బీజేపీ ఎంపీని నెట్టేసినందుకు రాహుల్ గాంధీ జైలుకు వెళ్తారా
రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినప్పుడు సారంగి తనను నెట్టారని ఆరోపించారు. అయితే పార్లమెంటు ఆవరణలో ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు విషయానికి వస్తే రూల్ ఏం చెబుతోంది
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీలను తనపై నెట్టడం వల్లే తాను మెట్లపై పడిపోయానని.. తనకు గాయలయ్యాయని బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి ఆరోపించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లోకి వెళ్లే క్రమంలో తనను నెట్టారని సారంగి ఆరోపించారు. అయితే పార్లమెంటు ఆవరణలో ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు విషయానికి వస్తే రూల్ ఏం చెబుతున్నాయి
పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల తోపులాట మధ్య బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగీ కిందపడటం, ఆయనకు గాయలవడంతో రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే నిబంధనల ప్రకారం ఈ కేసులో వీడియో సాక్ష్యం లేకపోతే సారంగి మాటలు రాహుల్ గాంధీ చెబుతున్నదానికి వ్యతిరేకంగా మాత్రమే అవుతుందంటున్నారు. అందుకే ఈ కేసులో పక్కా ఆధారాలు ఉండాలి. ఈవిషయంపై లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి పిడిటి ఆచార్య మాట్లాడుతూ ఇక్కడ అత్యంత ముఖ్యమైన వీడియో సాక్ష్యం ఉండాలని లేకపోతే ఒక ఎంపీ ఆరోపణలతో మరో ఎంపీ కౌంటర్ ఇవ్వడమే అవుతుంది తప్ప నేరం నిరూపించలేమన్నారు.
Dec 23 2024, 14:40