న్యాయ విద్యార్థుల రాష్ట్ర 2వ సదస్సును జయప్రదం చేయాలి: ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి
![]()
న్యాయ విద్యార్థులు పౌర సమాజం- రాజ్యాంగం -అనే అంశంపై ఈనెల 21న సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగే న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు)రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు చదువుతోపాటు వృత్తిలోని, సమాజంలోని ,రాజ్యాంగంలోని, మెలకువలు నేర్చుకోవాలని న్యాయవిద్యతో పాటు సమాజం పట్ల అవగాహన పెంపొందించుకొని వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని ఆయన కోరారు నేడున్న పరిస్థితుల్లో రాజ్యాంగానికి ఎదురైన సవాళ్లు వాటి పట్ల న్యాయ విద్యార్థులు అడ్వకేట్స్ వహించాల్సిన పాత్ర గురించి చర్చించడం జరుగుతుందని న్యాయ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ ఈ సదస్సుకు ఐలు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఐలు ఆల్ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ విశ్రాంత ప్రొఫెసర్ జి మోహన్ గోపాల్, తదితరులు పాల్గొని విషయాలపై చర్చించడం జరుగుతుందని న్యాయ విద్యార్థులు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో, జిల్లా ఉపాధ్యక్షులు కుక్కదువ సోమయ్య, పాల్వంచ జరుగుతయ్య, తడ్క మోహన్, సహాయ కార్యదర్శి సిస శ్రీనివాస్ ,బోల్లెపెల్లి కుమార్,చింతల రాజశేఖర్ రెడ్డి, బోడ్డు కిషన్ ఎండి నిహాల్ తదితరులు పాల్గొన్నారు.


కేంద్రమంత్రి అమిత్ షా తన యొక్క అసలు నైజాన్ని పార్లమెంట్ వేదిక ద్వారా బహిర్గతం చేసుకున్నాడు. అంబేద్కర్, అంబేద్కర్, అని అనే బదులు దేవుని స్తుతిస్తే ఏడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని అంబేద్కర్ ను కీర్తించవద్దని దేవుని ప్రార్థించాలని ఆయన తన మనసులో ఉన్న విషయాన్ని బహిర్గతం చేయడం జరిగిందని, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్రమంత్రి అమిత్ షాను తక్షణం కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. *ఈ దేశంలో రాజ్యాంగాన్ని రచించి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి, కులమతాల అసమానతలను చీల్చి చెండాడిన బిఆర్ అంబేద్కర్ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎంత కుటిలత్వం ఉన్నదో చెప్పకనే చెప్పినట్టుగా అమిత్ షా వైఖరి ఉన్నది. ఇటువంటి వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం భారత ప్రజల యొక్క దురదృష్టం అని అన్నారు.
Dec 21 2024, 21:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.5k