TG: జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-2024 లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా,యాదగిరిగుట్ట:
మహాత్మాగాంధీ 'పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు' అన్నారు. కానీ, కార్పొరేట్ కంపెనీల ఆగమనం వల్ల ఈ దేశంలో ఇప్పటికే 'సగం పల్లెటూళ్లు.. పల్లెదనం కోల్పోయి వట్టి ఊర్లు గా మిగిలాయని, ఇలాంటి సందర్భంలో కొంతమంది రైతులు, రసాయనిక ఎరువులు లేకుండా పంటలు పండించడం అభినందినీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆదివారం యాదగిరిగుట్టలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారు ఏర్పాటు చేసిన 'జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-2024' లో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా 10 రాష్ట్రాల్లో ఎరువులు, మందులు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసే 115 ఉత్తమ రైతుల జంటలకు పుడమి పుత్ర అవార్డు ప్రదానం చేయడం జరిగింది.
ఈ మేరకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసే 35 మంది అధికారులకు, శాస్త్రవేత్తలకు, జర్నలిస్టులకు కిసాన్ సేవా రత్న అవార్డులు ఇవ్వడం చాలా సంతోషం అని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, పలువురు నాయకులు, గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి కార్యక్రమ కన్వీనర్ పడమటి పావని, రాష్ట్ర క్రీడా విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోడి శ్రీనివాస్, గోపాల్, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు నాయకులు, అవార్డు గ్రహీతలు, తదితరులు పాల్గొన్నారు.
6 hours ago