Rtv Folk Songs యూట్యూబ్ ఛానల్ రవికి అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆర్థిక సహాయం
Rtv folk Songs యూట్యూబ్ ఛానల్ రవి తీవ్ర అనారోగ్యంతో గత రెండు నెలలుగా అపెండిక్స్ కడుపునొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్న ఐదు రోజుల్లో తండ్రి అకాల మరణం, దానికి తోడు కడుపులో ఇన్ఫెక్షన్ తో నల్లగొండ పట్టణంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారు అక్కడికి చేరుకొని పండ్లు, నగదు ఆర్థిక సహాయం అందజేశారు.
రవి కుటుంబ సభ్యులు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ రవి ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని, స్వచ్ఛంద కార్యక్రమాలను తన వీడియో ద్వారా కవరేజ్ చేశారన్నారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమందికి తను నటించిన ఫోక్ సాంగ్స్ ని అందించారని గుర్తు చేశారు.
రవితో పాటు పనిచేసిన ఎంతోమంది కళాకారులు, మీడియా మిత్రులు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి హాస్పిటల్ బిల్లులకు సహకరించగలరని అమ్మ స్వచ్చంద సేవా సంస్థ వారు కోరుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి మిత్రునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రవికి ఇంకా ఆరోగ్యం మెరుగుపడనందు వల్ల ఆస్పత్రిలోనే చికిత్స పొందాలి కాబట్టి ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్న వారు 8340988212 నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే చేయగలరని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సురకారపు యాదగిరి గౌడ్, కంచర్ల రఘురాం రెడ్డి, పాలకూరి నర్సింహా గౌడ్, దోనాల లింగారెడ్డి, కట్టెబోయిన సంజీవ యాదవ్, అయితరాజు ప్రసాద్, తుపాకుల ప్రవీణ్, తుమ్మలపల్లి మహేష్ మరియు చాకలి ఐలమ్మ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ ఐతరాజు లక్ష్మణ్, రజక సంఘం నాయకులు యలిజాల శంకర్, నడిగోటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Jan 17 2025, 20:02