రైనేజీ వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి,

దీని కారణంగా పరిస్థితులను మెరుగుపరచాలని స్థానికుల నుండి బలమైన డిమాండ్ ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అలాగే ఓటర్ల తాజా డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు..

Streetbuzz News

Streetbuzz News

ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకుల ఆందోళన

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన ట్యాంక్ బండ్ పై కచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వహకులు చెబుతున్నారు.

దీంతో మండపం నిర్వాహకులు ట్యాంక్ బండ్ పై ఆందోళన కూడ నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు మహానగరంలో ప్రతిష్టించిన పీఓపీ విగ్రహాలెన్ని అన్న విషయంపై సర్కారుకు గానీ, జీహెచ్ఎంసీకి గానీ ఎలాంటి సమాచారం లేదు.

కానీ మహానగరంలో ఒక అడుగు నుంచి మొదలుకుని 20 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు కూడా ప్రతిష్టించిన పీఓపీ విగ్రహాలు లక్షల్లోనే ఉంటాయన్నది ప్రాథమిక సమాచారం.

అయిదడుగుల కన్నా ఎక్కువ ఎత్తు కల్గిన విగ్రహాలు సుమారు మూడు నుంచి మూడున్నర లక్షల వరకుంటాయని ఓ అంచనా ఉంది. వీటిని ఎక్కడ నిమజ్జనం చేయించాలన్నది ప్రస్తుతం జీహెచ్ఎంసీ ముందున్న ఓ బిగ్ ఛాలెంజ్.

హుస్సేన్ సాగర్ మినహా నిమజ్జనం నిర్వహించే మిగిలిన 32 చెరువుల వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేద్దామనుకుంటే, విగ్రహాలతో వచ్చే భారీ వాహానాలు కనీసం చెరువు వరకు చేరుకునేందుకు వీలుగా లేని పరిస్థితులున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సిటీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కొలనులను ఇంకా కాస్త లోతుగా చేసి, అయిదడుగుల కన్నా ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను నిమజ్జనం చేస్తూ, ఎప్పటికపుడు వ్యర్థాలను బయటకు తీసి, మరో విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేస్తారా? లేక ఎప్పటి లాగానే కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారా? వేచి చూడాలి..మరి

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

TS TET Results: రేపు టెట్‌ ఫలితాలు..

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్‌) ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. ఈ నెల 15న పరీక్ష జరగగా పేపర్‌-1కు 2.26 లక్షలు, పేపర్‌-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు..

ఈ నెల 27న ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్‌సీఈఆర్‌టీ వర్గాలు తెలిపాయి..

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్‌..

దిల్లీ: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును

కొట్టేయాలని కోరుతూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు రానుంది..

తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు..

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

STREETBUZZ NEWS

144 Sec: బెంగళూరులో 144 సెక్షన్‌ - నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌..

బెంగళూరు బంద్‌కు అవకాశం లేదని, సోమవారం అర్ధరాత్రి నుంచే నగర వ్యాప్తంగా 144వ సెక్షన్‌(144 Sec) జారీ చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌(City Police Commissioner Dayanand) స్పష్టం చేశారు..

సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి బంద్‌లకు అవకాశం ఇవ్వరాదన్నారు. సోమవారం కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ నిరసన కొనసాగించినా ప్రజల ఆస్తులకు నష్టం, ప్రజా జీవనానికి భంగం ఉండరాదన్నారు.

నిరసన వేళ హింసాత్మాక సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాలను పెంచామన్నారు. బలవంతంగా బంద్‌ చేయించేందుకు వీలు లేదన్నారు. నగరవ్యాప్తంగా 60 కేఎ్‌సఆర్‌పీ, 40 సీఏఆర్‌ ప్లటూన్‌లతోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు..

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారి దర్శనానికి నేడు మంగళవారం భక్తులకు నేరుగానే అనుమతి లభిస్తోంది.

శ్రీవారి సర్వదర్శనానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతోంది. ఇక సోమవారం 72,137 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా.. నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి....

SB NEWS

Streetbuzz News

Streetbuzz News

Streetbuzz News