/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz TS : ఉపాధ్యాయ MLC ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపు. TS breaking
TS : ఉపాధ్యాయ MLC ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపు.

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.

చెన్నకేశరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో ఏవీఎన్ రెడ్డి గెలిచారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు లెక్కింపు పూర్తయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తవగా.. ఏ అభ్యర్థికీ సరైన మెజార్టీ దక్కలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థుల్లో ఎవరికీ గెలుపునకు అవసరమైన ఓట్లు రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్దతిలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది.

మొత్తం 29,720 ఓట్లకు గాను 25,868 ఓట్లు పోలవగా, అందులో 452 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన 25,416 ఓట్లలో గెలుపునకు కావాల్సిన 12,709 ఓట్లు ఏ ఒక్క అభ్యర్థికి రాకపోవడంతో ఎలిమినేషన్‌ పద్దతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్‌రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎప్‌టీఎస్‌ అభ్యర్థి మాణిక్‌రెడ్డికి, కాంగ్రెస్‌ బలపరచిన గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి పోటీ చేశారు.

మగజాతి మొత్తం అంతరించిపోయి స్త్రీ జాతికి నేనొక్కడినే దిక్కవ్వాలి.. రాంగోపాల్ వర్మ

టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి వైరల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ విద్యార్థులతో మాట్లాడుతూ కాంట్రవర్సీకి తెర తీశారు. వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తూ వైరల్ గా మారారు.

తాజాగా నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ విద్యార్థులకు ఉచిత సలహాలు ఇచ్చారు. ఏం చేయాలన్నా ఈ వయసులోనే చేయాలి అందుకే నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు.. ఉన్నది ఒకటే జీవితం దాన్ని పాడు చేసుకోవద్దు.. చనిపోయాక స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశి, మేనకలు ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయండి అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. ఎవరికి నచ్చిన విధంగా వారు బతకాలని ఎవరి మాట వినాల్సిన అవసరం లేదని అన్నారు. కష్టపడి చదివే వారు ఎప్పుడూ పైకి రాలేరని అందుకే జీవితాన్ని ఎంజాయ్ చేయండి అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ భయంకరమైన వైరస్ వచ్చి మగజాతి అంతా అంతరించిపోవాలని నేను మాత్రమే ఉండిపోయి స్త్రీ జాతికి దిక్కవ్వాలంటూ చెప్పుకొచ్చారు. కాగా ఈ మాటలకు అక్కడ వారెవరు అడ్డు చెప్పకపోగా రాంగోపాల్ వర్మ ఒక ప్రొఫెసర్, ఫిలాసఫర్ అంటూ ప్రశంసించడం మరో విశేషం. అంతేకాకుండా వర్మకు పిహెచ్ డి, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయని చెప్పటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ప్రస్తుతం ఈ మాటలు విన్న వారంతా వర్మపై విరుచుకుపడుతున్నారు విద్యార్థులకు చెప్పాల్సిన మాటలు ఇవేనా.. ఇలాంటి మాటలు వారికి చెప్తే వారి భవిష్యత్తు ఏమవుతుంది అంటూ మండిపడుతున్నారు.

వీధి వ్యాపారుల షెడ్లను వెంటనే ప్రారంభించాలి - మాజీ మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి.

జగిత్యాల జిల్లా కేంద్రం లో వీధి వ్యాపారుల కోసం గొల్లపల్లి రోడ్డులో నిర్మించిన షెడ్లను వెంటనే ప్రారంభించి, వీధి వ్యాపారులకు అప్పగించాలని కోరుతూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బిజెపి నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి గురువారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 

రహదారుల వెడల్పు, వీధి వ్యాపారుల క్రమబద్ధీకరణలో భాగంగా పట్టణ ప్రగతి నిధులను వెచ్చించి పాత బస్టాండ్ నుండి గొల్లపల్లి రోడ్డులో వీది వ్యాపారుల కోసం కేటాయించే 37 షెడ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కొన్ని రాజకీయ కారణాలవల్ల ఆ షెడ్ల ను ప్రారంభించకుండా తాత్సారం చేస్తున్నారని పేర్కొన్నారు. 

అదేవిధంగా పట్టణ ప్రగతి మరియు మెప్మా నిధుల ద్వారా నిర్మించవలసి ఉన్న మిగతా 23 షెడ్ల నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు. 

ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన షెడ్ల ను వీధి వ్యాపారులకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేసి పట్టణం లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతోపాటు వీధి వ్యాపారులకు చేయూతనివ్వాలని వినతి పత్రం లో కోరారు.

మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీ కుటుంబం అప్పుల పాలు చేసి చంపేసింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.

“పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొర కొడుకా కేటీఆర్.. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు? 33 ప్రాజెక్టులు కట్టి తెలంగాణ బీడు భూములకు నీళ్ళు పారించినందుకు YSR తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపినట్టా? రుణమాఫీ,ఉచిత కరెంట్,సబ్సిడీ పథకాలు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగ చేసినందుకు కొట్టి చంపినట్టా? ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, లక్షల కొద్దీ సర్కార్ ఉద్యోగాల భర్తీ ఇవన్నీ ప్రజలను కొట్టి చంపినట్లేనా? నిజానికి తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపుతున్నది నీ అయ్య “కసాయి రావే”. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని నీ కుటుంబం కోసం నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసి చంపేసిన మాట నిజం కాదా?

ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను, రుణమాఫీ అని రైతులను చంపుతున్నది నిజం కాదా? ఫీజులు చెల్లించక విద్యార్థులను, పోడుపట్టాలు ఇస్తామని గిరిజన బిడ్డలను కొట్టి చంపుతున్నది నీ అయ్య కసాయిరావే కదా? ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతుంటే.. తెలంగాణను దర్జాగా దోచుకుంటున్న దొంగలు మీరు. ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్లు కాజేసింది మీరు.మీ అక్రమాలకు అడ్డొస్తే, ప్రశ్నిస్తే చావగొట్టేది మీరు. తల్లిలాంటి తెలంగాణను చంపుతున్న అసలు కసాయి గూండాలు మీరే. ఈసారి ఓటు కోసం కాలు బయట పెట్టి చూడు. నీకు, నీ అయ్యకు ఆ రోకలి బండే సమాధానం” అని అన్నారు షర్మిల.

హైటెక్ సిటీలో బోర్డు తిప్పేసిన సాప్ట్‌వేర్ కంపెనీ

హైదరాబద్ మాదాపుర్ హైటెక్ సిటీలో ఓ సాప్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కొండాపుర్ AMB మాల్ ఎదురుగా యునైటెడ్ అలయన్స్ టెక్నాలజీ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. వీరు సాఫ్ట్ వేర్ జాబ్ పేరిట ఎంతో మంది నిరుద్యోగుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేశారు. కంపెనీ యాజమాన్యం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.లక్షన్నర నుండి మూడున్నర లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. 

జాబ్ ఇచ్చిన కంపెనీ.. నెల రోజుల పాటు అన్ లైన్ ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ పూర్తైనా.. నెల రోజులుగా కంపెనీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో బాధితులు కొడాపుర్ కు వచ్చి ఆరా తీశారు. కంపెనీ ముతబడి ఉండటంతో బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. వేంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ధీరజ్ ముత్యాల, అఖిల్, విషశ్రీ అనే ముగ్గురు వ్యక్తులు ఉద్యోగం ఇస్తామంటూ మత నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని బాధితులైనా పవన్, రితీష్, యతీష్ లు పోలీసు ఫిర్యాదులో వెల్లడించారు. తమ బ్యాంకుల నుండి డబ్బులు పంపించినట్లు బ్యాంకు అకౌంట్లతో సహా పోలీసులకు అందించారు. తమ న్యాయం చేయాలని బాధితులు పోలీసులను కోరారు. కేసు నుమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈడీ విచారణకు హాజరుకాని కవిత

ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత.. మార్చి 16వ తేదీన విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం.

షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించటం ద్వారా.. విచారణకు హాజరుకాకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కవితకు మద్దతుగా ఢిల్లీలో ఐదుగురు బీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు. ఎప్పటికప్పుడు లాయర్లతో వారు చర్చలు జరుపుతున్నారు. కవిత పంపిన లేఖపై.. ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. వాస్తవంగా అయితే ప్రస్తుతం ఢిల్లీలో కవిత ఉన్న ఇంటి నుంచి కేవలం ఐదు, 10 నిమిషాల్లోనే ఈడీ ఆఫీసుకు చేరుకోవచ్చు. అయినా కవిత హాజరుకాలేదు. ఈడీ అధికారుల విచారణ తీరును ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో మార్చి 15వ తేదీన ఆమె పిటీషన్ దాఖలు చేశారు. ఆ విచారణను వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

పాలమూరులో డీసీసీబీ బ్యాంకు సిబ్బంది ఓవరాక్షన్

మూడు వాయిదాల రుణం చెల్లించలేదన్న కారణంగా డీసీసీ బ్యాంకు సిబ్బంది రుణదాత అయిన ఓ రైతు ఇంటి తలుపులు ఊడపీకారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం మదనాపురంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ అనే రైతు తన 2.05 ఎకరాల పట్టాదారు పాసు పుస్తకాన్ని గత 2021లో గూడూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో తాకట్టుపెట్టి రూ.4.50 లక్షల రుణం తీసుకున్నాడు.

ఒక్కో వాయిదాకు రూ.62 వేలు చొప్పున మరో నాలుగు నెలలు చెల్లించాల్సివుంది. అయితే, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో రూ.60 వేలు మాత్రమే చెల్లించాడు. మరో మూడు వాయిదాలు చెల్లించాల్సివుంది.

బ్యాంకు అధికారులు మాత్రం మిగిలిన రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించాడు. వాటికి ఆయన స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీన పోలీసులతో కలిసి డీసీసీబీ బ్యాంకు అధికారులు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రైతు మోహన్ కుమారుడు, మాజీ సర్పంచి అయిన ఆయన కోడలు స్వరూప ఉన్నారు. 

రుణం బకాయిలు చెల్లించని కారణంగా ఇంటి తలుపులు తీసుకెళ్తున్నట్టు వారికి చెప్పి ద్వారం నుంచి వాటిని తొలగించి వాహనంలో పడేశారు. ఈ క్రమంలో బ్యాంకు ధికారులకు, ఇంటి సభ్యులకు వాగ్వాదం జరింది.

మిగిలిన సొమ్ము త్వరలోనే చెల్లిస్తామని ప్రాధేయపడటంతో ఊడదీసిన తలుపులు తిరిగి అప్పగించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో డీసీసీబీ అధికారులు స్పందించారు. తాము రైతు కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించలేదని, మందలించి తలుపులు తిరిగి ఇచ్చేశామని తెలిపారు.

TS : లిక్కర్ స్కామ్ కేసులో రెండో సారి ఈడీ విచారణకు MLC కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు రెండోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.

ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు కవితకు మద్ధతుగా రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి నేతలు ఢిల్లీకి భారీగా చేరుకున్నారు.

ఇప్పటికే న్యాయ నిపుణులతో మంత్రులు కేటీఆర్, హరీష్ చర్చలు జరిపారు.  

 ఆందోళన చేసే ఛాన్స్ ఉండటంతో.. ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్ నివాసం, ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే, ఈడీ విచారణకు కన్‌ఫ్రంటేషన్‌ విధానంలో బుచ్చిబాబు, పిళ్లై, సోసిడియాతో కలిపి కవితను విచారించే అవకాశం కనిపిస్తోంది.

గొంతు నొప్పి... కారణాలు - నివారణ మార్గాలు

మీ గొంతులో గడ్డ ఉన్నట్లుగా అనిపిస్తుందా? ఆహారం మింగడం కష్టంగా ఉందా? గొంతులో నొప్పి, కరుకుదనం, పొడిబారినట్లుగా ఉంటోందా? అయితే, మీరు బహుశా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. శ్లేష్మ పొర సాధారణ వాపు ప్రాథమికంగా గొంతు నొప్పికి కారణం. అలాంటి సమయంలో భయపడాల్సిన పని లేదు. కొన్ని ఇంటి నివారణలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి.

గొంతు నొప్పికి కారణాలు...

1. చాలా పొడి వాతావరణం.

2. వాయు కాలుష్యం – పొగ, దుమ్ము.

3. అలెర్జీ, ఆస్తమా.

4. వైరల్ జ్వరం, సాధారణ జలుబు.

5. శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు.

6. ఉబ్బిన గ్రంధులు.

ఇలా పుక్కిలించండి..

ఉప్పునీరు: అర టీస్పూన్ రాళ్ల ఉప్పును గోరువెచ్చని నీటిలో కరిగించి పుక్కిలించాలి. ఇది మీ గొంతులో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శ్లేష్మం వెళ్లడానికి సహాయపడుతుంది.

హెన్నా ఆకులు: 

హెన్నా ఆకులతో డికాక్షన్ చేసి పుక్కిలించొచ్చు.

యాలకుల పొడి: 

నీళ్లలో యాలకుల పొడిని కరిగించి, వడకట్టి పుక్కిలించాలి.

మెంతి గింజలు:

 నీటిలో మరిగించి, వడకట్టి పుక్కిలించాలి.

పసుపు నీరు: 

పసుపు ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్. ½ టీస్పూన్ పసుపు పొడిని ½ టీస్పూన్ ఉప్పును వేడి నీటిలో కలపాలి. ప్రతి 2 గంటలకు గార్గిల్ చేయండి.

తులసి నీరు: 

తులసి ఆకులతో నీటిని మరిగించాలి. వడకట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని త్రాగవచ్చు. లేదా పుక్కిలించవచ్చు.

నిమ్మ / అల్లం నీరు త్రాగాలి:

గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు తేనె సహాయపడుతుంది.

వెచ్చని డ్రింక్స్ మాత్రమే త్రాగాలి..

1. వెచ్చని ద్రవాలు మీ గొంతును తేమ, పొడి గొంతు, నిర్జలీకరణం మొదలైన సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. వేడి డ్రింక్స్ తీసుకోవచ్చు.

2. అల్లం, తేనె టీ అనేది గొంతు మంటను తగ్గించడానికి ఒక ప్రసిద్ధమైన డ్రింక్.

3. రెడ్ హైబిస్కస్ టీ మీ గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రెడ్ హైబిస్కస్ టీలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.

4. గొంతు తేమగా ఉండాలంటే ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీటిని తాగాలి.

5. తమలపాకులు నమలాలి. తమలపాకులు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించే పురాతన, సాంప్రదాయ ఔషధం. తమలపాకులు, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించవచ్చు. వడకట్టి ఆ నీటిని తాగాలి. రుచి కోసం తేనె లేదా ఉప్పును యాడ్ చేసుకోవచ్చు.

6. లవంగాలను నమలాలి. నోట్లో పగుళ్లు, పుళ్లు అయితే లవంగాలను నోట్లు వేసుకుని ఉంచుకోవాలి. తద్వారా ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

పేపర్ లీకేజీపై మంత్రులు ఎందుకు మాట్లాడరు?: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కవితకు లిక్కర్ స్కాంపై ఈడీ నోటీసులు ఇస్తే.. మంత్రులంతా మాట్లాడిండ్రు.. మరి పేపర్ లీకేజీపై ఎందుకు మాట్లాడ్డం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) ప్రశ్నించారు. 

పేపర్ లీకేజీపై కేసీఆర్ మాట్లాడాలని చెప్పారు. ఈ కేసును సిట్ తో కాకుండా..సీబీఐతో(CBI) విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులు అంగట్లో అమ్మే సరుకులాగా మారాయన్నారు. రాష్ట్రమంతా యువత ఆందోళన చేస్తుంటే.. తెలంగాణ మంత్రులు, సీఎం స్పందించరా అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ప్రతి దాంట్లో ఇన్వాల్ అయ్యే కేటీఆర్, ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ ఎక్కడున్నారని నిలదీశారు.. లీకేజీపై ఎందుకు మాట్లాడాలన్నారు. పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోరా అని అడిగారు.

 తెలంగాణ వాడు కానీ ప్రవీణ్ tspsc లోకి ఎట్లా వచ్చిండు..ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ను సెక్రెటరీ పీఏగా ఎట్లా పెట్టుకుందని ప్రశ్నించారు. TSPSC చైర్మన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. 

పోయిన ఏడాది 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు.. కానీ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా భర్తీ చేయలేదని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. 

టీచర్ ఉద్యోగాల భర్తీ ఇప్పటివరకూ మొదలుపెట్టలే.. దానికోసం పెట్టిన టెట్ పరీక్ష జరిగి 6 నెలలు అవుతుందని గుర్తు చేశారు. రాబోయే విద్య సంవత్సరంలో కూడా అరకొర టీచర్లతోనే నెట్టుకొచ్చే అవకాశం ఉంది.. 

ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది అంటూ జీవన్ రెడ్డి మండపడ్డారు. అప్పుసప్పు చేసి కోచింగ్ సెంటర్లకు పోయి సదువుకుంటే ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత మానసిక ఆందోళనలో ఉందన్నారు. యువతకు విశ్వాసం రావాలంటే కేంద్ర విచారణ రంగంలోకి దిగాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ జరిగి 48 గంటలు ఐనా ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడలేదని విమర్శించారు జీవన్ రెడ్డి.