బీసీలు అంటే బిచ్చగాళ్ళు కాదు... మన దేశ నిర్మాతలు
•నక్సలైట్ విప్లవ ఉద్యమ నేత కామ్రేడ్ జే ఎస్ ఆర్
మన దేశ జనాభా 140 కోట్ల మందిని సాదుతున్న ప్రాణదాతలు మన బీసీలు
CPIML secretary JSR
మనదేశ వెన్నెముక బీసీల హక్కులను విస్మరిస్తున్నా దగాకోరు రాజకీయ పార్టీలను బొంద పెట్టండి
ప్రజాస్వామిక వాది
కామ్రేడ్
జే ఎస్ ఆర్ పిలుపు
మండల్ కమిషన్ ముఖ్యమైన సిఫార్సు అయిన బి.సిలకు
ఇకనైనా చట్ట సభలల్లో ప్రాతినిధ్యం అమలుచేయలనీ కామ్రేడ్
జే ఎస్ ఆర్ డిమాండ్
పార్లమెంట్లో మండల్ కమీషన్ నివేదిక అమలు ప్రకటిస్తూ అప్పటి ప్రధాని వి.పి.సింగ్ గారు 1990 ఆగస్టు 7న అన్న మాటలు, "ఇక్కడ పోరాటం. బిసిల జీవనోపాధికి సంబంధించినది కాదనీ... రాజ్యాధికారంలో భాగం కోసం... ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.
మన దేశ జనాభాలో 50% పైగా ఉన్న బిసిలు చేసే పోరాటం ఇది. ఇది కేవలం ఆర్ధిక అంశాలకు సంబంధించిన ప్రశ్న కాదు. ఇది ఈ దేశంలోని బిసిల అస్తిత్వం, ఆత్మ గౌరవానికి దేశంలో అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేసే ప్రశ్న. మనదొక వింత దేశం. ఇక్కడ గౌరవం అనేది సంపదలతో వచ్చేది కాదు. ఇక్కడ గౌరవం కులంతో ముడిపడి ఉంది. కులానికి అధికారం తోడైతే ఆ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ దేశంలో ఇప్పుడున్న సామాజిక ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా వివక్షతో వెలివేతలతో కూడుకొని ఉంది. అణచివేయబడిన బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అలాంటి అణగదొక్కబడిన, సామాజికంగా వెనుకబడిన వారిని, వ్యవస్థలో ఇప్పటికే బాగా అభివృద్ధిచెంది ముందు వరుసలో ఉన్న వారితో పోటీపడాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు సమ సమాజ స్వప్నకుడు నక్సలైట్ కమ్యూనిస్టు సిపిఐ ఎంఎల్ పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్.
ఇలాంటి పద్ధతి ఇప్పటి వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. సామాజికంగా, విద్యాపరంగా వేలాది సంవత్సరాలుగా వెనక్కు నెట్టివేయబడిన వారిని సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెంది ముందు వరుసలో వారితో సమాన స్థాయిలో పోటీపడాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? అని నిష్కళంక దేశభక్తుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు... అణగారిన వర్గాల హక్కుల పోరాటయోధుడు...
ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్
జె.ఎస్.ఆర్. నేతాజీ నేడు ఇక్కడ విడుదల చేసిన బహిరంగ రేఖలు సమాజాన్ని ప్రశ్నించారు.
ఇలాంటి పద్దతి ఇప్పటి వ్యవస్థలో ఉన్న పెద్దలోపం. అత్యంత అన్యాయం. ఈ అన్యాయాన్ని సరిదిద్దడం చాలా అవసరం. కనుక మేము చాలా స్పష్టమైన అవగాహనతోనే ఈ దేశ పరిపాలనా యంత్రాంగంలో బలహీనవర్గాలకు భాగస్వామ్యం ఇవ్వదలిచాము. ఆ క్రమంలో అధికార వ్యవస్థలో బిసిలను భాగస్వాములను చేయదలిచాము. ”
'విపి సింగ్ గారు మండల్ కమిషన్ అమలు చేస్తుంటే భరాయించ లేక అద్వానీ రధయాత్ర చేసి విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని పడవేసారు అలాంటి బిజెపి లో ఉన్నందుకు బిసిలు సిగ్గు పడాలి. ప్రభుత్వ పరిశ్రమలను అమ్ముతున్న బిజెపి లో ఉన్నందుకు సిగ్గుపడాలి. చట్టసభలల్లో బిసి లకు ప్రాతినిధ్య చట్టం తీసుకురాకుండా, చిత్తశుద్ధితో పనిచేయని బిజేపి, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైయస్ఆర్సిపి, టీడిపి మొదలయిన పార్టీలలో ఉన్న బిసిలు సిగ్గు పడాలి...
బయటకు రావాలి. చట్టసభలల్లో బిసి లకు ప్రాతినిధ్య చట్టం వచ్చే వరకు బిసి లు ఓట్లు వేయకూడదని నోటా నొక్కాలనే నిర్ణయాన్ని ప్రకటించే శక్తి బిసిలు పొందాలి. చట్ట సభలల్లో బిసి ల ప్రాతినిధ్యాన్ని సాధించాలి. ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి పునాదులు వేయాలి. కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కోటీశ్వర్ల క్లబ్ గా తయారయింది అన్నారు. దానిని మార్చడానికి చేయాల్సిన కార్యాచరణ గురించి చెప్పలేదు. వాళ్ళ కున్న వర్గపోరాట దృక్పధంతో ఏమి చేయాలో చెప్పరు. చర్చ చేయరు. చట్టసభలు ఉన్నతంగా ఉండాలంటే డబ్బు, మద్యం బహుమతులు పంచేవారు, వారి నాయకులు నేరస్తులు వారిని శిక్షించాలి. పార్టీల రిజిస్ట్రేషన్ రద్దుచేయాలి. అపుడే పార్లమెంట్ అసెంబ్లీలు కోటీశ్వర్ల క్లబ్బులు కావు.... పని అణగారిన వర్గాల హక్కుల కోసం అను దినం పోరాటం కొనసాగిస్తున్న ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్
జే ఎస్ ఆర్ తేల్చి చెప్పారు.
రాజ్యాంగం వలన ఇప్పుడు పార్లమెంట్లో 84, 47 మంది యస్.సి., యస్.టీలు యంపీ లుగా ఉన్నారు. 412 మంది ఒసి లు యంపీ లుగా ఉన్నారు. 131 మంది యస్.సి., యస్.టీ లు యంపీ లు
ఉన్న వారు ఏమి చేయలేకపోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తున్న, మొత్తం ప్రవేటీకరణ చేస్తున్నా మౌనంగా ఉంటున్నారు. ఇంతమంది ఉన్న తమ గళం విప్పడం లేదు. అంబేద్కర్ స్టేట్ సోషలిజం కోరుకుంటున్నారు. భూమి, పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉండాలన్నారు. కాని ఈ యంపిలు నోరు విప్పడం లేదు. కనీసం నిరసన తెలియచేయడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కోటీశ్వర్లు, పీడక కులాల వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వలన, వారు మౌనంగా ఉంటున్నారు.... అని ప్రజాతంత్ర ఉద్యమకారుడు బాధితుల బంధువు కామ్రేడ్ జె ఎస్ ఆర్ సార్ ఆరోపించారు.
ఇటువంటి పరిస్థితి వస్తుందని ఒక దార్శనికుడిగా జె ఎస్ ఆర్ గారు బిసిలు చట్టసభలల్లో ఉండాలని కోరుకున్నారు. అపుడే చట్ట సభలు దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తాయని జె ఎస్ ఆర్ భావించారు. అందుకొరకు చట్ట సభలల్లో బిసిలు ప్రాతినిధ్యం ఉండాలని, బిసి కమిషన్ వేయాలని జె ఎస్ ఆర్ కోరారు.
విపి సింగ్గారు మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తుంటే అద్వానీ, ఆర్యస్యస్ వాళ్ళు,
బిజేపి వాళ్ళు, వాళ్ళ బానిసలు కమండల యాత్ర చేసి విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టారు. మండల్ కమిషన్ నివేదిక లో బిసిలకు చట్ట సభలల్లో ప్రాతినిధ్యం ఉండాలని సిఫార్సు కూడా ఉంది. ఆ నివేదిక ను అమలు కాకుండా ఈ ఆర్యస్యస్ వాళ్ళు, వాళ్ళ పార్టీ బిజేపి, వాళ్ళ బానిసలు అడ్డుకున్నారనీ .... జె ఎస్ ఆర్ గారు తెలిపారు.
చివరికి ఈ నాడు కనీసం బిసి జనగణన చేయకుండా అడ్డుకుంటున్నారు. అసలు బిసి జనగణన 2011లో చేసారు. మండల్ కమిషన్ రిపోర్ట్ లో కూడా బిసి ల లెక్కలు ఉన్నాయి వాటిని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. కాని తీసుకోరు. కాని ఈ ప్రభుత్వం 10% ఇ.డబ్ల్యు యస్. రిజర్వేషన్ కయితే ఒక వారంలోనే చేసుకుంది. బిసీ ల కోసం అయితే చేయదు. ఇంత జరుగుతున్న బిసి సంఘాలు ఐక్యంగా కదలరు. ఐక్యంగా ఉద్యమించరు. బిసి మంత్రులు, యంపి, యంయల్.ఎ లు రాజీనామా చేయాలి. అంబేద్కర్ గారి స్ఫూర్తితో యస్, యస్సీ యంపి లు అంబేద్కర్ వాదులు చట్ట సభలల్లో బిసిల ప్రాతినిద్యం రాజ్యాంగ సవరణ చేయించడానికి ముందుకు రావాలి. మనకి యాగాలు, యజ్ఞాలు, దేవాలయాలు కాదు కావల్సింది. చట్ట సభలల్లో బిసి లకు 52% ప్రాతినిధ్యం. అపుడే అందరికి ఉచిత విద్య, వైద్యం వస్తుంది. దేశం ముందుకు పోతుంది. అందుకు బిసిల ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే చట్టసభలు బాగుంటాయి. దేశం బాగుంటుందనీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు.
70 సం||లు బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, కమ్మలు, రెడ్లు, దొరలు వాళ్ళ బానిసలే అధికారంలో ఉన్నారు. మరియు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వహిస్తున్నారు. ఉ ద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. అయినా దేశం లో పేదరికం ఎందుకు వుంది. చరిత్రలోను వర్తమానం లోను ఈ దేశ ప్రజల సమస్యలకు కారణాలు ఏమిటి. ఎవరు కారకులు అని అద్యయనం చేసారా. చేయరు... తీవ్రమైన పాదం వ్యక్తం చేశారు.
ఇందాక గోరుతో పెళ్లి రాజకీయ పార్టీల వాళ్ళకు అధికారం కావాలి. నాయకత్వం కావాలి. ఆస్తులు పెంచుకోవాలి. కానీ వీళ్ళకు అందరికి విద్యవద్దు. ప్రజాస్వామ్యము వద్దు. సోషలిజం వద్దు.
చట్ట సభలు బాగుండాలంటే ప్రజాస్వామ్యం ఉండాలంటే దేశం బాగుండాలంటే బిసిలు చట్ట సభలల్లో ఉండాలి. బిసి లంటే శ్రమ జీవులు. యస్సీ యస్టీ, బిసిలు శ్రమ జీవుల పాలన కావాలంటే 52శాతం బిసిల ప్రాతినిధ్యం అవసరం.... అని కామ్రేడ్ జై బొరన్న గారు పేర్కొన్నారు.
131 మంది ఏస్ టీ,, యస్సీ, యంపి లు ఉన్నా ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే మిగతా 412 మంది ఓసీలు. అందుకని ఏమి చేయలేకపోతున్నారు. కనీసం నిరసన కూడా తెలియచేయడం లేదు. అదే 270(52%) బీసీలు ఉంటే వాళ్ళ గళం ఇంకొక రకంగా ఉంటుంది. 410 (యస్సి, యస్ టి, బిసి) యంపీ లు ఉంటే అది శ్రమజీవుల గళం అవుతుందనీ...
జై భారత్ క్రాంతి బోర రాజన్న
రిషి త్రినేత్రుడు జె కె గారి
సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ అన్నమయ్య జె ఎస్ ఆర్ సా ర్
9848540078 తెలిపారు.
శ్రమ జీవుల పాలన అవుతుందనీ జె ఎస్ ఆర్ గారు పేర్కొన్నారు. అందుకొరకు మండల్ కమిషన్ చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని ముఖ్యమైన సిఫార్సు చేసింది అ సిఫార్సు అమలుకు బీసీ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలనీ ...బిసి సంఘాలు ఐక్యతతో, కలసివచ్చే శక్తులతో, అంబేద్కర్వాదులతో, ఐక్యతతో కృషి చేసి చట్టసభలల్లో బిసి లకు 52% ప్రాతినిధ్యం కొరకు ఉద్యమించాలి, సాదించాలి... అని ప్రజా బంధువు కామ్రేడ్ జె ఎస్ ఆర్ గారు తెలిపారు.
ప్రజాస్వామ్యం, సోషలిజం, రాజ్యాంగం వర్ధిల్లాలి.... బీసీ లారా మీరు బిచ్చగాళ్లు కాదు... ఈ దేశ నిర్మాతలు... అని ప్రజా నేస్తం కామ్రేడ్ జె ఎస్ ఆర్ గారు8328277285 తెలిపారు
Sep 05 2023, 15:56