అంబుజా సిమెంట్ పరిశ్రమ రద్దు అయ్యేంతవరకు పోరాటం ఆగదు : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్
రామన్నపేట కొమ్మయిగూడెం మరియు సిరిపురం పరిధిలో అంబుజా సిమెంట్ పరిశ్రమ పెట్టే నిర్ణయాన్ని యాజమాన్యం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొమ్మాయిగూడెం లారీ మరియు ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కుమ్మయిగూడెం నుండి రామన్నపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కంపెనీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ అంబుజా సిమెంటు ఫ్యాక్టరీ వల్ల అన్ని రకాలుగా, ప్రజలందరికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, రైతులు పండించె వరి, పత్తి లాంటి పంటలకు, దుమ్ము ధూళి పారి పెట్టిన పెట్టుబడి కూడ వచ్చే పరిస్థితి ఉండదని, పంట కూడా పూర్తిగా నష్టాల బారిన పడే ప్రమాదం ఉందని, ప్రధానంగా సిమెంటు ఫ్యాక్టరీ ద్వారా వచ్చే పొగ, యాష్ పౌడర్ గాలిలో కలుస్తుంది కావున వాయు కాలుష్యం ఏర్పడి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని, ఇప్పుడున్న కల్తీ వస్తువులతో తినే తిండి, నీరు కలుషితం అయ్యి రకరకాల రోగాలబారిన పడుతుంటె, ఇప్పుడు ఈ సిమెంటు ఫ్యాక్టరీ ద్వారా వాయు కాలుష్యం ఏర్పడి మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందని, ఫ్యాక్టరీ ద్వారా వాయు కాలుష్యం ఏర్పడిదంటె ఊపిరితిత్తులకు ఇనఫెక్షన్స్ వచ్చి ఆరోగ్యాలకు, ప్రాణాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నందున సిమెంట్ పరిశ్రమ యజమాన్యం వెంటనే ఆలోచన చేసుకొని వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇక్కడి ప్రాంత ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23 న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రోజునే ఫ్యాక్టరీ యాజమాన్యం స్థాపనను నిలిపి వేస్తున్నామని ప్రకటన చేయాలని ఇదే ప్రదేశంలో వేరే ఫ్యాక్టరీ పెట్టాలని అందుకు ప్రజలు అందరూ స్వాగతిస్తారని ఆయన అన్నారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కారిక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి నర్సింహా, సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, నాయకులు బుర్ర శ్రీశైలం, బాలగోని గణేష్, కందుకూరి దుర్యోదన్ రేపాక రమేష్, తీర్పల ఐలయ్య, గోపగోని సహదేవ, పి లింగస్వామి, గోలి అంజయ్య, పొట్లచెరువు లింగయ్య, ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకిటి శ్రీను, కార్యదర్శి దగ్గుల నవీన్. మోటే నరేష్ గోపగో ని భాస్కర్, బెల్లి మృత్యుంజయ్, జాల లింగస్వామి, జాల జంగయ్య గోలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Oct 21 2024, 06:42