కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపిన హమాలి కార్మికులు...4వ రోజు కొనసాగిన హమాలి కార్మికుల నిరవధిక సమ్మె
సివిల్ సప్లయి హమాలీ కార్మికులకు పెంచిన కూలీ రెట్ల జి. ఓ ను తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ అన్నారు. శనివారం రోజున సివిల్ సప్లయి హమాలీస్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో పెంచిన కూలి రేట్ల జి.ఓ ను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజు యధావిధిగా కొనసాగింది. ఈ సందర్బంగా 4వ రోజు భువనగిరి ఎం. ఎల్. ఎస్ గోడౌన్ వద్ద *సివిల్ సప్లై కమిషనర్ తీరుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని హమాలీ కార్మికులు నిరసన తెలుపడం జరిగింది.* ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ తేదీ 4 10 2024 నాడు సివిల్ సప్లయి కమిషనర్ మరియు ఏఐటీయూసీ నాయకుల సమీక్షంలో జరిగిన చర్చలకు సంబంధించిన జీవో కాపీ విడుదల చేయడంలో కమిషనర్ పూర్తిగా విఫలం అయ్యారని అయన ఆరోపించారు. 4 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్న కమిషనర్ గారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పెంచిన కూలి రేట్ల జీవోను విడుదల చేయమంటే సమ్మెను అణిచివేయడానికి అనేక రకాలుగా అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జి. ఓ విడుదల చేసే వరకు సమ్మె ఎదవిదిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, సివిల్ సప్లయి హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, భువనగిరి పాయింట్ అధ్యక్షులు గౌరవంతుల శ్రీనివాస్, నాయకులు ముదిగొండ బస్వయ్య, పిన్నం జగన్, ముడుగుల స్వామి, మామిండ్ల సత్యనారాయణ, బొజ్జ గణేష్, మైసయ్య, శ్రీనివాస్, కరుణాకర్, పాండు, కృష్ణ, రాజు, మల్లేష్, నరేష్, నరసింహ, స్వామి, మల్లేష్, చంద్రయ్య, వంశీ, స్వీపర్లు శాంతమ్మ, అంజమ్మ, శారద, శోభ తదితరులు పాల్గొన్నారు.
Jan 11 2025, 22:06