TG: గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా దీపారెడ్డి
HYD: తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా గాయం దీపారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు ఉత్తర్వులు వెలువరించారు.
ఈ సందర్భంగా దీపా రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో నెలకొన్న మహిళల సమస్యల పరిష్కార దిశగా తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. ఈ పదవి బాధ్యతలు కట్టబెట్టిన కేంద్ర సంఘానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన దీపారెడ్డి రాష్ట్ర భూగర్భజల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

HYD: తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గా గాయం దీపారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ రావు ఉత్తర్వులు వెలువరించారు.

నల్లగొండ జిల్లా:
HYD: తెలంగాణలో మహిళా కమిషన్ తీరుతెన్నులు గురించి మలేషియా పారిశ్రామిక వేత్తల బృందం మహిళా కమిషన్ ఛైర్మెన్ నేరెళ్ల శారద తో భేటీ అయ్యింది. మంగళవారం బుద్ధ భవన్లో కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ విజయ్ హాజరయ్యారు.
ఈ మేరకు రాష్ట్రంలో మహిళ కమిషన్ ఏర్పాటు, పనితీరు గురించి మలేషియా ప్రతినిధుల అడిగి తెలుసుకున్నారు. మహిళల హక్కులను పరిరక్షించడం కోసం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఛైర్మెన్ శారద వారికి వివరించారు. సమాజంలో మహిళల పట్ల వివక్షతను తొలగించి, జెండర్ సెన్సిటైజేషన్ వంటి కార్యక్రమాలు ద్వారా మహిళా సాధికారత కోసం కృషి చేయడం జరుగుతుందని ఛైర్మెన్ శారద వారికి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా: ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ, అమిత్ షా ను తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ, మంగళవారం ఉదయం కొంగరకలాన్ డా.బి.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్ రెడ్డి, కె. గురునాధ్ రెడ్డి, యువ నాయకుడు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్లు, బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: మైనర్లు బైక్ లు, కార్లు నడపడం తగదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం ఒవైసీ తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు బండ్లగూడ సౌత్ జోన్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
నల్గొండ: వివిధ అనారోగ్య సమస్య లతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 39 మంది నిరుపేద ప్రజలకు, ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన రూ.13,96,000 విలువ గల చెక్ లను, మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు.
నల్లగొండ: ఈ రోజు మధ్యాహ్నం.. 'డయల్ యువర్ డిపో మేనేజర్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం ఉంటుందన్నారు.
నల్లగొండ జిల్లా:
Dec 25 2024, 14:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.0k