/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది Yadagiri Goud
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :జూన్ 12

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (సోమవారం) స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 92,238 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 40,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు...

SB NEWS

ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి..

ఏపీ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన 6 గురు మృతి చెందారు.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద లారీని ఢీ కొట్టింది ఓ కారు.ఈ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు మహిళలు, రెండేళ్ల వయసు చిన్నారి కూడా ఉన్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది..

Cm Jagan: ఏపీలో నేడే జగనన్న విద్యాకానుక.. ప్రారంభించనున్న సీఎం జగన్..

ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ బడులకు వెళ్లే విద్యార్ధులకు అవసరమైన వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు..

2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు.

పల్నాడు జిల్లా పెద కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు..

విద్యా కానుక కిట్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంగ్లోష్-తెలుగులో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా ఇస్తారు.

దీంతో పాటు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6-10 తరగతి పిల్లలకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ, 1-5 తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్ ప్రారంభమైన తొలిరోజే అందిస్తున్నారు..

నేటి నుంచి మోగనున్న బడిగంట

తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై విద్యా శాఖ ప్రకటన చేసింది.ఈనెల12 న,సోమవారం నుండి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది.

దీంతో ఈ రోజు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విద్యాశాఖ స్పష్టతను ఇచ్చింది...

SB NEWS

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్సడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 933 కేంద్రాల్లో 2,70,583 మంది మొదటి ఏడాది విద్యార్థులు, 1,41,742 మంది రెండో ఏడాది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులు దొర్లినట్లయితే విద్యార్థులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా అధికారిని కలవాలని సూచించారు...

రేపు జోగులాంబ గద్వాల్ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్ సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా లో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణాలు చేపట్టగా ఇటీవల ఆ నిర్మాణాలు పూర్తయ్యాయి.

అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కూడా చాలా రోజుల క్రితమే నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సోమవారం వాటిని ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

ఇప్పటికే సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ శ్రేణులు పూర్తిచేశాయి. 2018 తర్వాత మళ్లీ ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 2018 జూన్‌ నెలలోనే గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగా,

దాదాపు ఐదేళ్ల తర్వాత గద్వాల జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో హామీలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశలు పెట్టుకున్నారు. గద్వాలకు మెడికల్‌ కాలేజీ, చేనేత పార్కు, పలు సాగునీటి పథకాలకు సంబంధించి నిధుల విడుదలపై ప్రత్యేకంగా హామీలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది...

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పై కేసు నమోదు

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ తో పాటు మరో ఇద్దరు పై భూ ఆక్రమణకు సంబంధించిన కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు బంజరాహిల్స్ పోలీసులు పట్నం నరేందర్ తో పాటు మరో ఇద్దరి పై కేసు నమోదు చేశారు.

వివరాల ప్రకారం..... బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ కు చెందిన సామ ఇంద్రపాల్ రెడ్డికి సంబంధించిన భూమిని పట్నం నరేందర్ రెడ్డి, వై. శ్రీరామ్ రెడ్డి, రాకేష్ రెడ్డిలు మోసం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

దాంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. దాంతో వివిధ సెక్షన్ ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.

అంతే కాకుండా ఈ కేసు పై పూర్తి విచారణ జరపాలని బంజారాహిల్స్ ఎస్సై నవీన్ రెడ్డికి ని కోర్టు ఆదేశించింది...

హెల్త్‌హబ్‌గా తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ :జూన్ 11

తెలంగాణ హెల్త్‌ హబ్‌గా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ ఎదిగిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బంజారాహిల్స్‌లో ఆదివారం లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆసుపత్రిని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని, అదే విధంగా ఆరోగ్యరంగంలో అభివృద్ధి చెందిందన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు.

10వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో గాంధీలో ప్రారంభం అవుతుందని, కార్పొరేట్‌ ఆసుపత్రులతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానాలు పోటీపడుతున్నాయన్నారు. 2014 లో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 30శాతం ఉంటే.. గత నెల 70శాతం చేరాయన్నారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌గా ఉందన్నారు.

ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నామన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ దేశంలో నెంబర్-1 అని, వందశాతం ఆసుపత్రి డెలివరీలు జరుగుతున్నాయన్నారు. అనవసర సీ సెక్షన్లు తగ్గించడంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు తోడ్పాటు అందించాలన్నారు. అనవసర సీ సెక్షన్లతో అనేక ఇబ్బందులుంటాయని, నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తిన్నారని, నేడు అది రివర్స్ అయ్యిందన్నారు. ఆసుపత్రిలో ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యసేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు ఆసుపత్రి నిర్వాహకులకు సూచించారు...

కోమటిరెడ్డితో​ జూపల్లి భేటీ.. వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో​ ఎ‍న్నికల ముందే పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది.

ఈ క్రమంలో​ తెలంగాణలో కీలక నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే పక్రియను వేగవంతం చేసింది. కాగా, తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి కృష్ణారావు ఆదివారం భేటీ అయ్యారు. 

ఇక, వీరి భేటీ అనంతరం కోమటిరెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌రెడ్డి మీడియాతో​ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పాను. నల్లగొండలో​ 18 లేదా 19 తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుంది. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్‌ అంటే ఏంటో చూడండి అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు మీడియాతో​ మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరతానో ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. పార్టీలో చేరే ముందు జూపల్లి ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. నిన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి, నేడు కోమటిరెడ్డితో జూపల్లి భేటీ అయ్యారు.....

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్:జూన్ 11

శంషాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సౌందర్య ఆత్మహత్య కు పాల్పడ్డారు. మహారాష్ట్రకు చెందిన గాజుల సౌందర్య మూడేళ్లుగా కొండాపూర్‌లోని ఐబీఎం IBM లో ఉద్యోగం చేస్తున్నారు. 2022 డిసెంబర్ 2న మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ అభినవ్‌ తో వివాహం జరిగింది.

ఈనెల 8న సౌందర్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ రోజు సాయంత్రం భర్త అభినవ్‌తోపాటు మామకు ఫోన్ చేశారు. తాను దూరంగా వెళ్లపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఫోన్ చేసి.. శంషాబాద్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌పై నుంచి దూకుతున్నట్లు భర్తకు చెప్పారు.

దీంతో భర్త అభినవ్‌ వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సౌందర్య భవనం నుంచి దూకి రక్తపు మడుగులో పడి ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతూ నిన్న శనివారం రాత్రి మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం సౌందర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శంషాబాద్‌లోని అర్కాన్ హాస్పిటల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి సౌందర్య దూకి అత్మహత్యకు పాల్పడ్డారు. తాను ఊహించుకున్నట్లుగా జీవితం ఉండడం లేదని తరుచూ ఫ్రెండ్స్‌తో చెప్పారని, ఇటీవలే భర్త ఉద్యోగం కోల్పోవడంతో.. ఇంటివద్దే ఉంటున్నారు. దీంతో సౌందర్య మానసికంగా బాధపడుతూ.. అనుకున్న విధంగా భర్త దొరకకపోవడం.. ఊహించుకున్న జీవితం లేకపోవడం వల్లే.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. శంషాబాద్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.