NLG: పే రోల్, ఐడి ఇచ్చి కనీస వేతనం అమలు చేయాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ
నల్లగొండ: కేజీబీవీ మోడల్ స్కూల్ అటాచ్డ్ గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏఎన్ఎం, కుక్కింగ్ వర్కర్స్ కు పే రోల్, ఐడి ఇచ్చి రూ. 26 వేల కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు.
ఈ మేరకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యాశాఖ సమగ్ర శిక్ష లో భాగంగా కేజీబీవి మోడల్స్ స్కూల్ హాస్టల్లో వర్కర్స్ 2015 నుండి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని వీరికి కనీస వేతనం రూ 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వీరికి కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.24 గంటలు డ్యూటీ చేస్తున్నారని ఇది ఆపాలని కోరారు. పే రోల్ లేదనే నెపంతో వీరికి కనీస వేతనాలు ఇవ్వకుండా స్కూల్ కు వచ్చే బడ్జెట్ తోనే, తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 192 గర్ల్స్ హాస్టల్ లో సుమారు1200 మంది 24 గంటలు పనిచేస్తున్నారని వీరికి పే రోల్ ఐడి ఇచ్చి 26 వేల కనీస వేతనం ఇవ్వాలని, వీరందరినీ విద్యా శాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని,ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆరోగ్య ,జీవిత బీమా 10 లక్షలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోలే సత్యనారాయణ, యూనియన్ నాయకులు జ్యోత్స్న, మీనాక్షి, జానకమ్మ,పార్వతమ్మ, భాగ్యమ్మ, జయలక్ష్మి, మాధవి, కావ్య తదితరులు పాల్గొన్నారు.
Dec 24 2024, 17:24