అంబుజా సిమెంట్ కంపెనీని రద్దు చేయాలని తమ్మినేని కి వినతిపత్రం అందజేసిన రామన్నపేట సిపిఎం ప్రతినిధులు
చౌటుప్పల్ లో జరుగుతున్న సిపిఎం మూడవ జిల్లా మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి రామన్నపేట-కొమ్మాయిగూడెం పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంటు కంపెనీని రద్దు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సిపిఎం రామన్నపేట ప్రతినిధులు వినతి పత్రం అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య లు మాట్లాడుతూ... ప్రజలకు హాని కలిగించే కాలుష్య పరిశ్రమను ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ అసెంబ్లీ సమావేశాల లోనే అంబుజా సిమెంట్ పరిశ్రమపై చర్చ జరిపి రామన్నపేటలో నిర్మించే సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని, లగచర్లలో ప్రజల నిరసనతో అక్కడ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీని రద్దు పరచిన విధంగా రామన్నపేట మండల ప్రజల అభిప్రాయం మేరకు అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేసే విధంగా చూడాలని ప్రభుత్వానికి విన్నవించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది అదే విధంగా సిపిఎం జిల్లా మహాసభలలో రామన్నపేటలో నిర్మించే అంబూజ సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్ కూరెళ్ల నరసింహచారి,కల్లూరి నాగేష్ మండల కమిటీ సభ్యులు నాగటి ఉపేందర్ ఎండి రషీద్, గొరిగె సోములు, మేడి గణేష్,నాయకులు నీల ఐలయ్య , మూశం నరహరి,శానగొండ వెంకటేశ్వర్లు,గోగులింగస్వామి తదితరులు ఉన్నారు
Dec 19 2024, 19:17