విద్యుత్ పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కార్యాలయం లో "విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (ప్రత్యేక కోర్టు)" సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ భువనగిరి డీఈ కార్యాలయం లో "ఫ్యూజ్ ఆఫ్ కాల్ రిజిష్టర్" ను విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కోరారు. వినియోగదారుల సేవా కేంద్రం(సీ ఎస్ సీ)లో సేవల వివరాలను, గృహ అవసరాలకు (డొమెస్టిక్), వ్యాపారం (కమర్షియల్), వ్యవసాయ (అగ్రికల్చర్) అవసరాలకు కావలసిన మీటర్లకు డీడీ అమౌంట్, డీడీ ఎవరి పేరుమీద తీయాలి అనే వివరాలను పొందుపరచాలని ఆయన కోరారు. రూరల్ ఏఈ, పట్టణ ఏఈ , ఈ ఆర్ ఓ కార్యాలయాల పేర్లను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరు విద్యుత్ అధికారులు, విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని , సమయపాలన కూడా పాటించడం లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(ఈ సీ జి ఆర్ ఎఫ్) చైర్మన్ పి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫ్యూజ్ ఆఫ్ కాల్ కొరకు 1912 నంబర్ ను ఉపయోగించాలని కోరారు. వేదిక ద్వారా ప్రతి నెలా సమావేశాలు నిర్వహిస్తూ, విద్యుత్ సమస్యలైన లో- ఓల్టేజ్, కొత్త కనెక్షన్స్ , మీటర్ బిల్లింగ్, పేరు మార్పు మొదలగు సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. సిటిజన్ చార్టర్ లో పేర్కొన్న ప్రకారం సకాలంలో సేవలందిస్తామన్నారు. భువనగిరి వినియోగదారుల సేవా కేంద్రం లో వారం లోపు సూచికలు ఏర్పాటు చేయాలని, వివిధ కార్యాలయాల బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని డీఈ ని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మెంబర్ ఫైనాన్స్ ఎస్. రామాంజనేయ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ ఈ సుధీర్ కుమార్, డీ ఈ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్ ఏ ఓ లు బాలచంద్రుడు, శ్రీనివాసాచారి, ఏడీ లు ఆనంద్ రెడ్డి (భువనగిరి) మచ్చేంధర్ ( బీబీనగర్) రాజశేఖర్ ( ఆలేరు) బాలు (మోత్కూరు), ఏఈ , సాయికృష్ణ , వినియోగదారుల సంఘాల ప్రతినిధులు మాటూరి బాలేశ్వర్, పొలిశెట్టి అనిల్ కుమార్, విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Nov 27 2024, 14:59