/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz కేసీఆర్ కొండగట్టు టూర్… 9 మంది ముందస్తు అరెస్ట్ TS breaking
కేసీఆర్ కొండగట్టు టూర్… 9 మంది ముందస్తు అరెస్ట్

సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు పర్యటన నేపథ్యంలో గంగాధర మండలం రేలపల్లికి చెందిన 9 మందిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో చర్లపల్లి బలవంతపూర్ మీదుగా తమ గ్రామానికి రోడ్డు వేయిస్తామని స్థానిక ఎమ్మెల్యే మాట ఇచ్చి తప్పడంతో సీఎం ముందు తమ నిరసన తెలిపేందుకు గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 

సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టుకు వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​ ద్వారా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ క్యాంపస్​కు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన తర్వాత జిల్లా ఉన్నతాధికారులతో కేసీఆర్​ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి నుంచే ఒంటిపూట బడులు !

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి. సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు, వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.

మార్చి రెండోవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షల నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 21 ఫలితాలు వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Health : పిల్లల ఎముకలలో బలహీనత... ఆహారంలో డైట్ లో మార్పులు తప్పనిసరి...

మానవ శరీరంలో ఎముకల గూడు. ఎముకలు లేకుంటే.. శరీరానికి ఓ ఆకారం అంటూ ఉండదు. అంతే కాకుండా అవయవాలన్నీ బ్యాలెన్సింగ్ గా ఉండటానికి ఎముకలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే.. ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, బలహీనత వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు పెడుతుంటాయి. కాబట్టి వారి ఎముకలు బలంగా మారేందుకు అవసరమైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ఎముక ఏర్పడటానికి అత్యంత కీలకమైన సమయం చిన్నతనంలోనే కాబట్టి.. ఆ సమయంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఎముకల ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

బాల్యంలో బలమైన ఎముక అభివృద్ధి.. మంచి ఎముక ఆరోగ్యానికి పునాదిగా పని చేస్తుంది. ఎముకల అభివృద్ధికి బాల్యం అత్యంత ముఖ్యమైన కాలం. మంచి పోషకాహారం, వ్యాయామం అనేది పిల్లల ఆరోగ్యం పెంపొందించడంలో కీలక విషయాలు. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇది శరీరం కాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో దానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఎండలో ఉండటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు. వారానికి రెండు మూడు రోజులు కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు నేరుగా సూర్యరశ్మిని పొందేలా చేయాలి.

కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకల అభివృద్ధికి కాల్షియం అవసరమని అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బలమైన ఎముకలకు మద్దతు ఇవ్వడానికి మెగ్నీషియం కాల్షియంతో సహకరిస్తుంది. కాల్సిటోనిన్ అనే హార్మోన్‌కు మద్దతు ఇవ్వడానికి ఇది చాలా అవసరం. ఇది ఎముకల నిర్మాణాన్ని సంరక్షించడానికి, మృదు కణజాలం రక్తం నుంచి ఎముకలకు కాల్షియంను పునరుద్ధరిస్తుంది. కాబట్టి పిల్లల ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే గోధుమలు, క్వినోవా, బాదం, వేరుశెనగ, పచ్చి ఆకు కూరలు, నల్ల చిక్కుళ్లు వంటివి చేర్చుకోవాలి.

అన్ని పార్టీలు పాలమూరుపైనే ఫోకస్​

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు పాలమూరుపై ఫోకస్​ పెట్టాయి. ఉమ్మడి జిల్లాలో14 నియోజకవర్గాలుండడంతో పార్టీల పెద్దలు.. ఇప్పటికే పాలమూరులో పర్యటించి క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశాలు ఇవ్వడంతో నేతలు, కార్యకర్తలు పల్లె, వార్డుబాట పట్టారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పేరిట బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు, ప్రజాసమస్యల పేరిట ప్రతిపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్తున్నారు. 

అభివృద్ధి మంత్రం

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4న పాలమూరులో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పలు హామీలు కూడా ఇచ్చారు. కొద్ది రోజులకే ఆర్థిక మంత్రి టి.హరీశ్​రావు పాలమూరులో, మంత్రి కేటీఆర్​నారాయణపేట జిల్లాలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక మంత్రులు వి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్, నిరంజన్​రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, లక్ష్మారెడ్డి, బాలరాజు, అబ్రహం, జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, జైపాల్, అబ్రహం, రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, హర్షవర్దన్ రెడ్డి, మహేశ్ రెడ్డి సీఎం రిలీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు పేరిట నిత్యం గ్రామాల్లో తిరుగుతున్నారు. సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. లేదా ప్రభుత్వ పెద్దల దృష్టికి 

తీసుకెళ్తున్నారు.  

బీజేపీ రాష్ర్టస్థాయి కార్యవర్గ సమావేశాలు

పాలమూరుపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టిన బీజేపీ పెద్దలు.. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలను ఇక్కడే నిర్వహించారు. చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెస్టుగా హాజరైన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి తరుణ్​చుగ్​నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకోవడానికి తీసుకోవాల్సిన అంశాలపై స్థానిక నేతలతో చర్చించారు. ప్రజా సంగ్రామ యాత్ర-–2 ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు దగ్గరైన పార్టీ స్టేట్ చీఫ్​బండి సంజయ్.. కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎల్లేని సుధాకర్​రావు నిర్వహించిన పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అత్యధికంగా సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. దీనిపై పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్​రెడ్డితో చర్చించి రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిసింది. వీరి డైరెక్షన్​లో డోకూర్​ పవన్​కుమార్​రెడ్డి, ఎన్పీ వెంకటేశ్​, బాలా త్రిపుర సుందరి, సత్య యాదవ్​, దేవరకద్ర బాలన్న, ఎగ్గని నర్సింహులు, ఎల్లేని సుధాకర్​రావు, జలంధర్​రెడ్డి, రతంగ్​ పాండురెడ్డి, పాలమూరు సీడ్స్​ సుదర్శన్​రెడ్డి, అయ్యంగారి ప్రభాకర్​రెడ్డి, అశ్వాత్థామారెడ్డి, టి.ఆచారి, అందే బాబయ్య, మిథున్​రెడ్డి, దిలీపాచారి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. శక్తి కేంద్రాలు, పదాధికారుల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీలతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. 

ఉద్యమాల బాటలో కాంగ్రెస్​ క్యాడర్

2014 ఎన్నికల వరకు ఉమ్మడి జిల్లాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఉనికి కోల్పోయే స్థితికి చేరింది.  అయితే ప్రస్తుతం ఆ పార్టీ స్టేట్​చీఫ్​ ఎనుముల రేవంత్​రెడ్డి పాలమూరువాసి కావడంతో.. పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బిజినేపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ‘హాత్​ సే హాత్​ జోడో యాత్ర’లో భాగంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీలు సంపత్​కుమార్​, వంశీచంద్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్లు జి.మధుసూదన్​రెడ్డి, వంశీకృష్ణ, పటేల్ ప్రభాకర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, టీపీసీసీ సెక్రటరీ జనంపల్లి అనిరుధ్​రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ కె.వీరారెడి కొడుకు కె.ప్రశాంత్​రెడ్డి, కొల్లాపూర్ నేతలు రంగినేని అభిలాష్​రావు, జగదీశ్వర్​రావు నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి తెరపైకి ఎమ్మెల్సీ కవిత పేరు

ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది. మాగుంట రాఘవ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును వెల్లడించిన ఈడి.. మద్యం విధానం రూపకల్పనలో కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది.

ముందు గానే అమ్ అద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని… ఈ ముడుపులను తిరిగి రాబట్టుకునేందుకు ఇండో స్పిరి ట్స్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారని తెలిపారు ఈడీ అధికారులు.

సౌత్ గ్రూపుకు ఇందులో 65% వాటా ఉందని…ఈ సౌత్ గ్రూపులో కవితతో పాటు శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ ఉన్నారన్నారు. ఇండోస్పిరిట్ లో కవిత తర పున అరుణ్ పిళ్ళై ప్రతినిధిగా వ్యవహరించారు…హోల్సేల్ డీలర్లకు 12 శాతం కమిషన్ , రిటైల్ వ్యాపారులకు 185 శాతం కమిషన్ వచ్చేలా మద్యం పాలసీ రూపొందించారని తెలిపారు ఈడీ అధికారులు. ఈ కమిషన్ను మళ్లించేందుకు ఇండస్పిరిట్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు..కార్టలైజేషన్ ద్వారా అనుచిత లబ్ధి పొందారన్నారు.

కాళేశ్వరంపై ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతం... - మంత్రి హరీష్ రావు

దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని చెప్పారు. శాసనమండలిలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్.. కాళేశ్వరంపై ప్రతిపక్షాలు పదే పదే బురదజల్లె ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం మహా అద్భుతమని ప్రపంచ ఇంజనీర్లు మెచ్చుకుంటుంటే, ఈ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులను సాకుగా చూపిస్తూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ద్వారా వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతోందని చెప్పారు. 

మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశమంతా తెలిసేలా చేశారని హరీష్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలలో నీటి కోసం యుద్ధాలు జరిగేవని.. కాని ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండు వేసవిలో కూడా చెరువులు జలకళతో దర్శనమిస్తున్నాయని ఆయన వెల్లడించారు. దేశంలో 49% మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోందని.. ఇంకా 51% మందికి తాగునీరు దొరకడం లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

సికింద్రాబాద్ రైల్‌ నిలయం వద్ద అగ్నిప్రమాదం..

సికింద్రాబాద్ రైలు నిలయంలోని పాత క్వార్టర్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.