స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి ఏమన్నారంటే...
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎటు చూసినా హాహాకారాలతో స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిసరాల్లో విషాద వాతావరణం అలుముకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాంప్లెక్స్‌లోని సిబ్బంది, స్థానికులు పరుగులు తీశారు.
సెల్లార్లో వైర్లు కాలి 4, 5, 6 , 7 ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. సుమారు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్భంది.. ఘటనా స్థలానికి చేరుకొని 12 మందిని కాపాడారు. అందులో ఆరుగురు మరణించారు. అయితే, ఈ ఘటనపై స్పందించిన అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి.. ప్రమాదానికి గల కారణాన్ని వివరించారు. యజమానులకు ఫైర్ సేఫ్టీని పెట్టుకోమని చెప్పినా నిర్లక్ష్యం చేశారని, ఇందులో షాప్ కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.
స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షాక్ అనే భావిస్తున్నారు. బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ పెట్టినా అవి ఏమాత్రం పని చేయలేదు. బిల్డింగ్ లో సెట్ బ్యాక్స్ అనుకూలంగా ఉన్న కారణంగా ఫైర్ ఫైటింగ్ ఈజీగా చేయగలిగారు. అయితే, ప్రస్తుతానికి బిల్డింగ్ పరిస్థితి బాగానే ఉందని నిర్థారించారు.
ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ లో తప్పనిసరిగా ఉండాలని, ఫైర్ సేఫ్టీని మెయింటెనెన్స్ సరిగా ఉంచుకోవాలని నాగిరెడ్డి సూచించారు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్ లు లాక్ చేయకూడదు. అయితే, చనిపోయిన వాళ్ల ప్రాంతంలో తాళాలు వేసి ఉండటంతో వాళ్లు బయటపడలేక పోయారు. వ్యాపారా లావాదేవీలు నిర్వహించే వాళ్లు మెయింటేన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్ వారికీ నోటీసులు ఇచ్చినా వాటిని పాటించాలేదని నాగిరెడ్డి అన్నారు.
కాంప్లెక్సులు ఉన్న వాళ్లు లిఫ్ట్ తోపాటు, మెట్ల దారిని కూడా తెరచి ఉంచాలని చెన్నారు. ఏ కాంప్లెక్ లో అయినా మెట్ల దారిని లాక్ చేస్తే 101 కు ఫోన్ చేయాలి, వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే నగరంలో 1150 ఎస్టాబ్లిష్ మెంట్ల అగ్నిమాపక శాఖ పరిశీలన చేశామని అన్నారు.
Mar 17 2023, 18:28