ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత, మమతానురాగాలు వెలకట్టలేనివని, వారి అన్యోన్యమైన అనుబంధానికి శుభసూచికగా నిలిచే రాఖీ పౌర్ణమి, ఒక కుటుంబంలోనే కాక యావత్ సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని బిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
నేడు రాఖీ పండుగ సందర్బంగా హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే ను కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్షా బంధన్ ఒక వేడుక మాత్రమే కాదని, మన కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటుతుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ఇలాంటి పర్వదినాలు జరుపుకోవడం మన సంస్కతి గొప్పతనమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు, నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
Aug 31 2023, 22:29