/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ దాడులు, 70 బృందాలతో తనిఖీలు.. Yadagiri Goud
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ దాడులు, 70 బృందాలతో తనిఖీలు..

హైదరాబాద్ : బుధవారం ఉదయంనుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ సోదాలు.. నిర్వహిస్తోంది. మొత్తం 70 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

ఈ సోదాలు మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీల్లో బినామీగా ఉన్నాడని.. 15 కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్నారని అంటున్నారు.

ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

SB NEWS

Earthquake:| జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం..

ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది..

సుందరమైన జమ్ముకశ్మీర్‌లోని ప్రజలు వరుస భూకంపాలతో బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి కశ్మీర్‌లో భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయకంపితులవుతున్నారు.

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం దోడా ప్రాంతంలో భూకంపం సంభవించగా, బుధవారం తెల్లవారుజామున కత్రాకు దగ్గరలో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది.

దీని తీవ్రత రెక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 లోతులో ప్రకంపనలు సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ పేర్కొంది..

4 వారాలు ఆలస్యంగా తెలంగాణలోకి రుతుపవనాలు..

Monsoon: దేశంలోకి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న లేదు రెండుమూడు రోజుల తేడాతో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది వారం ఆలస్యంగా కేరళను రుతుపవనాలు తాకాయి..

బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థలు రుతుపవనాల ప్రధాన చోదకాలుగా భావిస్తారు. బంగాళాఖాతంలో ఇలాంటి వ్యవస్థ ఇప్పట్లో ఏర్పడే అవకాశం లేదు. కాబట్టి దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించే అవకాశముందని వాతావరణ నివేదికలు, వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తెలంగాణకు సైతం రుతుపవనాలు ఆలస్యంగా చేరుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణలో రుతుపవనాల రాక దాదాపు నాలుగు వారాలు ఆలస్యమవుతుందని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఒక నివేదికలో తెలిపింది. బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థలు రుతుపవనాల ప్రధాన చోదకాలుగా భావిస్తారు. బంగాళాఖాతంలో ఇలాంటి వ్యవస్థ ఇప్పట్లో ఆవిర్భవించే అవకాశం లేకపోలేదని నివేదిక పేర్కొంది. "స్కైమెట్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ప్రిడిక్షన్ సిస్టమ్ (ERPS) జూన్ 09, జూలై 06 మధ్య వచ్చే 4 వారాలపాటు దుర్భరమైన దృక్పథాన్ని అంచనా వేస్తోంది" అని వాతావరణ సూచన నివేదిక తెలిపింది..

మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కోర్ మాన్‌సూన్ జోన్‌లు తప్పనిసరిగా రుతుపవనాల వర్షాలు అవసరమని నివేదిక పేర్కొంది. స్కైమెట్ నుండి వచ్చిన నాలుగు వారాల అంచనా మ్యాప్ ఈ కాలంలో రాష్ట్రంలోని చాలా భాగం మితమైన పొడి నుండి చాలా పొడిగా ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను అభివృద్ధి చెందుతుండటంతో నైరుతి రుతుపవనాల నిరీక్షణ భారత్ కు మరికొంత కాలం ఉండవచ్చని గత వారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ప్రస్తుత ప్రభావాల కారణంగా జూన్ 15 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున, సోమవారం, భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు సైతం పడే అవకాశముందని తెలిపింది..

రేపట్నుంచి తెలంగాణ పది సప్లిమెంటరీ ఎగ్జామ్స్...!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.

పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు.

50 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా విడులైన సంగతి తెలిసిందే.

SB NEWS

Jammu Kashmir: సరిహద్దు దాటేందుకు యత్నించిన ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ..

జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది..

ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇద్దరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఉగ్రవాదులిద్దర్ని కాల్చి చంపేశాయి.

ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను ఎల్ఓసీ వద్ద ఆర్మీ, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో హతమార్చినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. గత నెలలో శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మిట్ ను భగ్నం చేసేందుకు ఇలాగే పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేసింది.

70 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగం బహుమతిగా పంపిణీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఈరోజు జాబ్ మేళా సందర్భంగా 70 వేల మంది యువతకు నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపిణీ చేశారు. ఈ యువకులకు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించారు.

ఈరోజు ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించారు.

దేశంలోని 43 చోట్ల నిర్వహించే ఉపాధి మేళా కింద ఈ జాయినింగ్ లెటర్లను పంపిణీ చేశారు. రోజ్‌గర్ మేళా అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక చొరవ, దీని కింద అపాయింట్‌మెంట్ లెటర్‌లు త్వరగా మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఇవ్వబడతాయి.

రానున్న కాలంలో ఉపాధి కల్పించడంలో ఉపాధి మేళా కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో, ఇది యువతకు వారి సాధికారత మరియు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్ధవంతమైన అవకాశాలను ఇస్తుంది. ప్రధానమంత్రి చొరవతో యువతలో ఆనంద వాతావరణం కనిపించింది.

15న నాగపూర్‌ బీఆర్‌ఎస్‌ భవనం ప్రారంభం.. కేసీఆర్‌ చేతుల మీదుగా శ్రీకారానికి చర్యలు

బీఆర్‌ఎస్‌ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

15న ఉదయం నాగపూర్‌ వెళ్లనున్న కేసీఆర్‌.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు.

ముంబై, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ ఆఫీస్‌లను ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు పార్టీ భవనాల కోసం అన్వేషణ జరుగుతున్నది.

బీఆర్‌ఎస్‌కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామక కార్యక్రమాన్ని చేపట్టింది. అటు.. ఈ నెల 19న నాందేడ్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: జూన్ 13

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (మంగళవారం) టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న (సోమవారం) శ్రీవారిని79,087 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 35,640 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

SB NEWS

Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్..

Cyclone Biparjoy Latest News: బిపోర్‌ జాయ్‌ తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. అరేబియా సముద్రంలో చురుగ్గా కదులుతూ దూసుకువస్తోంది.

ఈ నెల 15వ మధ్యాహ్నం గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌవద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో బిపోర్‌ జాయ్‌ తీవ్ర తుఫాన్‌గా ఉంటుందని.. గంటలకు 150 కి.మీ వేగంలో గాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, మోర్బీ, జునాఘర్, రాజ్‌కోట్‌లతోపాటు పలు జిల్లాలపై బిపోర్‌ జాయ్‌ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో అధికారులను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అప్రమత్తం చేసింది.

సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. బుధవారం ఆరెంజ్ అలర్ట్, జూన్ 15న రెడ్ అలర్ట్ జారీ చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సముంద్ర తీరప్రాంతానికి దగ్గరగా వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. వారందరనీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చేపల వేటను ఇప్పటికే నిషేధించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెడీ అయ్యాయి..

కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి రేపే ప్రకటన

ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా!

రేపు ప్రెస్‌మీట్‌లో ప్రకటించనున్న నేతలు

అమిత్‌షా ఖమ్మం టూర్‌కు ఒకరోజు ముందే..

బీజేపీకి నిరాశ.. కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌

ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి?

బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. వీరికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా జత కలవనున్నారు. వీరు ముగ్గురూ కలిసి బుధవారమే హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌లో తమ చేరిక విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా బీఆర్‌ఎ్‌సను వీడాల్సివచ్చిన పరిస్థితులు, తాము ఎదుర్కొన్న ఇబ్బందులతోపాటు తమ భవిష్యత్తుపై నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారని తెలిసింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖమ్మం జిల్లా పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే కాంగ్రె్‌సలో చేరికకు సంబంధించి వీరు ప్రకటన చేయనుండడం గమనార్హం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకే చెందిన నేత కావడం, ఖమ్మంలో అమిత్‌షా సభకు ముందురోజే తన నిర్ణయాన్ని వెల్లడించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పొంగులేటితోపాటు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి.. కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా కాలంగా బీఆర్‌ఎస్‌ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఒకదశలో అధిష్ఠానం ఆయనతో మాట్లాడినా.. పార్టీలో ఉండేందుకు ఇష్టపడలేదని సమాచారం. దీంతో సీఎం కేసీఆర్‌ ఒక సందర్భంలో, ‘‘పొంగులేటి పోతాడు.. వదిలేయండి’’ అని అంతర్గత సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే పొంగులేటి ఒంటరిగా కాకుండా.. జిల్లాలోని తన అనుచర గణాన్ని వెంట తీసుకొని మరీ పార్టీని వీడుతుండడమే కీలకంగా మారింది. ఈ మేరకు ఆయన గత కొన్నినెలలుగా నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమావేశాల్లో తన భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా చర్చించారు. తొలుత బీజేపీలో చేరాలని పొంగులేటి భావించినా.. ఇందుకు ఆయన అనుచరుల నుంచి పూర్తి మద్దతు రాలేదు. దీంతో ఆయన పలు దఫాలుగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ చే రికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌తో, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కానీ, ఆ పార్టీ నుంచి తగిన భరోసా రాలేదన్నది సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో అయితేనే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది.

ఒకరు ఇద్దరై.. ఆ తర్వాత ముగ్గురై

బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని తొలుత పొంగులేటి ఒక్కరే ప్రకటించగా.. నెల రోజుల క్రితం ఆయనకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తోడయ్యారు. జూపల్లి కలిశాక తాము ఎటువైపు వెళ్లాలన్నదానిపై ఇద్దరి మధ్య అంతర్గత సమావేశాలు జరిగాయి. అదే సమయంలో ఇద్దరూ కలిసి పలువురు నేతలతో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. వారం రోజుల క్రితం వీరికి బీఆర్‌ఎ్‌సకే చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జత కలిశారు. దీంతో ముగ్గురూ కలిసి టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవితో చర్చలు జరిపారు. ఈ 14న సంయుక్తంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గ్గురు నేతలు కాంగ్రె్‌సలోకి వెళ్లడమనేది అధికార బీఆర్‌ఎ్‌సకే కాకుండా బీజేపీకి కూడా నిరాశ కలిగిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు మాత్రం ఈ పరిణామం భవిష్యత్తులో తమకు బూస్ట్‌గా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి సోమవారం సీఎం కేసీఆర్‌ గద్వాల జోగుళాంబ జిల్లాలో జరిపిన పర్యటనలో పాల్గొని ఆశ్చర్యపరిచారు. కేసీఆర్‌ వెంట పర్యటన ఆసాంతం ఉండడంతోపాటు గద్వాలలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. సభావేదికపై బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి కూర్చున్నారు. దీంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.