/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz RR: అంతర్గత రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కృషితో రూ. 120 కోట్లు మంజూరు Mane Praveen
RR: అంతర్గత రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కృషితో రూ. 120 కోట్లు మంజూరు
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నం నియోజకవర్గం అంతర్గత రహదారుల అభివృద్ధి పనులకు రూ. 120 కోట్లు,  ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కృషితో మంజూరు జరిగింది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో భాగంగా  మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డవలప్మెంట్ మరియు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శాఖల ద్వారా.. అంతర్గత రహదారుల పనులకు 120 కోట్ల రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి నుండి నియోజక వర్గానికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంజూరు చేయించారు.

*వివరాలు:*
1 ) ఇబ్రహీంపట్నం చౌరస్తా నుండి ఆక్టోపస్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు 60 కోట్లు
2 ) వనస్థలిపురం సాహెబ్ నగర్ రోడ్డు నుండి హయత్ నగర్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు 16 కోట్లు
3 ) ఇంజాపూర్ నాగార్జున సాగర్ రోడ్డు నుండి తొర్రూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు 24 కోట్లు
4 ) ఇంజాపూర్ హయత్ నగర్ నుండి మునుగనూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు 20 కోట్లు మంజూరు జరిగిందని ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు.
NLG: ఈనెల 5 న జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

నల్లగొండ: పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జిల్లా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు యశోద హాస్పిటల్, మలక్ పేట సౌజన్యంతో ఈనెల 5 వ తేదిన జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్,నల్గొండ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆశ్వాక్ అహ్మద్, మలక్ పేట యశోదా హాస్పిటల్స్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సాజిద్ లు వివరాలు వెల్లడించారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... నిరంతరం ఉరుకుల పరుగుల జీవితంలో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వారి సంక్షేమం కోసమే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు. ఈనెల 5న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, హెల్త్ క్యాంపు నిర్వహణకు వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ యశోద హాస్పిటల్స్ ముందుకు వచ్చారన్నారు.

యశోద హాస్పిటల్స్ సహకారంతో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపు ను జిల్లా కేంద్రం లో పని చేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మలక్ పేట యశోద హాస్పిటల్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మెగా హెల్త్ క్యాంపులో కార్డియాలజీ, ఆర్థోపెటిక్, గైనిక్, షుగర్, బిపి, ఈసిజి, 2D ఈకో, BMD బోన్ మినరల్ టెస్ట్, వెంటనే రిజల్ట్ వచ్చే టెస్టులన్నీ చేస్తామని తెలిపారు.అందుబాటులో లేని టెస్టు లను మలక్ పేట యశోద హాస్పిటల్ లో 50 శాతం డిస్కౌంట్ తో చేస్తామని, జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెస్టులలో ఏమైనా అనారోగ్య సమస్యలు నిర్ధారణ అయితే జర్నలిస్ట్ హెల్త్ కార్డు ద్వారా యశోద హాస్పిటల్ లో వైద్యం అందజేస్తామన్నారు.
ఇంటర్ విద్యార్థి మృతి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ కుమార్
నారాయణ కళాశాల విద్యార్థి తనుష్.. మృతి పైన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివ కుమార్ స్పందించారు. ఈ మేరకు నల్లగొండలో కట్టెల శివ మాట్లాడుతూ.. నారాయణ కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్ల గిరిజన విద్యార్థి బలైయ్యాడని తక్షణమే,యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

కళాశాలలోని ఉపాధ్యాయుల ఒత్తిడి వల్ల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ బిడ్డ లేని లోటు వల్ల ఆ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అట్టి కళాశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఆ కళాశాల పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'మహా కుంభ్' ను నూతన జిల్లాగా ప్రకటించిన యూపీ ప్రభుత్వం
UP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్ రాజ్ లోని ‘మహా కుంభ్' ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. దీనిని 'మహా కుంభమేళా' జిల్లాగా పిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

రానున్న కుంభమేళాకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి, పరిపాలన పనులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి ఈ కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
ఆశా వర్కర్లకు లెప్రసీ సర్వే బకాయిలు వెంటనే చెల్లించాలి: సిఐటియు
నల్లగొండ: ఆశా వర్కర్లతో లెప్రసీ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్దేశించిన క్రమంలో, ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని లేకపోతే సర్వేను నిలిపివేస్తామని, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిఎంహెచ్ఓ పుట్ట శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్ఒ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా ఆశా వర్కర్లకు లెప్రసీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అట్లాగే టిబి, పల్స్ పోలియో, ఎన్సీడీ పారితోషకాలు కూడా పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని కోరారు.

ఆశాలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులలో ఏ ఎన్ సి  టార్గెట్ ఒకటని, ఆశా వర్కర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని ఎఎన్సీ టార్గెట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

లెప్రసీకి సంబంధించిన మూడు సంవత్సరాల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. లేనియెడల జరిగేటటువంటి లెప్రసీ సర్వే లో ఆశాలు పాల్గొనబోరని తెలిపారు. 
             
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.మహేశ్వరి, వెంకటమ్మ, పార్వతమ్మ, జయమ్మ నవనీత, ధనమ్మ, సైదమ్మ, లలిత పుష్పలత, భాగ్యమ్మ, పద్మ, సునీత జానకి, తదితరులు పాల్గొన్నారు.
తిరుగండ్లపల్లి మాల మహానాడు అధ్యక్షులుగా చెల్లం శంకర్
నల్లగొండ జిల్లా,మర్రిగూడ మండలం, తిరుగండ్లపల్లి గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో, సోమవారం నూతన మాల మహానాడు గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడు గా చెల్లం శంకర్ ఉపాధ్యక్షులు- బత్తుల వెంకటయ్య, చెల్లం జంగయ్య, ప్రధాన కార్యదర్శి- బత్తుల పెద్దిరాజు, సహాయ కార్యదర్శి- చెల్లం ముత్యాలు, కార్యదర్శి చెల్లం పెద్దిరాజు, కోశాధికారి చెల్లం పెద్ద యాదయ్య, కార్యనిర్వాహణాధికారి వడ్డేమోని యాదయ్య లను ఎన్నుకున్నారు.

ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి చెప్పడం జరిగింది. కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
RR: ప్రజాపాలన విజయోత్సవ  కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీ పరిధిలోని జల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన, ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలను ప్రారంభించి అందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.

అనంతరం ఆయన ప్రసంగిస్తూ. తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పాలన లో, రాష్ట్రం అన్ని  రంగాలలో అభివృద్ధిని  కనపరుస్తూ ముందుకు సాగుతున్నదని ప్రతి పెదవానికి సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని అన్నారు.

నియోజకవర్గం లోని అన్ని పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల తోపాటు ,  నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి, ఇబ్రహీంపట్నం రెవిన్యూ డివిజన్ అధికారితో పాటు మండల, మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం
HYD: టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ మేరకు కమిషన్ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా విధులు నిర్వర్తించాలని సీఎం కోరారు.

కాగా, ప్రస్తుత టిజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి, రేపటితో పదవీ విరమణ కానున్నారు. ఈనెల 3న బుర్ర వెంకటేశం బాధ్యతలు చేపట్టనున్నారు.
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన వెంకటసాయి
నల్గొండ జిల్లా:
నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 5 వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరుగు 68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 బాలుర ఫుట్బాల్ జాతీయస్థాయి పోటీలకు, నల్గొండ చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన రాచూరి వెంకటసాయి సెలెక్ట్ కావడం జరిగిందని క్లబ్ వ్యవస్థాపకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు  తెలిపారు. నల్లగొండలో ఆదివారం బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. రాచూరి వెంకటసాయి గత సంవత్సరం 2సార్లు జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా సారధ్య బాధ్యతలు వహించడం జరిగిందని తెలిపారు.

చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో ఫుట్బాల్ క్రీడలో తర్ఫీదు పొంది శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ కు సెలెక్ట్ కావడమే కాకుండా పలు రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.

ఈ సందర్భంగా  స్పోర్ట్స్ ఫౌండేషన్ పక్షాన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుంభం రామ్ రెడ్డికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
NLG: రైతు వేదికలో రైతు పండుగ.. వీడియో కాన్ఫరెన్స్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల రైతు వేదిక లో శనివారం రైతు పండుగ లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు రాష్ట్ర రైతులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఏవో మల్లేష్ ఏఈఓ విజయ్ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మర్రిగూడ మండల మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మాల్ మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ పగడాల లింగయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెండు నరసింహారెడ్డి, బండ యాదయ్య, వివిధ గ్రామాల రైతులు కోలుకులపల్లి యాదయ్య, సిలివేరు యాదయ్య, ఆకారపు శ్రీను, గ్యార వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.