/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz అంబుజా సిమెంట్ పరిశ్రమ రద్దు అయ్యేంతవరకు పోరాటం ఆగదు : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్ Vijay.S
అంబుజా సిమెంట్ పరిశ్రమ రద్దు అయ్యేంతవరకు పోరాటం ఆగదు : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్

రామన్నపేట కొమ్మయిగూడెం మరియు సిరిపురం పరిధిలో అంబుజా సిమెంట్ పరిశ్రమ పెట్టే నిర్ణయాన్ని యాజమాన్యం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొమ్మాయిగూడెం లారీ మరియు ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కుమ్మయిగూడెం నుండి రామన్నపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కంపెనీ ప్రధాన గేటు వద్ద నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ అంబుజా సిమెంటు ఫ్యాక్టరీ వల్ల అన్ని రకాలుగా, ప్రజలందరికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, రైతులు పండించె వరి, పత్తి లాంటి పంటలకు, దుమ్ము ధూళి పారి పెట్టిన పెట్టుబడి కూడ వచ్చే పరిస్థితి ఉండదని, పంట కూడా పూర్తిగా నష్టాల బారిన పడే ప్రమాదం ఉందని, ప్రధానంగా సిమెంటు ఫ్యాక్టరీ ద్వారా వచ్చే పొగ, యాష్ పౌడర్ గాలిలో కలుస్తుంది కావున వాయు కాలుష్యం ఏర్పడి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని, ఇప్పుడున్న కల్తీ వస్తువులతో తినే తిండి, నీరు కలుషితం అయ్యి రకరకాల రోగాలబారిన పడుతుంటె, ఇప్పుడు ఈ సిమెంటు ఫ్యాక్టరీ ద్వారా వాయు కాలుష్యం ఏర్పడి మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందని, ఫ్యాక్టరీ ద్వారా వాయు కాలుష్యం ఏర్పడిదంటె ఊపిరితిత్తులకు ఇనఫెక్షన్స్ వచ్చి ఆరోగ్యాలకు, ప్రాణాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నందున సిమెంట్ పరిశ్రమ యజమాన్యం వెంటనే ఆలోచన చేసుకొని వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇక్కడి ప్రాంత ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23 న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రోజునే ఫ్యాక్టరీ యాజమాన్యం స్థాపనను నిలిపి వేస్తున్నామని ప్రకటన చేయాలని ఇదే ప్రదేశంలో వేరే ఫ్యాక్టరీ పెట్టాలని అందుకు ప్రజలు అందరూ స్వాగతిస్తారని ఆయన అన్నారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కారిక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరి నర్సింహా, సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బత్తుల సత్యం, ప్రధాన కార్యదర్శి శివరాత్రి సమ్మయ్య, నాయకులు బుర్ర శ్రీశైలం, బాలగోని గణేష్, కందుకూరి దుర్యోదన్ రేపాక రమేష్, తీర్పల ఐలయ్య, గోపగోని సహదేవ, పి లింగస్వామి, గోలి అంజయ్య, పొట్లచెరువు లింగయ్య, ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకిటి శ్రీను, కార్యదర్శి దగ్గుల నవీన్. మోటే నరేష్ గోపగో ని భాస్కర్, బెల్లి మృత్యుంజయ్, జాల లింగస్వామి, జాల జంగయ్య గోలి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
దళారుల పాలయ్యాక ధాన్యం కొంటారా? ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలి. అఖిల భారత రైతు సంఘం జిల్లా కార్యదర్శి :బేజాడి కుమార్ డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రైతులు వరి ధాన్యం పండించినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రం చేపట్టకపోవడం వల్ల దానిని దళారులు ఆసరా చేసుకుని రైతుల దగ్గర నుండి ధాన్యం తక్కువ ధరకు రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. రైతుల ధాన్యాన్ని దళారుల పాలయ్యాక దాన్యం కొంటారా అని ప్రభుత్వాన్ని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బేజాడి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఆదివారం రోజున అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. దానికి అధ్యక్షతన చిరబోయిన రాజయ్య అధ్యక్షతన ఆలేరు న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరుగగా ఈ సమావేశంలో కుమార్ పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఇప్పటికే రైతులు 50 శాతం పైగా వరి చెల్లు కోసి‌ ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారని అన్నారు. మార్కెట్లలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, వరి ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి పట్టాలు లేకా అకాల వర్షాలు వస్తుండడంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గత పంట సందర్భంలో కూడా ధాన్యం కొనుగోలు వెను వెంటనే కోనుగోలు చెయ్యకపోవడంతో వర్షాలు పడి ధాన్యం తడిసి మోలకెత్తడంతో రైతులు ఆధాన్యాన్ని అమ్మడం కోసం అనేక ఇబ్బందులు పడి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నారని అన్నారు. అందుకనే ప్రభుత్వం గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించి అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ ఎన్నికల వాగ్దానాలలో వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నేడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం సరైనది కాదని దీని పూర్తిగా విరమించుకోవాలని రైతులు పండించిన అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో ఎక్కడ కూడా రైతులకు నష్టం జరగకుండ చూడాలని, కొనుగోలు చేసే సందర్భంలో రైతులకు వివిధ రకాల కారణాలు చూపి కోత విధించకుండ చూడాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఇస్తూ క్వింటాలుకు ధాన్యాన్ని ఏమాత్రం తరుగు తీసేయకుండా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు తమ్ముడి అంజయ్య సహాయ కార్యదర్శి పిన్నపు రాఘవరెడ్డి, జిల్లా నాయకులు బర్మ బాబు, కొమ్మిడి గోపాల్ రెడ్డి, వంగల నరసింహారెడ్డి ,చిరబోయిన కొమురయ్య కర్రె బీరయ్య తదితరులు పాల్గొన్నారు
జై భీం సేన ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ కమిషన్ కి వినతి పత్రం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామ జై భీమ్ సేన ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా హైదరాబాదులోని డిప్యూటీ డైరెక్టర్ ,షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. జై భీమ్ సేన అధ్యక్షులు వల్లమల్ల రత్నయ్య మాట్లాడుతూ వర్గీకరణ ఉప కులాల వారీగా కాకుండా అన్ని కులాలకు సమ న్యాయంగా పంచాలని అన్నారు .వివిధ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయంగా సర్వే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేన గౌరవ అధ్యక్షులు సంగిశెట్టి సుందర్ రావు , గౌరవ సలహాదారులు వల్ల మల్ల స్వామి, ఉపాధ్యక్షులు కట్ట సురేష్ , వల్ల మల్ల రాజు, జాయింట్ సెక్రెటరీ సంగిశెట్టి రమేష్, ఎర్ర మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు .
హనుమాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా గుంతలు, మరమ్మత్తులు చేపట్టాలన్న ములాయం సింగ్ యాదవ్ బి గ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హనుమపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద రోడ్డు గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణికులు,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి పై ఇనుప చూవ్వలు తేలడంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయని ములాయం సింగ్ యాదవ్ యూత్ బి గ్రేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆరోపించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
విద్యా కమిషన్ సలహాదారులుగా ఆర్ వెంకట్ రెడ్డి నియామకం ,హర్షం వ్యక్తం చేసిన ప్రజాసంఘాలు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్యాహక్కు పరిరక్షణ, బాల్య వివాహాల సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణంలో గత రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డిని తెలంగాణా రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులుగా నియమిస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్. వెంకట్ రెడ్డి పిల్లల విద్య కోసం తెలంగాణ తో పాటు జాతీయ స్థాయిలో స్వచ్చంద సంస్థలతో అంతర్జాతీయంగా “స్టాప్ చైల్డ్ లేబర్ కాంపెయిన్" భాగస్వామ్య దేశాలైన ఉగాండా, కెన్యా, ఇథియోపియా, ఘన, మాలి, మొరాకో తదితర దేశాల్లో ఆయన పని చేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో రాష్ట్రంలోని సామాజిక కార్యకర్తలను ఒక వేదికగా ఏర్పాటు చేసి చురుకైన పాత్ర పోషించారు. బాలల పక్షపాతిగా ఉంటూ నాణ్యమైన విద్య పిల్లల హక్కు అని, పిల్లలు మన జాతీయ సంపద అంటూ , నిరంతరం పిల్లల కోసం పనిచేస్తున్న ఆర్. వెంకట్ రెడ్డి సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ సలహాదారులుగా నియమించిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్, తల్లుల సంఘం, అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు ఎర్ర శివరాజ్, కొడారి వెంకటేష్, ఆవుల వినోద్ కుమార్, బొక్క రాంబాయి, వగ్గు క్రిస్టోఫర్, పురుషోత్తం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ పట్టణానికి చెందిన గుంజ చిన్న నరసింహ అకస్మాత్తుగా మరణించారని సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వారిని పరామర్శించి నా AJRఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి , టీముని పంపించి ఆ కుటుంబ సభ్యులకి వారి యొక్క కుమారుడికి గుంజ రాంబాబు గారికి (AJR సేవ ఫౌండేషన్) ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో వారి దశదినకర్మ కు (5000వేల రూపాయలు ) అందజేశారు.. ఈ కార్యక్రమంలో వలిగొండ గ్రామ ప్రజలు AJR Team పాల్గొన్నారు.
తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

అరూరు గ్రామం వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు గొడుగు లక్ష్మయ్య మరణించడం జరిగినది .వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తుమ్మల నరసయ్య సేవా సమితి అధ్యక్షులు కసరబోయిన లింగయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి వలిగొండ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య మాజీ సర్పంచ్ చెమ్మయ్య వలిగొండ మండల కార్యదర్శ యాదయ్య కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండారు మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఆవుల సత్యనారాయణ హై స్కూల్ చైర్మన్ జినుకల మల్లేశా ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య తుమ్మల నరసయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్ బత్తి వెంకటేశం మీసాల మచ్చి కాంగ్రెస్ నాయకులు కసర బోయిన నరసింహ వేముల ఎట్టయ్య ఎరుపుల స్వామి సత్తయ్య అబ్బాయి రాజు యాట రమేష్ నరాల మహేష్ జక్కుల లక్ష్మయ్య జిలకర బాల నరసింహ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వద్దని జాయింట్ కలెక్టర్ కు వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఆదాని గ్రూప్ ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వద్దని కోరుతూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ వెన్ షాలోమ్ కి రామన్నపేట అఖిలపక్ష పార్టీల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ద కంట్రీ సైడ్ పోర్ట్రైట్ సినిమాలో ప్రేక్షకుల హృదయాలను దోచిన నీలం నరేష్ నటన

17-10-2024 రోజునా ద కంట్రీసైడ్ పోర్ట్రైట్" సినిమా లో నీలం నరేష్ నటన ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది... సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి, రెండో అంతస్తు, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సినిమా "ద కంట్రీసైడ్ పోర్ట్రైట్" తెలుగు డెమో ఫిల్మ్ ప్రదర్శన జరిగింది ... వచ్చి నన్ను మా టీమ్ ను ఆశీర్వదిఛీ నందుకు మీ అందరికి ధన్యవాదాలు ఇ సినిమా లో ని ముఖ్య ఉదేశ్యం నిరుద్యోగవల్ల పేదరికం ఏర్పడితే పేదరికం వల్ల దొంగతనం జరుగుతాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా.. దర్శకుడు సందీప్ జెండా అద్భుతంగా తీయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ,మైమ్ మధు నటుడు,అంజి వల్గమాన్ నటుడు దర్శకుడు, అజయ్ మకెనేపల్లి నటుడు దర్శకుడు, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి పట్టణంలో 8వ వార్డులో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఆధ్వర్యంలో డ్రైడే - ఫ్రైడే కార్యక్రమం

భువనగిరి జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఆధ్వర్యంలో దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వార్డులో అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లతో కలియతిరిగిన కౌన్సిలర్..నీటి నిల్వ ఉన్న వాటర్ సంపులు, కుండీలు, నీటి తొట్టిలను పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. విష జ్వరాలకు కారణమయ్యే…దోమల నివారణకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజులకు ఒకసారి నీటితొట్టిలను శుభ్రపర్చుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమం లొ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ వైజర్ Dr. భాషీరద్ధిన్ ఏ యన్ యమ్. తార. ఏ యన్ యం ప్రేమలత ఆశా వర్కర్ ఇందిరా జ్యోతి అంగన్వాడీ టీచర్ నాగమణి.సబితా గోపాల్. పావని విజయ. లక్ష్మి అనిత ఆశీఫ్ రమేష్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు