ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టుటకు ప్రజలు ప్రజా ఉద్యమాలలో భాగస్వాములు కావాలి : సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ
పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా,అమర వీరుల ఆశయాలను సాధించకుండా ప్రజలకు విముక్తి లేదని సీపీఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసీ ల జిల్లా కార్యదర్శులు, భువనగిరి డివిజన్ కార్యదర్శి ఆర్.జనార్ధన్, మామిడాల బిక్ష పతి,బేజాడి కుమార్ లు స్పష్టం చేశారు రఘునాథ పురం లో డిశంబర్ 5 2024 న,రైతాంగ ప్రతిఘటన పోరాట అమర యోధుడు కామ్రేడ్ కటకం అంజన్న 44 వ వర్ధంతి సభ సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ గ్రామ కార్యదర్శులు కొంగరి సాయిరాం, యెర్ర మల్లేష్ అధ్యక్షతన జరిగింది. ముందుగా కామ్రేడ్ కటకం అంజన్న స్మారక స్థూపం వద్ద మామిడాల బిక్ష పతి జెండాను ఆవిష్కరించారు.ఈ సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు అంజన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అమర వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి విప్లవ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా జనార్ధన్,భిక్షపతి లు మాట్లాడుతూ,కామ్రేడ్ కటకం అంజన్న కమ్యూనిస్టు విప్లవకారునిగా ప్రజలకు,రైతు.కూలీలకు అనేక ఆపద సమయాలలో అండగా నిలబడ్డాడని ముఖ్యంగా దున్నే వారికే భూమి నినాదాన్ని సమున్నతంగా ముందుకు నడుపుడాని,భూమి లేని పేదలకు భూములు పంచాలని,పేదలు, సామాన్యులు,మద్యతరగతి,కార్మిక వర్గం తలెత్తుకొని జీవించే సౌకర్యవంతమైన, సమానత్వంతో కూడిన నూతన ప్రజాస్వామిక విప్లవం విజయాన్ని కాంక్షిస్తూ బలమైన ప్రజా,రైతాంగ పోరాటాలను,పాలేర్లకు జీతాలు, కూలోల్లకు కూలీ రేట్లు కోసం కొట్లాడిన గొప్ప నక్సలైట్ నాయకుడని కొనియాడారు. నేడు కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీ జే పీ,కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఉద్యమాలను అణిచివేసే విధానాలను అమలు చేస్తున్నాయని,అందులో భాగంగానే కమ్యూనిస్టు విప్లవ కారులను,మావోయిస్టులను బూటకపు ఎన్ కౌంటర్ లలో నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపుతున్నాయని అన్నారు. ఛత్తీస్గడ్,ములుగు జిల్లా లో ఇందులో కొనసాగింపుగా నే జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకొని బీ ఆర్ ఎస్ పార్టీని మట్టికరిపించారని,కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలు,రైతులు మరీ ముఖ్యంగా పేదలైన గిరిజనుల పట్టా భూములను దౌర్జన్యంగా గుంజుకోని పార్మసీ కంపెనీలు నిర్మిస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను పాడు చేయడానికి,వ్యవసాయ పంటలను దెబ్బతీయడానికి పూనుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్( న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శులు ఇక్కిరి సహదేవ్,ప్రజా సంఘాల నాయకులు మామిడాల సోమయ్య,ఆర్.సీత, కల్లెపు అడవయ్య, చిర బోయిన రాజయ్య, సాదుల శ్రీకాంత్,గడ్డం నాగరాజు,వగ్గు మల్లయ్య, బర్మ బాబు,గడ్డం యాదగిరి, ఇక్కిరి శ్రీనివాస్,బరిగే రాములు, వంగాల నర్సింహారెడ్డి, మామిడాల బాల మల్లెష్, మారజోడు సిద్దేశ్వర్, యెలగందుల సిద్దులు, రాచకొండ ఉదయ్, కొమ్మిడి గోపాల్ రెడ్డి,గోవింద్ పరమేశ్, మామిడాల ప్రవీణ్, మామిడాల మహేష్, కోలా సోములు, పాకాల నరేష్,శికిలం వెంకటేష్, సుంచు రాములు, సుంచు ఆంజనేయులు, పుండరీకం, ఇక్కిరి సిద్దులు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు.
Dec 06 2024, 07:13