తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తున్న కేసీఆర్! ప్రజా పాలన గాలికొదిలి ప్రభుత్వ భూములు అమ్ముకు తింటున్న కేసీఆర్! సోనియా గాంధీకి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తున్న కేసీఆర్!
ప్రజా పాలన గాలికొదిలి ప్రభుత్వ భూములు అమ్ముకు తింటున్న కేసీఆర్!
సోనియా గాంధీకి పాలాభిషేకం చేసిన కాంగ్రేస్!
తేది: 02-06-2023 శుక్రవారం
చిన్నకోడూర్ న్యూస్
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మండల కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భాగా పిసిసి భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు సుంచు రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుకున్నది జల్ జంగల్ జమీన్ అన్నట్లు నిధులు నియామకాలు నీరు ఆంధ్ర పాలకుల చేతుల్లో అన్యాక్రాంతం ఐతున్నయని సీమాంధ్రులతో కలిసి ఉంట్టే తెలంగాణ ప్రజలకు మనుగడ ఉండదని కౌలుకళాకారులు విద్యావంతులు విద్యార్థులు ప్రాణాలు వదులుతూ పోరాటం చేస్తుంటే చలించ్చిపోయిన సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు సీమాంధ్ర ఎంపీలు ప్రాణాంతకమైన పెప్పెర స్ప్రేలు కండ్లలో నోటిలో కొట్టి ఊపిరి ఆడకుండా చేసినప్పుడు ఈ కేసీఆర్ ఎక్కడున్నాడని అన్నారు.
ఆంధ్రవాళ్ళు దాడులు చేస్తారని తెలిసే ఆనాడు కేసీఆర్ పార్లమెంటుకు పోలేదని ఆనాడు తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారికి ఉపిరి ఆడకుండా చేసిన ప్రాణాలను పణంగా పెట్టి అటు సోనియమ్మ తో పాటుగా బిజెపి ఎంపీ షుష్మాస్వరాజ్ గారిని మద్దతు ఇవ్వమని అడిగి ఒప్పించి తెలంగాణ బిల్లు ఆమోదింప చేస్తే తెలంగాణ ఏర్పడిందని మోసపురితంగా తెలంగాణ ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కెసిఆర్ ఉద్యోగాలు సప్సిడి తొలగించి ఉన్న శాఖలకు నియామకాలు చేయకుండా ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ కేసీఆర్ మరియు తన సామాజిక వర్గాన్ని అక్రమ సంపాదనతో ఆకాశానికి లేపుతున్నాడని అన్నారు.
రాబోయే రోజులు కాంగ్రేస్ వే నని కేసీఆర్ ను తుంగలో తొక్కడం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుడుమల్ల మల్లేశం, డి. శ్రీనివాస్, బాల్ రాజ్, చంద్రం, రమేష్, ఉన్నారు.
Aug 21 2023, 13:59