/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ధర్మ సమాజ్ పార్టీ దీక్ష కు కేవీపీయస్ మద్దతు Mane Praveen
NLG: ధర్మ సమాజ్ పార్టీ దీక్ష కు కేవీపీయస్ మద్దతు
నల్లగొండ: నిరుపేదలకు భూమి,ఇండ్లు, విద్యా, వైద్యం, ఉపాధి కొరకు నల్గొండలో ఆమరణ నిరహార దీక్షకు దిగిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తలారి రాంబాబు, శ్రీను లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. శనివారం పట్టణంలోని పూలే విగ్రహం ముందు జరుగుతున్న 2వ రోజు దీక్షకు మద్దతుగా పాల్గొని మాట్లాడుతూ.. పాలకులు మారిన ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. విద్యా, వైద్యం కార్పొరేట్ పెద్దల చేతుల్లోకి పోవడం వలన విద్య అందని ద్రాక్షలా మారిపోయిందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు పేదలను దోచుకుంటున్నాయని, ప్రభుత్వ దవఖానాలలో మందులు, వసతుల కొరత తీవ్రంగా ఉందని, బడ్జెట్ కేటాయించి మెరుగయిన వైద్యం అందించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో కేవీపీస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్, వెంకటేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, శుక్రవారం పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా  రూ. 2 లక్షల నగదు బహుమతి
నల్లగొండ: కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ  ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా గెలిచిన జట్టుకు శుక్రవారం, కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 2 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ట్రోపీ ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

అదేవిధంగా రన్నర్ గా నిలిచిన జట్టుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరుపున లక్ష రూపాయల నగదు మరియు ట్రోపీ ని అందజేశారు.

పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని వినతి పత్రం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని, స్థానిక తహసిల్దార్  కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఈ మేరకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన  హామీ ప్రకారం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వికలాంగుల వృద్ధాప్య, వితంతు, చేనేత గీత కార్మికుల పెన్షన్లు ఇవ్వాలని అన్నారు.

గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించాలని అన్నారు. భూమిలేని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీ చేయాలని  ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ప్రజా పాలనలో ఏ విధంగానైతే ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారో, అదేవిధంగా పేదలను గుర్తించి, భూమిలేని నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు కొట్టం యాదయ్య, నీలకంఠం రాములు, దామెర లక్ష్మి, రామలింగాచారి, చింతపల్లి యాదయ్య, మాడుగుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో ఇద్దరిపై దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
బ్రేకింగ్: నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ చర్చ్ దగ్గర్లో, ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. మద్యం మత్తులో.. టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిపై  లారీ దూసుకెళ్లింది.

గణేష్ అనే యువకుడు మృతి, ఇంకొక మహిళా సురక్షితం. ప్రమాదానికి గురి అయిన వారు నల్లగొండ వీటి కాలనీ వాసులుగా గుర్తింపు.లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
నారాయణపురం మండలం, సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్  వెంకటేశం సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సర్వేలు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశం పర్యవేక్షణ లోపం ఉండడం వలన  ఆయన పై చర్యలు చేపట్టారు.

బుధవారం 8 వ తరగతి బాలుడిని వంట పనులకు వినియోగించుకున్న క్రమంలో బాలుడి  పై వేడి రాగి జావ కాళ్ల మీద పడి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.

గురువారం విషయం తెలుసుకున్న  ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ధర్నా
NLG: నారాయణపురం మండలం, సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సర్వేల్ గురుకుల పాఠశాల ముందు గురువారం ధర్నా నిర్వహించారు.

కాగా ప్రమాదవశాత్తు బుధవారం సర్వేలు గురుకుల పాఠశాల విద్యార్థి కాళ్ళ మీద రాగి జావ పడి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే.
అందుబాటులోకి ఇందిరమ్మ ఇండ్ల.. ట్రోల్ ఫ్రీ నెంబర్: జిల్లా కలెక్టర్
NLG: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-4251-442కు ఫోన్ చేయాలని, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు, అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సర్వే టీమ్ లను కలెక్టర్ ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ వైద్య సేవలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య అధికారులను ఆదేశించారు.

ఇవాళ పీఏ పల్లి  మండలంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్లు, వ్యాధులు, ప్రసవాలకు సంబంధించిన రిజిస్టర్లు, మందులను పరిశీలించారు. గ్రామీణ వైద్య సేవలు మెరుగుపరచడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.
NLG: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
నల్లగొండ: జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం బిజెపి జాతీయ నాయకుడు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన  అనుచిత వ్యాఖ్యలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. ఈ దేశ సకల ప్రజలకు సర్వ హక్కులను ప్రసాదించిన దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు దానికి బదులుగా దేవున్ని స్మరించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని అని అమిత్ షా మాట్లాడడం చాలా దౌర్భాగ్యకరం. ఈ దేశ ప్రజలు దేవుని చూడలేదు కానీ,  ప్రతి ఒక్కరూ.. అంబేద్కర్ ను రాజ్యాంగ హక్కులు కల్పించిన దేవుడని కొనియాడుతుంటే.. అమిత్ షా మనువాద ముసుగులో అంబేద్కర్ ను అగౌరవపరచడం చాలా దారుణం అన్నారు.

భవిష్యత్తులో ఖచ్చితంగా బహుజన బిడ్డలు, దేశ ప్రజలంతా అమిత్ షా ఓటమికి తగిన గుణపాఠం చెప్తారని, వెంటనే బేషరతుగా అంబేద్కర్ గారి కాళ్లకు పాదాభివందనం చేసి అంబేద్కర్ కు పాలాభిషేకం చేసి, తప్పుని ఒప్పుకోవాలని అన్నారు.లేని ఎడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు ధర్నాలకు పాల్పడతామని, అమిత్ షా ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర నాయకులు హ్యూమన్ రైట్స్ నాయకులు మహమ్మద్ అలీ, జిల్లా కార్యవర్గ సభ్యులు గంట సుమంత్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, నరేష్, శ్రీకాంత్, నవీన్, సుధీర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.