/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు TS breaking
తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు

తెలంగాణలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ లాస్ట్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు. 

ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న తిరిగి స్కూళ్లు రీ-ఓపెన్ అవుతాయి. 

అకాడమిక్ ఇయర్ క్యాలెండర్‌కు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ వేసవి సెలవుల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి.

అత్తాపూర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌.. సెల్ ఫోన్ కాల్స్‌ పరిశీలిస్తున్న కాప్స్

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌ కలకలం రేపింది. ఇంట్లో తల్లి ఉండగానే డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌ కావడం సంచలనంగా మారింది. రాజేంద్రనగర్ లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ సంచలనంగా మారింది.

హైదరాబాద్‌ లోని అత్తాపూర్ లో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వారికి హుమర్ బెగమ్ అనే కూతురు కూడా ఉంది. గోల్కొండ మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న హుమర్ బెగమ్. రోజూ లాగానే తండ్రి ఉద్యోగానికి వెల్లడం, ఇంట్లో తల్లి, కూతురు ఉంటారు. అయితే హాల్ లో ఇద్దరూ కూర్చున్నారు. పని నిమిత్తం లోనికి వెల్లిన తల్లి బయటకు వచ్చిన తల్లికి ఇంట్లో హుమర్‌ బేగమ్‌ కనిపించలేదు. 

తన రూములో వుంటుందని భావించి కాసేపు హాల్‌ లోనే కూర్చుంది తల్లి. ఎంతసేపటి కూతురు బయటకు రాకపోవడంతో రూం లోకి వెల్లి చూసింది తల్లి. రూలో కూడా కూతురు కనిపించలేదు. దీంతో ఇల్లంతా వెతికింది అయినా ఫలితం లేకుండా పోయింది. ఎంత వెతికినా కూతురు కనిపించకుండా పోవడంతో భయాందోళన చెందిన తల్లి భర్తకు ఫొన్ చేసి సమాచారం ఇచ్చింది. విద్యార్థిని చదువుతున్న కళాశాలకు, స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేశారు అయినా ఎక్కడా తన ఆచూకీ తెలియక పోవడంతో హుటాహుటిన అత్తాపూర్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు.

దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్ ఫోన్ కాల్ లిస్టు ను పరిశీలిస్తున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లారా? లేక యువతి ఇష్టప్రకారమే ఎవరితోనైనా బయటకు వెళ్లిందా? వెల్లేటప్పుడు ఎవరెవరికి కాల్ చేసింది, ఎవరెవరిని సంప్రదించింది అనే కోణంలో క్యాప్స్ పరిశీలిస్తున్నారు.

17ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు సంచలనం.. మాఫియా డాన్‌, మాజీ ఎంపీకి జీవిత ఖైదు..

ఉమేశ్‌పాల్‌ కిడ్నాపింగ్‌ కేసులో యూపీ మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతిఖ్‌ అహ్మద్‌కు జీవితఖైదు విధించింది న్యాయస్ధానం. ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో అతిఖ్‌తో పాటు 10 మంది నిందితులను గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపర్చారు.అయితే, అతిఖ్‌తో పాటు ముగ్గురిని మాత్రమే దోషులను తేల్చింది న్యాయస్థానం. మిగతా ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. ముగ్గురు దోషులకు కఠిన జీవిత ఖైదుతో పాటుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది కోర్టు. ఈ జరిమానా మొత్తాన్ని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

17 ఏళ్ల నాటి కేసులో అతిఖ్‌ అహ్మద్‌కు జీవితఖైదు విధించింది కోర్టు. అతిక్‌ అహ్మద్‌ సోదరుడు ఖలీద్‌ అజీంను ఈ కేసులో నిర్ధోషిగా ప్రకటించింది న్యాయస్దానం. తనకు ప్రాణహానీ ఉందని అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు అతిఖ్‌ అహ్మద్‌. అతిఖ్‌అహ్మద్‌ను కోర్టులో హాజరపర్చడానికి గుజరాత్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ తీసుకొచ్చారు యూపీ పోలీసులు. తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారని అంతకుముందు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని అతిక్‌ అహ్మద్‌కు సూచించింది సుప్రీంకోర్టు. కోర్టులో అతిఖ్‌ అహ్మద్‌తో పాటు మిగతా నిందితులను ప్రవేశపెట్టినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. లాయర్లు కోర్టులో నిరసన తెలిపారు.

2005లో జరిగిన రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ హత్యకు అహ్మద్, అష్రఫ్‌లు కూడా కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీఎఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అతీక్ అహ్మద్. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షి ఉమేష్‌పాల్‌కు సంబంధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 2006 ఫిబ్రవరి 28న అతిక్ అహ్మద్, అష్రఫ్ ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేశారు. ఉమేష్ పాల్‌ను కొట్టి, అతని కుటుంబంతో కలిసి చంపేస్తానని బెదిరించి, కోర్టులో బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేశారు. 2007లో మాయావతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జూలై 5, 2007న, ఉమేష్ పాల్ అతిక్ మరియు అష్రఫ్‌తో సహా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పోలీసుల విచారణలో మరో ఆరుగురి పేర్లు తెరపైకి వచ్చాయి.

అతిక్, అష్రఫ్ సహా 11 మందిపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009లో ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్‌ నుంచి అంటే ప్రభుత్వం తరఫున మొత్తం 8 మంది సాక్షులను హాజరుపరిచారు. ఈ కేసులో 11 మంది నిందితుల్లో అన్సార్ బాబా అనే నిందితుడు చనిపోయాడు. అతీక్, అష్రఫ్ సహా మొత్తం 10 మంది నిందితులపై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయి, కొట్టుకున్నారు. నేతలు జిక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై ఆయనకు మద్దతుగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కూడలిలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మరో కాంగ్రెస్ నేత జిక్కిడి ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఒక్కసారిగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దీక్షా శిబిరాన్ని ముట్టడించారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణలు చోటుచేసుకుంది.

గో బ్యాక్ మల్ రెడ్డి రాంరెడ్డి అంటూ నినాదాలు..

స్థానికులకు కాకుండా, స్థానికేతరులకు ఇంఛార్జిగా వ్యవరించడం సరియైన పద్ధతి కాదంటూ జిక్కిడి ప్రభాకర్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్య లేదని ఆరోపించారు. పెయిడ్ కార్యకర్తలను తీసుకొచ్చి దీక్షా శిబిరంలో కూర్చోబెట్టడం సిగ్గు చేటన్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి పెయిడ్ కార్యకర్తలను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నంలో ప్రజలు తిరస్కరిస్తే ఎల్బీనగర్ లో పెత్తనం చేయడం సరియైన పద్ధతి కాదని మండిపడ్డారు.

ఇకపై సికింద్రాబాద్ టూ బెంగళూరు విద్యుత్ రైళ్లే.! ఆ మార్గంలో జెట్ స్పీడ్‌తో రయ్.. రయ్..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు విద్యుత్ రైళ్లు నడిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న గద్వాల్ – కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ మార్గం విద్యుదీకరణ పనులు పూర్తయి.. ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ నుంచి ధర్మవరం వరకు.. అలాగే నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం నుంచి బెంగళూరు వరకు అంతరాయం లేకుండా విద్యుత్ ట్రాక్షన్‌ ద్వారా రైళ్లను నడిపేందుకు వీలు కలిగింది.

గద్వాల్ – కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ, డోన్ – కర్నూలు సిటీ – మహబూబ్‌నగర్‌ విద్యుదీకరణ, సికింద్రాబాద్ – ముద్ఖేడ్ – మన్మాడ్ విద్యుదీకరణ పనులు గ్రాండ్ ప్రాజెక్ట్‌లో భాగంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను 2018-19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో చేపట్టింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని డోన్ – గుత్తి – ధర్మవరం, నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం – బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది. దీంతో, ప్యాసింజర్, సరకు రవాణా రైళ్లు రెండూ సికింద్రాబాద్ నుంచి ధర్మవరం.. ధర్మవరం నుంచి బెంగళూరు మీదుగా సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుంది.

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో ఇంజిన్ మార్చడం లాంటివి ఇకపై ఉండదు కాబట్టి.. రైళ్లను మార్గం మధ్యలో నిలిపే సమయం తగ్గుతుంది, అలాగే రైళ్ల సగటు వేగం పెరుగుతుంది. విద్యుదీరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు కూడా పెద్ద ఎత్తున ఆదా అవుతాయి. 

కాగా, ‘విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. గద్వాల్-కర్నూలు మధ్య మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

పేపర్ లీకేజీలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది - రేవంత్ రెడ్డి

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇచ్చారని, కానీ దోపిడీ దొంగతనం చేసిన కేటీఆర్‌కు మాత్రం సమాచారం ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. 

ఈ విషయంలో హవావాతో పాటు విదేశాల్లో లావాదేవీలు కూడా జరిగాయంటూ ఆరోపించారు. ఈ పేపర్ లీక్ స్కామ్‌లో పాలకులు, ప్రభుత్వాధికారుల పాత్ర కూడా ఉందన్నారు. ఈ కేసుని అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయన్నారు. కానీ.. అవినీతి నిరోధక చట్టంలోని ఒక్క సెక్షన్ కింద కూడా సిట్ అధికారి కేసు పెట్టలేదని పేర్కొన్నారు. తద్వారా.. ముఖ్యమైన వ్యక్తుల్ని కాపాడేందుకు సిట్ అధికారి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాలంటే.. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ పేపర్ లీక్‌పై ఫిర్యాదు చేసేందుకు తాము సీబీఐ, ఈడీ డైరెక్టర్ల అపాయింట్ మెంట్ అడుగుతున్నా ఇవ్వడం లేదని.. వెంటనే అపాయింట్ ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి మంత్రి కేటీఆర్ ఎదురుదాడులకు దిగుతూ.. విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం అబద్దమని, డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాల కారణంగా నిందితుల ద్వారా ఈ లీకేజీ బయటపడిందని అన్నారు. 

దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపిస్తే.. వారిని కాపాడేందుకు, కేసుని పక్కదాని పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను రంగంలోకి దింపుతుందని వెల్లడించారు. ఇప్పటివరకూ సిట్ వివిధ కేసుల్లో ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ కుంభకోణంలో ఉన్న పాత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని.. తనకు సంబంధం లేదంటూ కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

నిబంధనలను ఉల్లంఘించి, అర్హత లేని వాళ్లను టీఎస్‌పీఎస్‌సీ కమిషన్ సభ్యులుగా నియమించారని.. ఆ కమిషన్ చైర్మన్‌తో పాటు ఏడు మంది సభ్యుల నియామకంతోనే అవకతవకలకు పునాది వేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. కస్టడీలోకి తీసుకోకముందే.. ఈ లీకేజీ విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించినదని మంత్రి కేటీఆర్ ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఒకవేళ ఈ లీకేజీ వ్యవహారంతో కేటీఆర్‌కు సంబంధం లేకుంటే.. సిట్ విచారణ జరుగుతున్న సమయంలో, ఇంకా నివేదిక పూర్తి కాకముందే ఆయనకు పూర్తి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. కేటీఆర్ వద్ద నిర్ధిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహిళకు అరుదైన చికిత్స.. ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు

ఒక్క కాన్పులో ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టడం సాధారణమైన విషయమే. కొన్నిసార్లు ముగ్గురు, నలుగురు కూడా పుట్టడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం తల్లి, పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించడం విశేషం.

ఈ మహిళకు మొదటగా బాబు, తర్వాత పాప, బాబు, బాబు మొత్తం నలుగురు పిల్లలు పుట్టారని డాక్టర్లు తెలిపారు. మొదటి కాన్పులో ఒక బాబు జన్మించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండో కాన్పులో నలుగురు బిడ్డలు పుట్టడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం తదుపరి చికిత్స కోసం కుటుంబసభ్యులు సిద్దిపేట చిల్డ్రన్ హాస్పిటల్ కు తరలించారు.

సంగారెడ్డి డీఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు

సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంటల పాటు సంగారెడ్డి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో శనివారం కూడా సోదాలు జరుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ లోని డీఈఓ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు కూడా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. 

సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ స్కూల్ SSC సిలబస్ నుంచి ICSE కి అప్ గ్రేడ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్ గ్రేడ్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణతో స్కూల్ యాజమాన్యం చర్చలు జరిపింది. స్కూల్ NOC కోసం రూ. లక్షా 10 వేల రూపాయలు డిమాండ్ చేశారు. ముందుగా రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత 60 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక స్కూల్ యాజమాన్యం ACB ని ఆశ్రయించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, DEO రాజేష్ లు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.

కల్వకుంట్ల కుటుంబంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపుతుంది. ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఈ ఘటనకు మంత్రి కేటీఆర్ కారణమని ఆరోపిస్తున్నాయి. పేపర్ లీకేజీ ఘటనపై నేడు బిజెపి.. ధర్నా చౌక్ లో ” మా నౌకరీలు మాగ్గావాలే” అనే నినాదంతో మహధర్నా చేపట్టారు.

ఈ మహా ధర్నాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, విజయశాంతి, డీకే అరుణ సహా పలువురు బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో ఏళ్లుగా జరుగుతుందని ఆరోపించారు.

పేపర్ లీక్ అయితే సీఎం స్పందించలేదని, ఆయన నిద్ర మత్తులో ఉన్నాడని విమర్శించారు. ” కల్వకుంట్ల కుటుంబంలో ఒకరు బ్రోకర్, ఒకరు లిక్కర్, ఒకరు లీకర్. కెసిఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందా..? డ్రగ్స్ కేసు, నయీమ్ కేసు పై వేసిన సిట్ నివేదికల్లో ఏం తేలింది? పేపర్లు లీక్ చేసే వాళ్ళని వదిలేసి మాకు నోటీసులు ఇస్తున్నారు” అంటూ విరుచుకుపడ్డారు బండి సంజయ్.

బ్రౌన్‌ షుగర్‌ను చర్మానికి ఇలా వాడితే ముడతలే రావట..!

బ్రౌన్‌ రైస్‌ ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు.. అలాగే బ్రౌన్‌ బ్రెడ్‌ కూడా.. వైట్‌ బ్రెడ్‌తో పోలిస్తే.. బ్రౌన్‌ బ్రెడ్‌ తినడమే ఆరోగ్యానికి మంచిది.. వైట్‌ షుగర్‌ కంటే..బ్రౌన్‌ షుగర్‌ వాడటం వల్ల ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చు.. అయితే బ్రౌన్‌ షుగర్‌ ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా కాపాడుతుంది. బ్రౌన్ షుగర్‌ను 2 రోజులకు ఒకసారి మీ చర్మానికి అప్లై చేయడం వల్ల మీ చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్‌ను ముఖం, మెడకే కాకుండా మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్లకు కూడా ఉపయోగించవచ్చు.

బ్రౌన్ షుగర్ డెడ్ స్కిన్ సెల్స్ ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును అందిస్తుంది. చర్మంపై ఉన్న ట్యాన్‌ని తొలగించి, మెరిసేలా చేస్తుంది. టొమాటో స్లైస్‌లో బ్రౌన్ షుగర్ వేసి, యాంటీ క్లాక్ వైజ్‌లో ముఖం, మెడపై నెమ్మదిగా మసాజ్ చేయండి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మళ్లీ రెండు నిమిషాలు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.

బ్రౌన్ షుగర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్, చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి మృతకణాలను తొలగిస్తుంది. కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. బ్రౌన్ షుగర్ చనిపోయిన కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. తేనె, బ్రౌన్ షుగర్‌ను సమాన పరిమాణంలో తీసుకుని దానికి లావెండర్ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించండి…10-15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.

బ్రౌన్ షుగర్ సహజ హ్యూమెక్టెంట్. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, తేమగా చేస్తుంది… సాధారణ చక్కెర కంటే బ్రౌన్ షుగర్ మెత్తగా ఉంటుంది. కొబ్బరి నూనెతో కొద్దిగా బ్రౌన్ షుగర్ కలపండి. లావెండర్ నూనె జోడించండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం సాఫ్ట్‌గా అవుతుంది.

బ్రౌన్ షుగర్‌ను చర్మానికి అప్లై చేయడం వల్ల మచ్చలు తగ్గుతాయి. బ్రౌన్ షుగర్‌లో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఇది మెలనిన్ ఏర్పడటాన్ని కూడా నియంత్రిస్తుంది. నువ్వుల నూనెలో ఒక చెంచా బ్రౌన్ షుగర్ వేసి ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బ్రౌన్ షుగర్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు రాకుండా చేస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే సరిపోతుంది.

అలాగే, చర్మంపై బ్రౌన్ షుగర్ ఉపయోగించేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. లేకపోతే దద్దుర్లు రావచ్చు. పురుషులు కూడా బ్రౌన్ షుగర్‌ను వాడొచ్చు.. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ట్రై చేసి చర్మాన్ని మరింత కాంతివంతంగా చేసుకోండి.!