సికింద్రాబాద్-ముజాఫర్‌పూర్ మధ్య వీక్లీ స్పెషల్స్ రైలు
సికింద్రాబాద్-ముజాఫర్‌పూర్(Secunderabad-Muzaffarpur) మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు(కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
సికింద్రాబాద్-ముజాఫర్‌పూర్(Secunderabad-Muzaffarpur) మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు(కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ముజాఫర్‌పూర్ నుంచి సికింద్రాబాద్(Muzaffarpur to Secunderabad)కు జనవరి 7 నుంచి ప్రతీ బుధవారం, సికింద్రాబాద్ నుంచి ముజాఫర్‌పూర్‌కు ఈనెల 9 నుంచి ప్రతీ శుక్రవారం రైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 మధ్య మాత్రమే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉండవని వెల్లడించారు. కాగా మార్గమధ్యలో ఖాజీపేట్ పెద్దపల్లి రామగుండం బెల్లంపల్లి కాగజ్‌నగర్(Khajipet, Peddapalli, Ramagundam, Bellampalli, Kagaznagar) బలార్ష నాగ్‌పూర్ ఇటార్సి నర్సింగపూర్ జబల్‌పూర్ ఉపాధ్యాయ ధనపూర్ తదితర స్టేషన్లలో ప్రత్యేక రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు సీపీఆర్‌వో పేర్కొన్నారు.
Dec 25 2024, 13:16