అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశ గడువు ఆగస్టు 31
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ) కోర్సులు, బి ఎల్ ఐ సి , ఎమ్మెల్యే సి, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గాను ఆగస్టు 31 వ తేదీ చివరి తేదీ అని వరంగల్ ప్రాంతీయ సంచాలకులు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ జ్యోతి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సెంటర్లలో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సుల వివరాలను వెల్లడించారు. అదనపు వివరాలు www.braouonline.in; www.braou.ac.in లో పొందొచ్చని తెలిపారు.
అదేవిధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగష్టు 18వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని తెలిపారు.
పూర్తి సమాచారం కొరకు, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680290/291/294/295 టోల్‌ఫ్రీ నెం.18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు.
డిగ్రీ, పీజీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు రెండో, మూడో సంవత్సరంలో ఫీజు సకాలంలో చెల్లించలేక పోయిన వారు, 2015-16 విద్యాసంవత్సరం నుండి 2023-24 వరకు అడ్మిషన్ పొంది ఉంటే నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా టీఎస్ ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని, ట్యూషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది ఆగష్టు 18, అని సంచాలకులు ప్రొఫెసర్ జ్యోతి తెలిపారు.
ఈ సమావేశంలో డా రమేష్, డా చారి, డా గిరిప్రసాద్ పాల్గొన్నారు.
Dec 05 2024, 15:30