NLG: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన శాసనమండలి చైర్మన్
నల్గొండ: జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
శనివారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన నివాసంలో, ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ మేరకు సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు.
*జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సన్మానించారు*.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు పై ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తుందని, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తగిన విధంగా న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతుందని మండలి చైర్మన్ తెలిపారు. జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సూచించారు.
ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు దోసపాటి సత్యనారాయణ, ఎం.యాదగిరి, మదనాచారి, సయ్యద్, రామకృష్ణ, ఉపేందర్, మల్లేష్, కంది శ్రీనివాస్, భాస్కర్, రవీందర్ రెడ్డి, అశోక్, చాంద్, రాంప్రసాద్, భజరంగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Nov 29 2024, 22:05