పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని వినతి పత్రం
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పెండింగ్లో ఉన్న రైతు భరోసా, రుణమాఫీ రైతు ఖాతాలో జమ చేయాలని, స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు, తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ మేరకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వికలాంగుల వృద్ధాప్య, వితంతు, చేనేత గీత కార్మికుల పెన్షన్లు ఇవ్వాలని అన్నారు.
గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించాలని అన్నారు. భూమిలేని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ప్రజా పాలనలో ఏ విధంగానైతే ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారో, అదేవిధంగా పేదలను గుర్తించి, భూమిలేని నిరుపేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు కొట్టం యాదయ్య, నీలకంఠం రాములు, దామెర లక్ష్మి, రామలింగాచారి, చింతపల్లి యాదయ్య, మాడుగుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:

బ్రేకింగ్: నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ చర్చ్ దగ్గర్లో, ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. మద్యం మత్తులో.. టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిపై లారీ దూసుకెళ్లింది.
నారాయణపురం మండలం, సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశం సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
NLG: నారాయణపురం మండలం, సర్వేల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సర్వేల్ గురుకుల పాఠశాల ముందు గురువారం ధర్నా నిర్వహించారు.
NLG: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-4251-442కు ఫోన్ చేయాలని, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు, అధికారులకు సూచించారు.
NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ వైద్య సేవలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య అధికారులను ఆదేశించారు.
నల్లగొండ: జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం బిజెపి జాతీయ నాయకుడు అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. ఈ దేశ సకల ప్రజలకు సర్వ హక్కులను ప్రసాదించిన దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా: భీమ్ పూర్ మండలం నిపని గ్రామం లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు.
నల్లగొండ జిల్లా:
Dec 20 2024, 22:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.8k