NLG: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన శాసనమండలి చైర్మన్
నల్గొండ: జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
శనివారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన నివాసంలో, ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ మేరకు సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కు శాశ్వత భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు.
*జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సన్మానించారు*.
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు పై ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తుందని, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తగిన విధంగా న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతుందని మండలి చైర్మన్ తెలిపారు. జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సూచించారు.
ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు దోసపాటి సత్యనారాయణ, ఎం.యాదగిరి, మదనాచారి, సయ్యద్, రామకృష్ణ, ఉపేందర్, మల్లేష్, కంది శ్రీనివాస్, భాస్కర్, రవీందర్ రెడ్డి, అశోక్, చాంద్, రాంప్రసాద్, భజరంగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ: జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

నల్గొండ: వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 24 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరు అయిన రూ. 8,15,000/- విలువ గల చెక్కులను, శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం, నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన నూకం జంగయ్య కుమారుడు నూకం రాంచరణ్ (13) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా:
నల్గొండ: పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో, ఈనెల 29 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు, సాధారణ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ జిల్లా:
మునుగోడు నియోజకవర్గం:
గురుకుల పాఠశాల స్థలదాత మద్ది నారాయణరెడ్డి విగ్రహంతో పాటు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం విగ్రహాల కు పూలమాల లు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, 18.61 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, 1 కోటి రూపాయల వ్యయం తో ఫర్నిచర్ తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దేశంలోనే సర్వేలు పాఠశాలకు ఉన్నతమైన ఘన చరిత్ర ఉంది.మద్ది నారాయణరెడ్డి తన 44 ఎకరాల స్థలం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు.
డబ్బు తో గౌరవం రాదు, విద్యతోనే వస్తుంది. చదువుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. రాజకీయ నాయకులు,కలెక్టర్లు,డాక్టర్లు, శాస్త్రవేత్తలు కావచ్చని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య కోసం కృషి చేస్తుందని,
మునుగోడు నియోజకవర్గంలో మండలానికి 5 పాఠశాలల చొప్పున 30 స్కూల్ లను నిర్మించేలా కృషి చేస్తానని అన్నారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం విషయంలో తేడా రావొద్దని పాఠశాల సిబ్బంది కి సూచించారు.
కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పలువురు నాయకులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
Nov 29 2024, 19:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.2k