NLG: ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు విజయవంతం
నల్గొండ : ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా లకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల హెల్త్ క్యాంపు ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం వార్తలు, వృత్తే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు. కొత్తగా ఏర్పడిన నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఇటీవల వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని ఒకచోట కలవడం శుభ పరిణామం అని.. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమమే ధ్యేయంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని.. ఇందులో భాగంగానే ఇటీవల కార్తీక వనభోజనాలు, ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. కోరిన వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహణకు ముందుకు వచ్చిన యశోద హాస్పిటల్, తమ విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ప్రతి జర్నలిస్టు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కాగా నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు సుమారు 200 మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మెడికల్ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో భాగంగా యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రఫుల్ కిల్లారు, శిల్పారెడ్డి, చేతన్ వీరమనేని, రాఘవేందర్ గౌడ్, కమల్ తేజ్, భాను తేజ, వినీత.. జర్నలిస్టులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మెడికల్ చెక్ అప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైద్యులకు ప్రెస్ క్లబ్ కార్యవర్గం జ్ఞాపకలు అందజేసి, ఆత్మీయ సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి, మంజుల, ఉయ్యాల లింగయ్య,
కార్యవర్గం కట్టా సుధాకర్, విజయభాస్కర్, ఉపేందర్, సయ్యద్, రామకృష్ణ, జిల్లా యాదయ్య, అశ్వక్ అహ్మద్, మదనా చారి, జాకీర్ అలీ, బజరంగ్ ప్రసాద్, రవీందర్ రెడ్డి, భాస్కర్, మీసాల శ్రీనివాస్, కనకయ్య, ప్రేమ్, హరి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు గణేష్, జనార్ధన్ రెడ్డి, ఫణీంద్ర, సత్యనారాయణ, శ్రీధర్, చాంద్, అతీక్ అహ్మద్, అంజయ్య, రాంప్రసాద్, రమేష్, కోటగిరి రామకృష్ణ, ముచ్చర్ల విజయ్, భవాని ప్రసాదు, కంది శ్రీను, కారింగుల శ్రీను, ఖలీం, కత్తుల హరి, రవి, వెంకట్, బాలరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ : ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా లకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు భంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల హెల్త్ క్యాంపు ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం వార్తలు, వృత్తే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు. కొత్తగా ఏర్పడిన నల్గొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఇటీవల వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని ఒకచోట కలవడం శుభ పరిణామం అని.. జర్నలిస్టులకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానని సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమమే ధ్యేయంగా ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని.. ఇందులో భాగంగానే ఇటీవల కార్తీక వనభోజనాలు, ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. కోరిన వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహణకు ముందుకు వచ్చిన యశోద హాస్పిటల్, తమ విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ప్రతి జర్నలిస్టు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కాగా నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు సుమారు 200 మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మెడికల్ క్యాంప్ జరిగింది. కార్యక్రమంలో భాగంగా యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రఫుల్ కిల్లారు, శిల్పారెడ్డి, చేతన్ వీరమనేని, రాఘవేందర్ గౌడ్, కమల్ తేజ్, భాను తేజ, వినీత.. జర్నలిస్టులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మెడికల్ చెక్ అప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైద్యులకు ప్రెస్ క్లబ్ కార్యవర్గం జ్ఞాపకలు అందజేసి, ఆత్మీయ సన్మానం చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి, మంజుల, ఉయ్యాల లింగయ్య,

నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా, గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఆధ్వర్యంలో రీజినల్ మేనేజర్ కె. జాని రెడ్డి సమక్షంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాన్ని పట్టణంలోని బస్టాండ్ లో నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
NLG: తెలంగాణ పౌరులుగా మన ఘనమైన చరిత్రను మనం తెలుసుకొని ఆ విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ అన్నారు. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా గురువారం కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, ఉదయ సముద్రం, పచ్చల సోమేశ్వరాలయం, పానగల్ మ్యూజియం, లతీఫ్ సాహెబ్ దర్గాను సందర్శించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మన స్థానిక చరిత్రను, సాంస్కృతిక వికాసాన్ని తెలుసుకున్నప్పుడే రాష్ట్ర, దేశ ఔన్నత్యం తెలుస్తాయని అన్నారు.
ఇబ్రహీంపట్నం:
మునుగోడు మండల కేంద్రం కు బుధవారం వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కొండాపురం గ్రామంలో అంగన్వాడి స్వంత భవనం కోసం సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్ వినతి పత్రం అందించారు.
మునుగోడు మండలం, కొరటికల్ గ్రామంలో రూ. 2 కోట్ల 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ కు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు.
Dec 06 2024, 10:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.5k