నూతన బస్సు సర్వీస్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ జిల్లా:
మునుగోడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మాహా లక్ష్మి పథకాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కే.జానీ రెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (యం) శివశంకర్, నల్లగొండ డిఎం శ్రీనాథ్ లతో కలిసి 6 కొత్త బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.మునుగోడు నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని వివిధ గ్రామాలకు బస్సులను నడిపించాలని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటీవల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరిక మేరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 6 కొత్త బస్సులను నల్గొండ రీజియన్ కు ఇవ్వడం జరిగింది.
నూతనంగా ప్రారంభించిన ఇట్టి బస్సు సర్వీస్ ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1) దేవరకొండ నుండి మల్లేపల్లి, ముష్టిపల్లి, నాంపల్లి, మర్రిగూడ, శివన్నగూడెం, చౌటుప్పల్, వలిగొండ ద్వారా యాదగిరిగుట్ట.
2) దేవరకొండ నుండి మల్లేపల్లి, రేవల్లి, నాంపల్లి, మాల్ ద్వారా హైదరాబాద్.
3) దేవరకొండ నుండి మల్లేపల్లి, ముష్టిపల్లి, నాంపల్లి, చండూర్, మునుగోడు, కాంచనపల్లి ద్వారా నల్గొండ.
4) నల్గొండ నుండి కొంచనాపల్లి, మునుగోడు, చొల్లేడు, గట్టుప్పల్, శివన్నగూడ, మర్రిగూడ ద్వారా మాల్.
5) నల్గొండ నుండి కొంచనాపల్లి, మునుగోడు, వెల్మకన్నె, శివన్నగూడ, లోయపల్లి, రంగాపూర్ ద్వారా ఇబ్రహీంపట్నం.
6) నల్గొండ నుండి కనగల్, చండూర్, లెంకలపల్లి, మర్రిగూడ ద్వారా మాల్
కాగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషి వల్ల మునుగోడు నియోజకవర్గానికి ఆరు కొత్త బస్సులు రావడం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని వివిధ గ్రామాలకు బస్సులను నడిపించాలని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇటీవల ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరిక మేరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ 6 కొత్త బస్సులను నల్గొండ రీజియన్ కు ఇవ్వడం జరిగింది.

HYD: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 441 దరఖాస్తులు అందాయి.
నిర్మల్ జిల్లా:
త్వరలోనే విద్యార్థుల సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇవ్వడం జరిగింది. తక్షణమే కోటి రూపాయల నిధులు ట్రిపుల్ ఐటీకి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి సీతక్క ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
నల్గొండ: సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముందు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ రోజు నిరవధిక సమ్మె శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు.
నల్గొండ: పట్టణంలోని బొట్టుగూడ ఉన్నత పాఠశాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎలిశాల రవి ప్రసాద్ జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్యన ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కౌన్సిలర్ యామా కవితా దయాకర్ లు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా యామా కవితా దయాకర్ మాట్లాడుతూ.. వై ఆర్ పి ఫౌండేషన్ ద్వారా రవిప్రసాద్ బీద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు చేయూతనివ్వడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పంపిణీ మరియు కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు చేయూతనివ్వడం ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ముందరికి వెళ్తున్నారని, ముఖ్యంగా బీద విద్యార్థుల చదువుల కొరకు ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
నల్లగొండ: డంపింగ్ యార్డుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ వర్మి కంపోస్టు తయారీకి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్తను సేకరించాలన్నారు.
శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని చందనపల్లి లో ఉన్న డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
నల్లగొండ: హజ్రత్ సయ్యద్ షావలి (సయ్యద్ సాహెబ్) ఉర్సు ఉత్సవాలు సందర్భంగా, గురువారం సాయంత్రం పట్టణంలోని ఆర్పి రోడ్డు చౌరస్తా పాత కలెక్టరేట్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ మజీద్ నుండి గంధం ఊరేగింపు జరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కలిసి మునుగోడు రోడ్డు ఈద్గా సమీపం వరకు గంధాన్ని ఊరేగింపు గా తీసుకొని వెళ్లారు.
చౌటుప్పల్ పట్టణంలోని ప్రయాణికుల ప్రాంగణం వద్ద రోడ్డు పనుల రిపేర్ దృష్ట్యా.. మునుగోడు, గట్టుప్పల్, చండూరు ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు బస్టాండు లోకి వెళ్లకుండా ప్రధాన రహదారిపైనే ఆపి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు.
కాగా ప్రధాన రహదారిపై బస్సులు ఆగటం వల్ల ట్రాఫిక్ కు ఇబ్బంది కలగడంతో పాటు, బస్సుల కోసం గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్న ప్రయాణికులకు కూర్చోవడానికి కనీస సదుపాయాలు వసతులు లేవని, అధికారులు దృష్టిసారించి ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలికంగా బెంచీ లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుచున్నారు.
నల్లగొండ: ఇంటర్ యూనివర్సిటీ క్రీడలలో వివిధ విభాగంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు సత్తా చాటారు. గురువారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన కో-కో మహిళ విభాగంలో జి. మౌనిక, జీ. స్వాతి, కోకో పురుషుల విభాగంలో బి. అనిల్, బి. వినయ్, వి.ఈశ్వర్, కే.శివకుమార్ లు, హాకీ విభాగంలో కే .మహేష్, ఆర్.లింగ స్వామి.. వాలీబాల్ విభాగంలో ఎస్. రాధాకృష్ణ ఎంపిక కావడం జరిగింది.
Dec 14 2024, 19:59
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.6k