TG: జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-2024 లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లా,యాదగిరిగుట్ట:
మహాత్మాగాంధీ 'పల్లెలే ఈ దేశానికి పట్టుకొమ్మలు' అన్నారు. కానీ, కార్పొరేట్ కంపెనీల ఆగమనం వల్ల ఈ దేశంలో ఇప్పటికే 'సగం పల్లెటూళ్లు.. పల్లెదనం కోల్పోయి వట్టి ఊర్లు గా మిగిలాయని, ఇలాంటి సందర్భంలో కొంతమంది రైతులు, రసాయనిక ఎరువులు లేకుండా పంటలు పండించడం అభినందినీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆదివారం యాదగిరిగుట్టలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారు ఏర్పాటు చేసిన 'జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-2024' లో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా 10 రాష్ట్రాల్లో ఎరువులు, మందులు లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసే 115 ఉత్తమ రైతుల జంటలకు పుడమి పుత్ర అవార్డు ప్రదానం చేయడం జరిగింది.
ఈ మేరకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేసే 35 మంది అధికారులకు, శాస్త్రవేత్తలకు, జర్నలిస్టులకు కిసాన్ సేవా రత్న అవార్డులు ఇవ్వడం చాలా సంతోషం అని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, పలువురు నాయకులు, గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి కార్యక్రమ కన్వీనర్ పడమటి పావని, రాష్ట్ర క్రీడా విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోడి శ్రీనివాస్, గోపాల్, ఇతర కార్యవర్గ సభ్యులు, పలువురు నాయకులు, అవార్డు గ్రహీతలు, తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా,యాదగిరిగుట్ట:

నల్లగొండ:
యాదగిరిగుట్ట: రెడ్డి సంక్షేమ భవన్ లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో, ఆదివారం సేంద్రీయ రైతులకు పుడమి పుత్ర అవార్డులు, కిసాన్ సేవా రత్న అవార్డులను బహుకరించారు.
HYD: రైతులకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదని, వ్యవసాయం చేసుకునే ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు.
నల్లగొండ: సీఎం కప్ లో భాగంగా ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలను, శనివారం టిపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ మేరకు వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల అభ్యున్నతి కొరకే రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు.ప్రతి పాఠశాలకు క్రీడా పరికరాలకు,క్రీడా బడ్జెట్ విడుదలకు కృషి చేస్తామన్నారు.
హౌసింగ్ శాఖ పిడి రాజకుమార్, DYSO నర్సిరెడ్డి, SGF కార్యదర్శి దగ్గుపాటి విమల, హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మ పాల గిరిబాబు, హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పుల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు మెర్సీ ప్రభావతి, రవీందర్, శ్రీనివాస్, కవిత,బాలు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: గణితం తో లాజికల్ థింకింగ్ అభివృద్ధి చెందుతుందని ఎం.జి యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగాధిపతి డా. పసుపుల మద్దిలేటి అన్నారు. శనివారం ఎన్జీ కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, గణితశాస్త్ర మేధావి రామానుజన్ జన్మదినం సందర్బంగా జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మద్దిలేటి మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు గణితశాస్త్రం యెడల మక్కువను పెంచుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు.
నల్లగొండ: నిరుపేదలకు భూమి,ఇండ్లు, విద్యా, వైద్యం, ఉపాధి కొరకు నల్గొండలో ఆమరణ నిరహార దీక్షకు దిగిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తలారి రాంబాబు, శ్రీను లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. శనివారం పట్టణంలోని పూలే విగ్రహం ముందు జరుగుతున్న 2వ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ.. పాలకులు మారిన ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. విద్యా, వైద్యం కార్పొరేట్ పెద్దల చేతుల్లోకి పోవడం వలన విద్య అందని ద్రాక్షలా మారిపోయిందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు పేదలను దోచుకుంటున్నాయని, ప్రభుత్వ దవఖానాలలో మందులు, వసతుల కొరత తీవ్రంగా ఉందని, బడ్జెట్ కేటాయించి మెరుగయిన వైద్యం అందించాలని అన్నారు.
నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, శుక్రవారం పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా గెలిచిన జట్టుకు శుక్రవారం, కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ట్రోపీ ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
Dec 22 2024, 20:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
27.1k