ఆలేరు లో కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 40వ వర్ధంతి
దున్నే వారికే భూమి నినాదం నేటికీ కీలకమే. విప్లవోద్యమం లో ప్రతిఘటన పోరాటం ప్రధానాంశమే.. ప్రజా యుద్ద పంథా ను సమున్నతంగా నిలబెట్టిన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నూతన ప్రజాస్వామిక విప్లవానికి మార్గదర్శకుడు ఆర్.జనార్ధన్,మామిడాల బిక్షపతి, జిల్లా కార్యదర్శులు, సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ... దున్నే వారికే భూమి నినాదం నేటికీ కీలకంగానే ఉంటుందని,నేడు చూడడానికి భూస్వాములు అంతగా లేనప్పటికీ ప్రజలకు చెందాల్సిన భూమి వివిధ రూపాలలో ఆక్రమణలోనే ఉన్నదని,భవిషత్ లో భూపొరాటాలు పెద్ద ఎత్తున తన్నుకు వస్తాయని,విప్లవోద్యమం లో ప్రతిఘటన పోరాటం అనేది అత్యంత ప్రధానంగా ఉంటుందని, సీపీఐ ఎం.ఎల్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి దీర్ఘ కాలిక ప్రజా యుద్ద పంథా ను సమున్నతంగా నిలబెట్టాడని ఆ పంథాలో మరింత బాధ్యతా యుతంగా,దృఢంగా ముందుకు సాగాలని రెండు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ ల జిల్లా కార్యదర్శులు ఆర్.జనార్ధన్, మామిడాల బిక్షపతి లు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నాడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 40 వ వర్ధంతి సందర్భంగా ఆలేరు కమలమ్మ - జనార్ధన్ ఫంక్షన్ హాల్ లో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ భువనగిరి డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భారత విప్లవోద్యమంలో పశువులు బాసిన కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి తో పాటు, అనేకమంది కమ్యూనిస్టు విప్లవకారులకు రెండు నిమిషాలు సంతాప సూచకంగా మౌనం పాటించి విప్లవ జోహార్లు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో జనార్ధన్, బిక్షపతి లు మాట్లాడుతూ, ముళ్ళు,రాళ్ళు అవాంతరాలు, ఆటు పోట్లు,ఇబ్బందులు,అక్రమ అరెస్టులు,జైల్ జీవితం, నిర్భందాలన్నింటిని ఎదుర్కొని దీర్ఘ కాలిక సాయుధ ప్రజా యుద్ద పంథాలో జీవితాంతం కొనసాగడం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి లాంటి విప్లవ కారులకే సాధ్యమని అన్నారు. భూస్వామ్య వ్యవస్థ ను నాశనం చేస్తూ, రాజ్యం సాగిస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ,ప్రజలు,రైతులు,కార్మికులు మొత్తం అశేష ప్రజానీకాన్ని ఒక్కటి చేసి వేలాది ఎకరాల పంట భూములను ప్రజా పోరాటాల ద్వారా సాధించి పెట్టిన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విప్లవానికి మార్గదర్శకుడని అన్నారు. నేడు దేశంలో అధికారంలో ఉన్న బీ జే పీ మోడీ ప్రభుత్వం మావో హిస్టు కమ్యూనిస్టు విప్లవకారులను నెలలో,రెండు నెలల్లో లేకుండా చేస్తామని చెప్పడమంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది రూపాయల ప్రజా సంపదను సామ్రాజ్యవాదులకు, బడా కార్పోరేట్ సంస్థలకు దోచిపెట్టడంలో భాగంగానే అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని,మోడీ లాంటి దేశ తిరోగమన విధానాలను అనుసరిస్తున్న,దేశ ద్రోహ కరమైన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటాలలోకి ముందుకు రావాలని కోరారు. బీ జే పీ అనుసరిస్తున్న మతోన్మాదం,హిందూత్వం, కాశాయికరణ, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మతం అనే ఆలోచన ప్రజల విచ్చిన్నతకు,ఐక్య మతాన్ని దెబ్బతీయడానికి బీ జే పీ రాజకీయ ప్రయోజనాలకు అంతిమంగా ఈ దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మివేయడానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికి ఎన్నికలలో చేసిన ప్రధానమైన హామీలు మహిళలకు నెలకు 25 వందల రూపాయలు లాంటివి అమలు చేయలేకపోతుందని,హైడ్రా,మూసీ ప్రక్షాళన పేరుతో అసలు విషయాల నుండి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పూనుకుంటుందని,హైడ్రా చర్యల వల్ల ముప్పయి సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలను దౌర్జన్యంగా వెళ్లగొడుతున్నారని విమర్శించారు. ఇంకా ఈ సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అద్యక్షులు కల్లెపు అడవయ్య, చిర బోయిన రాజయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, గడ్డం నాగరాజు, పీ వై ఎల్ జిల్లా అద్యక్షులు మారజోడు సిద్దేశ్వర్, రాచకొండ ఉదయ్ లు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాల నాయకులు మామిడాల సోమయ్య, కర్రె పాండరి, అన్ రెడ్డి బాల్ రెడ్డి,వగ్గు మల్లయ్య, పిన్నపురెడ్డి రాఘవ రెడ్డి,చిర బోయిన కొమురయ్య, ఏనుగుల నరసమ్మ,ఇక్కిరి శ్రీనివాస్,వంగాల మధుసూదన్ రెడ్డి, చిర బోయిన బాలయ్య, వంగాల నర్సింహారెడ్డి, మోటే అంజయ్య, మామిడాల బాలమల్లెష్, కుర్రి సత్యనారాయణ, శికిలం వెంకటేష్ శికిలం కుమారస్వామి పంజాల మురళి కొంగర సాయిరాం, ఏనుగుల ఎల్లయ్య,ఏనుగుల ఉదయ్,గడ్డం యాదగిరి, మామిడాల భాను చందర్, మామిడాల మధు, గోవిందు పరమేష్, పుప్పాల సిద్దులు,పుండరీకం, బరిగే రాములు, మారజోడు కుమార్, అయిల యాకయ్య, గిరి రాంచందర్, బూష శ్రీశైలం, కడకంచి అంజయ్య, కడకంచి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
Nov 14 2024, 21:17