/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ముదిగొండ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం Vijay.S
ముదిగొండ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ కాలనీకి చెందిన యువ రచయిత,గాయకులు ముదిగొండ సిద్దయ్య (సిద్దు భాయి నేత) కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం లభించింది..ఈ పురస్కారానికి హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు మాతృ భాష సంస్కృతి సాంప్రదాయం అభివృద్ది కి సాహిత్యం ద్వారా కృషి చేస్తున్నoదుకు ముదిగొండ సిద్దు ను ఎంపిక చేశారు..ఈ పురస్కారం ఈ నెల 27న ఆదివారం చిక్కడ పల్లి లోని త్యాగరాయ గానసభ లో జరిగే కార్య క్రమంలో సిద్దు ప్రసంగించి పురస్కారం అందుకోబోతున్నారు.. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా వివిధ ప్రముఖులు పాల్గొంటున్నారు అని విలేకరుల సమావేశంలో తెలిపారు.
అసంపూర్తిగా ఉన్నటువంటి సిసి రోడ్డును అండర్ డ్రైనేజ్ సమస్యను వెంటనే పూర్తి చేయాలి : CPI

అసంపూర్తిగా ఉన్నటువంటి సిసి రోడ్లను అండర్ డ్రైనేజ్ సమస్య వెంటనే పూర్తి చేయాలి సిపిఐ. వలిగొండ మండలంలోని అరూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామ శాఖ సమావేశం కామ్రేడ్ పగిడి వెంకటేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోడ సుదర్శన్ హాజరై మాట్లాడుతూ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న సిసి రోడ్లను వెంటనే పూర్తిచేయాలని అండర్ డ్రైనేజీలు లేక మురుగు నీరు అంత రోడ్డుపయికి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అకాల వర్షాల కారణంగా బజార్లు నీటి గుంతల మయమయి దోమలు ఈగలతో గ్రామాలలో ప్రజలకు వైరల్ విష జ్వరాలు వెదజల్లుతున్నాయి వెంటనే బ్లీచింగ్ పౌడర్, దోమల మందు, గడ్డి మందులు పిచికారి చెయ్యాలి వీధి దీపాలను ఎప్పటికప్పుడు వేయించాలని ఆయన అన్నారు ప్రత్యేక అధికారులు వెంటనే గ్రామాలను సందర్శించాలి వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి మేడి దేవేందర్ సిపిఐ మండల సమితి సభ్యులు సుద్దాల సాయికుమార్ బుర్ర మల్లేశం సిపిఐ సీనియర్ నాయకులు జక్కుల లక్ష్మయ్య చిలకమర్రి నారాయణ గుడ్డేటి ఐలయ్య గుడ్డటి యాదయ్య గోగు రమేష్ సంఘీ కృష్ణ నూకల ఉదేష్ తదితరులు పాల్గొన్నారు
ఈనెల 29న నిర్వహించే ఉమ్మడి నల్గొండ జిల్లా మాదిగల ధర్మ యుద్ధ సదస్సును జయప్రదం చేయండి: MRPS

ఈనెల 29 నిర్వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లా మాదిగల ధర్మయుద్ధ సదస్సును జయప్రదం చేయండి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రాక - ఎమ్మార్పియస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ. హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈనెల 29న జిల్లా కేంద్రంలో జరుగు మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి నల్లగొండ జిల్లా సదస్సు జయప్రదం చేయాలని ఎంఎస్పి, ఎమ్మార్పియాస్ నాయకులుకు మరియు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ రావాలని పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పోచంపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల భువనగిరి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం టౌన్ అధ్యక్షులు పెద్దల శ్రీను మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ నల్ల చంద్ర స్వామి మాదిగ హాజరై మాట్లాడుతూ.... రేవంత్ రెడ్డి మాదిగలతో తియ్యగా మాట్లాడి, మాదిగలపట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ..మాదిగలకు ద్రోహం చేస్తున్నాడని అన్నారు. ఆగస్ట్ 1న సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది సుప్రీమ్ కోర్టు తీర్పు వచ్చిన అర్ధగంటలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలోనే వర్గీకరణ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఏ నోటిఫికేషన్ వచ్చిన వర్గీకరణ అమలు ఐతదని ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ,రెండు నెలలు తిరుగక ముందే మాట మార్చిన రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేశారు అని విమర్శించారు . దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వర్గీకరణలో మొట్టమొదటి రాష్ట్రం ఐతదని మాదిగలు ఎంతో సంతోషించారు అన్నారు.రేవంత్ రెడ్డి చేస్తున్న నమ్మక ద్రోహాన్ని మాదిగ జాతి సహించదు అని హెచ్చరించారు . విద్యా శాఖ తన పరిధిలోని ఉన్నది. ఎస్సీ వర్గీకరణ మీద మాట ఇచ్చి తన శాఖ పరిధిలోనే 11 వేలకు పైగా టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం మాదిగలకు అన్యాయం చేయడం తగదు... ఒక జాతికి న్యాయం చేయడం కన్నా ముఖ్యమంత్రి పదవీ కాపాడుకోవడమే ఎక్కువా...? మల్లిఖార్జున్ ఖర్గే ,కొప్పుల రాజు ను చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు .. రాష్ట్రంలోని మాల ప్రజాప్రతినిధులకు తలొగ్గి ఉద్యోగాలు దోచి పెట్టే కార్యక్రమానికి పూనుకున్నాడు...మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 29 న ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగే మాదిగల ధర్మ యుద్ధం సదస్సును మాదిగ మాదిగ ఉప, ఉద్యోగులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ----------------------------------------------------------------------- ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మెస్ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ యాకరి రేణుక నరసింగా రావు మాదిగ మాజీ సర్పంచ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ mrps సందల శ్రీనివాస్ మాదిగ మాజీ జెడ్పిటిసి సందల సుధాకర్ మాదిగ మాజీ సర్పంచ్ బక్కన దాస్ సోమారపు శంకర్ తంగడిపల్లి బిక్షపతి మాదిగ కనగళ్ల కుమార్ సోమారపు చంద్రయ్య . కుమార్ బండారి శివశంకర్ ఎడ్ల లింగస్వామి మాదిగ మచ్చ నరసింహ మాదిగ గోస్కొండ స్వామి ఏర్పుల రమేష్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. జై మాదిగ... జై జై మంద కృష్ణ మాదిగ..
రచ్చబండ సమావేశ గద్దె నిర్మాణ దాత కర్నేకంటి యాదయ్య ను సన్మానించిన గ్రామస్తులు

వలిగొండ మండలం వెంకటాపురం గ్రామం లోని రచ్చబండ సమావేశ గద్దెను తన సొంత నిధులతో నిర్మించిన కర్నేకంటి యాదయ్య ని గ్రామస్థులు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కర్నెకంటి యాదయ్య  మాట్లాడుతూ ఇదే విధంగా గ్రామస్తులు నాకు సహకరిస్తే రైతుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కాలువల మరమ్మతుల నిమిత్తం తన సొంత నిధుల నుండీ సంవత్సరం కు 100000(ఒక లక్ష) రూపాయలు విరాళంగా ఇస్తానని మరియు ముందు ముందు గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఉంటుందని అన్నారు ఇట్టి కార్యక్రమం లో గ్రామం లోని యువకులు వృద్దులు తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ; ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, టేబుల్స్ అందజేసిన కొండూరు భాస్కర్

మన ఊరి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో సమాజ సేవకుల పాత్ర అందరిది ఉండాలనే మంచి ఆలోచనతో స్థానికలను సంప్రదించే క్రమంలో పాఠశాల తరగతి గదులకు, ఆఫీస్ కి కొన్ని కుర్చీలు, టేబుల్స్ కావాలి అని అడిగిన వెంటనే స్పందించి ముందుకు వచ్చి ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలకుంట శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వలిగొండ పట్టణ ప్రముఖులు కొండూరు భాస్కర్ మెడికల్ షాప్ పాల్గొని 25 వేల రూపాయల విలువ గల కుర్చీలు, టేబుల్స్ పాఠశాల కు అందించనైనది. పాఠశాల అభివృద్ధి కి చేయూత నందించిన దాత కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధన్యవాదములు తెలియజేస్తూ ఇలాగే పుర ప్రముఖులు ఇంకా కొంతమంది ముందుకు వచ్చి మన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లో భాగస్వాములు కాగలరని కోరనైనది. ఇట్టి కార్యక్రమం లో స్థానిక నాయకులు కాసుల వెంకన్న, మైసోళ్ల మత్స్యగిరి, కొండూరు సాయి మరియు పాఠశాల ఉపాధ్యాయులు మునగపాటి వరమ్మ, మామిడి కవిత మొదలగు వారు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలి, టేకుల సోమవారం ఉన్నత పాఠశాలను సందర్శించిన SFI

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని టేకుల సోమవారం గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు అదేవిధంగా రాష్ట్రంలో వెంటనే విద్యాశాఖ మంత్రి పదవి భర్తీ చేయాలన్నారు అదేవిధంగా ఉన్నత పాఠశాలలో మండల పరిషత్ పాఠశాలలలో స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికుల కు వేతనాలు విడుదల చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి మైసోల్ల నరేందర్ పట్టణ నాయకులు ఏసోఫ్ చేగూరి లక్ష్మణ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

RRR రైతులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి: భానుచందర్ బొజ్జ

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బొజ్జ భాను చందర్ మాట్లాడుతూ రాయగిరి గ్రామం గతం లో అనేక సార్లు కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అని ఇప్పుడు RRR పేరుతో దాదాపు 280ఎకరాలు మల్ల ఇవ్వాలి అంటే ఇవ్వడానికి సిద్ధంగా లేము అని గత ప్రభుత్వం పై అనేక ఉద్యమాలు చేసి రైతులు జైలు జీవితం గడిపిన విషయం తెలిసిందే, అన్నాడు ఉద్యమం లో ప్రస్తుత మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ప్రస్తుత MLA కుంభం అనిల్ రెడ్డి గారు కూడా పూర్తి మద్దతు తెలిపారు అని అన్నారు, అన్నాడు శాసనసభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రియాంక గాంధీ గారు నోటా కూడా RRR అలైన్మెంట్ మారుస్తా అని కూడా అన్నడం జరిగింది మరియు మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకన్న గారు అనిల్ కుమార్ రెడ్డి అన్న గారు కూడా మేము గెలిచాక రాయగిరి నుండి RRR పోకుండా మొదటగా వచ్చిన మూటకొండూరు పై నుండి వచ్చే అలైన్మెంట్ హే ఖరారు చేస్తాం అని రైతులకు మాట ఇవ్వడం తో రైతులు ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి అధికారం కట్టబెట్టారు అని చెప్పుకా వచ్చారు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టి కి తీసుకెళ్లి అలైన్మెంట్ మార్చే విధంగా చేయాలి అని రైతులు వేడుకుంటున్నరు, గత ప్రభుత్వం లాగా చేయొద్దు అని రాయగిరి పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారు, వీలు అయినంత త్వరగా అలైన్మెంట్ మర్చి రాయగిరి రైతులకు న్యాయం చేయాలనీ కోరుతున్నారు అని అన్నారు
ఎంసీ సభ్యులను విస్మరించిన చైర్మన్ , ఎంసీ సభ్యుల పట్ల వివక్ష చూపడం సరికాదు: కొడారి వెంకటేష్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు

జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు* పార్లమెంటు తీర్మానంతో చట్టం పరిధిలోకి వచ్చిన సంస్థ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల పట్ల వివక్ష చూపడం, కనీసం వారికి గుర్తింపు ఇవ్వకపోవడం చాలా విచారించదగ్గ విషయమని జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ అన్నారు. గురువారం భువనగిరి శివారులోని ఒక ప్రైవేటు హోటల్ లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో మేనేజ్మెంట్ సభ్యులను కనీసం సభకు పరిచయం చేయకపోవడం, జిల్లా చైర్మన్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు. జిల్లా సర్వ సభ్య సమావేశానికి, సాదారణ సభ్యులతో పాటు, మొత్తం 15 మంది జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు హాజరైనా, వారిని వేదిక మీదకు పిలువకపోవడం, కనీసం సభకు పరిచయం చేయకపోవడం, వారిని కేవలం సాదారణ సభ్యులుగానే గుర్తించడం, జిల్లా చైర్మన్ సభ్యుల పట్ల చూపెడుతున్న వివక్షగా భావిస్తున్నామని ఆయన అన్నారు. తనకు నచ్చిన వారితో అతిథులకు బొకేలు ఇప్పించడం, సన్మానం చేయించడం సరియైన పద్ధతి కాదని ఆయన అన్నారు. అంతర్జాతీయ సేవాసంస్థ గా గుర్తింపు పొందిన సంస్థకు సుమారు 200 మందిని సభ్యులను పరిచయం చేసిన, మాజీ ఎమ్మెల్యే సర్వసభ్య సమావేశానికి హాజరైనా , ఆ మాజీ ఎమ్మెల్యే ను వేదిక మీదకు పిలవకపోవడం, సంస్థకు తీవ్ర నష్టం కల్గించే విషయమని ఆయన అన్నారు. జిల్లా చైర్మన్ ఒకే సామాజిక వర్గానికే ఎక్కవ ప్రాదాన్యత ఇవ్వడం, సంస్థలో రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించడం, బంధుప్రీతి తో, ఇష్టానుసారం సంస్థను నడిపిస్తున్న విషయం పై జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర గవర్నర్ ల దృష్టికి తీసుకెళ్తామని సంస్థ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు కొడారి వెంకటేష్ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గవర్నర్ ను కోరుతామన్నారు.
భువనగిరి :బాలసదనం సంఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో బాలిక పై జరిగిన లైంగిక దాడి పై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు బాలల హక్కుల పరిరక్షణ వేదిక, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏ ఐ ఎస్ ఎఫ్ ల ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల తర్వాత బాలసదనం లోనికి మగవారికి ప్రవేశం లేకున్నా, సాయంత్రం 7 గంటలకు అవగాహన సదస్సు ఎలా ఏర్పాటు చేసారని ఆయన ప్రశ్నించారు. అదే రోజు రాత్రి 8 గంటలకు అమ్మాయి, తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పగా, బాలసదనం సూపరింటెండెంట్ లలిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ అసిస్టెంట్ కు చెప్పగా, విషయాన్ని దాటవేస్తూ, అటెండర్ వెంకట్ రెడ్డి మంచివాడని, అమ్మాయి అబద్దం చెబుతుందని మభ్యపెట్టి వెళ్ళినట్టు సూపరింటెండెంట్ లలిత తెలిపారని వెంకటేష్ అన్నారు. ఆ తర్వాత విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ కు, డీసీపీఓ కు సమాచారం ఇచ్చినట్టు ఆమె తెలిపారని వెంకటేష్ అన్నారు. అదే రోజు సంఘటనపై పోలీసులకు పిర్యాదు చేయాల్సిన అధికారులు విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారో అర్థం కావడం లేదన్నారు. బాలికకు జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టి అమ్మయిని ఉద్దేశపూర్వకంగా వేరే ప్రాంతానికి తరలించడం వల్ల, బాలల హక్కులకు భంగం కలిగించినందుకు బాలసదనం సూపరింటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, మరియు డిసిపీఓ లపై ఫోక్సో చట్టం సెక్షన్ 19, 20 ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అటెండర్ వెంకట్ రెడ్డి పై ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికను ప్రభుత్వపరంగా ఆదుకోవాలి ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్, నాయకులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎరుకల హక్కుల పోరాట సమితి వలిగొండ మండల కమిటీ ఎన్నిక

ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు వలిగి ప్రభాకర్ ఆదేశానుసారం వలిగొండ మండల కేంద్రంలో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానుపాటి కృష్ణయ్య ఆధ్వర్యంలో వలిగొండ మండల కమిటీని ఏర్పాటు చేశారు మరియు మహిళా మండల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వలిగొండ మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చిన ఎరుకల తెగ కుర్రు ప్రజలను ఉద్దేశించి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ఎరుకల తెగకు ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎరుకల ఏకలవ్య కోఆపరేటివ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎరుకల ప్రజల కోసం మార్మూల గ్రామం నుండి ఢిల్లీ పార్లమెంటు వరకు చైతన్య పరుస్తూ ఎరుకల తెగ హక్కుల కోసం వారికి జరుగుతున్న అన్యాయాల గురించి సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఎరుకల హక్కుల పోరాట సమితి కి ఏకలవ్య కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొలుగుల నరసింహ, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఎరుకల తెగ కుర్రు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలిగొండ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు గౌరవ సలహాదారులుగా ఉండాడి సత్యనారాయణ గౌరవ అధ్యక్షులుగా ఉండాడి పాపయ్య అధ్యక్షులుగా ఉండాలి ఆంజనేయులు ఉపాధ్యక్షులుగా ఉండాడి స్వామి బొలుగుల శ్రీను ప్రధాన కార్యదర్శిగా బొలుగుల కుమారస్వామి ఉండాడు కృష్ణ సహాయ కార్యదర్శిలు లక్ష్మయ్య బుడ్డ బాలయ్య కోశాధికారిగా పత్తేపు నరసింహ సహాయ కోశాధికారిగా ఉండాడి సాయికుమార్ కార్యవర్గ సభ్యులుగా ఉండాడి జంగయ్య ఉండాడి రామచంద్రు వనం యాదయ్య బొలుగుల నరసింహ ఉండాడి మల్లయ్య మానుపాటి పరమేష్ గాను ఎన్నుకున్నారు. మహిళా సంఘం గౌరవ అధ్యక్షురాలుగా మారుపాటి ఎల్లమ్మ, మండల మహిళా అధ్యక్షులుగా బొలుగుల భాగ్య ఉపాధ్యక్షురాలుగా దేవసాని రాములమ్మ ను, ప్రధాన కార్యదర్శిగా పత్తేపు మౌనిక సహాయ కార్యదర్శి కోనేటి సరిత, కోశాధికారిక ఉండాడి రేణుక, కార్యవర్గ సభ్యురాలుగా శ్రీలత లక్ష్మమ్మ అంజమ్మ లక్ష్మమ్మ ఎల్లమ్మ లను ఎన్నుకున్నారు.