NLG: ఘనంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలు
నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం:
హాలియా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ నివాసంలో ఆయన జన్మదిన వేడుకలు నియోజకవర్గ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భగత్ కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదాన శిభిరం నిర్వహించి, మొక్కను నాటారు. వారు మాట్లాడుతూ.. నా పై అభిమానంతో విచ్చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గం లోని నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ ధన్యవాదములు అని తెలిపారు.
మీ అభిమానం, ఆశీస్సులు, మీరు చూపిస్తున్న ప్రేమ ఎల్లప్పుడు నాపై ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.అనంతరం నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Oct 10 2024, 22:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
24.8k