NLG: మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, చౌరస్తా లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సంతాపం తెలిపారు.
ఈ మేరకు వారు మాట్లాడుతూ.. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో వున్నప్పుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడి గా మన్మోహన్ సింగ్ తన మేధస్సును ప్రదర్శించారని కొనియాడారు.
పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ ఆనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాం లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు.మిత భాషిగా, అత్యంత సౌమ్యుడు గా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థితప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవి అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వారందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటని శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమం లో మర్రిగూడ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, మాజీ మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్, మాజీ సర్పంచులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, నున్సవత్ బిచ్చు నాయక్, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ మాధగోని శ్రీనివాస్, ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ సిర్పంగి శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బేత వెంకటేష్, పిఎసిఎస్ డైరెక్టర్ పగడాల లింగయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కురంపల్లి జంగయ్య, పొనుగోంటి శేఖర్, రాజునాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల యాదయ్య, వెన్నమనేని పాపారావు, కొత్త లొంకయ్య, కుమ్మరి లచ్చయ్య, లపంగి వెంకటయ్య, ఐతగోని ఉపేందర్, వడ్డే సైదులు, గ్యార వెంకటేష్, సిలువేరు యాదయ్య, గొట్టిముక్కల ప్రకాష్, పగిల్ల నీలయ్య, గ్యార యాదయ్య, తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు.

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామంలో శుక్రవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వారు తెలిపారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
HYD:
నల్లగొండ జిల్లా:
యాదాద్రి జిల్లా:
నల్లగొండ జిల్లా, చండూరు మండలం:
మెదక్ జిల్లా:
ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప చర్చ్ గా గుర్తింపు పొందిందని అన్నారు.
Aug 22 2025, 18:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.1k