వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి,సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి వెల్డింగ్
![]()
వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి
సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలి
సింగరేణిలో యూస్ అండ్ త్రో విధానం పోవాలి
సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్*
సింగరేణి కొత్తగూడెం సెంట్రల్ వర్క్ షాపులో గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వెల్డింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పని కల్పించాలని పర్మనెంట్ కార్మికుల వచ్చారు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకు పని లేదు అని టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ కార్మికులకు పని లేకుండా చేయడం సరైనది కాదని తక్షణమే వారికి పని కల్పించాలని AITUC అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం నాడు సెంట్రల్ వర్క్ షాప్ జనరల్ మేనేజర్ శ్రీ యన్.దామోదర్ గారికి వినతి పత్రం సమర్పించిన అనంతరం వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..
వర్క్ షాపులో వెల్డర్స్ లేనప్పుడు మరియు కరోనా అత్యవసర పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకొని నేడు టెండర్లు పిలవకుండా అనేక సంవత్సరాల నుంచి పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు పనిలేకుండా చేయడం చాలా దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే పనిని నమ్ముకొని ఆధారపడి ఉన్న వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను వీధిన పడేయటం సరైనది కాదని విమర్శించారు.ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తక్షణమే టెండర్లు పిలవడం కానీ, ప్రత్యామ్నాయ పనులు కల్పించడం ద్వారా కానీ వెల్డింగ్ కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జహెద్, మదర్,రవి,అజయ్,శంకర్ తదితరులు పాల్గొన్నారు


ఈ సందర్భంగా జిల్లా పరిషత్తులో గ్రామ సర్పంచ్ పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డిని , కార్యదర్శి ఉపేందర్ ను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి , కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ , జడ్పీ సిఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి , ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి , ఎంపీవో మాధవరెడ్డిలు ఉన్నారు.
Sep 16 2023, 08:09
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
40.2k