RR: అమిత్ షా ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం
రంగారెడ్డి జిల్లా: ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పై.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ, అమిత్ షా ను తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ, మంగళవారం ఉదయం కొంగరకలాన్ డా.బి.అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర రోడ్డు డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్ రెడ్డి, కె. గురునాధ్ రెడ్డి, యువ నాయకుడు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్లు, బ్లాక్, మండల, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ జడ్పీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Dec 24 2024, 19:55