గోపరాజు పల్లి లో జై భీమ్ సేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో శుక్రవారం జై భీమ్ సేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య, ఉపాధ్యక్షులు కట్ట సురేష్ , ఆర్గనైజింగ్ సెక్రెటరీ నీలం నరేందర్, జాయింట్ సెక్రెటరీ సంగిశెట్టి రమేష్, కల్చరల్ సెక్రటరీ నీలం నరేష్, కమిటీ సభ్యులు సంగిశెట్టి ప్రభాకర్ , గౌరవ అధ్యక్షులు సంగిశెట్టి సుందర్ రావు, సంగిశెట్టి కిష్టయ్య,వల్లమాల శంకరయ్య, సంగిశెట్టి మాణిక్యరావు ,సంగిశెట్టి సుధీర్ ,రావుల నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Dec 15 2024, 14:40