NLG: ధర్మ సమాజ్ పార్టీ దీక్ష కు మద్దతు తెలిపిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం
నల్లగొండ: మూడవరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా, ఆదివారం డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి తలారి రాంబాబు జిల్లా అధ్యక్షులు వట్టెపాక శ్రీనివాస్ దళిత శక్తి పార్టీ నాయకులకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కలిసి సంఘీభావం, మద్దతు తెలిపారు.
ఈ మేరకు శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90% బహుజనులు ఉంటే, వారికి న్యాయమైన విధంగా ఫలాలు అందడం లేదని, ఉచిత విద్యా,వైద్యం, ఉపాధి కొరకు 25% బడ్జెట్ కేటాయించి, అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలపడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, కార్యదర్శి ఎం.డి మసి, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుమంత్, ప్రవీణ్, నరేందర్, సుజిత్,తదితరులు పాల్గొన్నారు.
Dec 23 2024, 21:04